అన్వేషించండి

IPL Auction 2022: వార్నర్‌కు ధరాఘాతం! చీప్‌గా కొట్టేసిన దిల్లీ క్యాపిటల్స్‌ - పాంటింగ్‌ వ్యూహం సక్సెస్‌!

IPL Mega Auction 2022: వేలానికి ముందు డేవిడ్‌ వార్నర్‌ భారీ ధర పలుకుతాడని అంచనా వేశారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. దిల్లీ క్యాపిటల్స్‌ అతడిని రూ.6.25 కోట్లకే దక్కించుకుంది. నిజం చెప్పాలంటే అతడిని తక్కువ ధరకు కొట్టేసినట్టే అనుకోవాలి!

IPL Mega Auction 2022: ఐపీఎల్‌ మ్యాచులు, ఐపీఎల్‌ వేలానికి తేడా ఉండదు! ఎప్పుడెలా సాగుతాయో ఊహించడం కష్టం! వేలానికి ముందు డేవిడ్‌ వార్నర్‌ (David Warner) భారీ ధర పలుకుతాడని అంచనా వేశారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. దిల్లీ క్యాపిటల్స్‌ అతడిని రూ.6.25 కోట్లకే దక్కించుకుంది. నిజం చెప్పాలంటే అతడిని తక్కువ ధరకు కొట్టేసినట్టే అనుకోవాలి!

Delhi Capitals ఆసక్తి

వేలంలో డేవిడ్‌ వార్నర్‌ పేరు రాగానే అందరికీ ఆసక్తి కలిగింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ అతడి కోసం సరదాకైనా ఒకసారి బిడ్‌ వేస్తుందా అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఆక్షనీరు అతడి పేరు చెప్పగానే ఒక నిమిషం అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. మొదట దిల్లీ అతడికి బిడ్‌ వేసింది. వెంటనే చెన్నై సూపర్‌ కింగ్స్‌ రంగంలోకి దిగింది. ఆపై ముంబయి ఇండియన్స్‌ ప్రవేశించింది. దాంతో చూస్తుండానే అతడి ధర రూ.6 కోట్లకు చేరుకుంది. ఆపై దిల్లీ రూ.6.25 కోట్లకు బిడ్‌ వేసింది. తర్వాత ఎవరూ స్పందించకపోవడంతో అనుకున్న స్థాయి కన్నా తక్కువ ధరకే వార్నర్‌ అమ్ముడుపోయాడు.

తెరవెనుక Ricky Ponting వ్యూహం

దిల్లీ క్యాపిటల్స్‌ డేవిడ్‌ వార్నర్‌ను తీసుకోవడం వెనక మంచి వ్యూహమే ఉంది! ఆ జట్టు కోచ్‌, మెంటార్‌ రికీపాంటింగ్‌ తెలివిగా ఆలోచించాడు. వాస్తవంగా బహుళ జట్లు ఆడే టోర్నీల్లో ఓపెనర్ శిఖర్ ధావన్‌కు తిరుగులేదు. అతడి కోసం దిల్లీ ప్రయత్నించినా ఎక్కువ ధరతో పంజాబ్‌ కింగ్స్‌ అతడిని కొనేసింది. దాంతో దూకుడుగా ఆడే ఎడమచేతి వాటం ఆటగాడి కోసం దిల్లీ క్యాపిటల్స్‌ ప్రయత్నించింది. ఆ లక్షణాలన్నీ వార్నర్‌లో ఉన్నాయి. నాయకత్వ బాధ్యతలు పంచుకోగలడు. ఓపెనింగ్‌ చేయగలడు. ప్రత్యర్థిని ఊచకోత కోయగలడు. పైగా దిల్లీకి కుడిచేతి వాటం ఓపెనర్‌ పృథ్వీ షా ఉన్నాడు. అతడికి వార్నర్‌ కలవడంతో ఓపెనింగ్‌ జోడీ భయంకరంగా మారుతుంది. నిజానికి వార్నర్‌ ఐపీఎల్‌ కెరీర్‌ దిల్లీతోనే మొదలైంది.

IPLలో అత్యంత విజయవంతమైన విదేశీ ఆటగాడు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో అత్యంత విజయవంతమైన విదేశీ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌. ప్రతి సీజన్లో అతడు 500+ పరుగులు చేస్తాడు. గతేడాది అంతగా ఫామ్‌లో లేడు. కానీ ఐసీసీ టీ20 ప్రపంచకప్‌తో ఫామ్‌లోకి వచ్చాడు. జట్టుకు ట్రోఫీ అందించాడు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 150 ఇన్నింగ్సుల్లో 42 సగటు, 139 స్ట్రైక్‌రేట్‌తో 5,449 పరుగులు చేశాడు. నాలుగు సెంచరీలు, 50 అర్ధశతకాలు దంచేశాడు. లీగులో 69 మ్యాచులకు సారథ్యం వహించగా 35 గెలిచి 33 ఓడాడు. ప్రస్తుతం మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. తక్కువ ధర పలికాడు కాబట్టి కసిగా పరుగులు చేసే అవకాశం ఉంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy :  ఎన్టీఆర్ డైలాగ్‌తో కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి వార్నింగ్ - హైటెన్షన్ కరెంట్ వైర్‌తో  పోల్చుకుని
ఎన్టీఆర్ డైలాగ్‌తో కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి వార్నింగ్ - హైటెన్షన్ కరెంట్ వైర్‌ తో పోల్చుకుని ...
Rana Naidu 2: ‘రానా నాయుడు 2’లో ‘ఏజెంట్’ విలన్ - పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో!
‘రానా నాయుడు 2’లో ‘ఏజెంట్’ విలన్ - పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో!
Pawan Kalyan: పిఠాపురంలో నేను గెలిస్తే వర్మ గెలిచినట్లే, కూటమి విజయమే ఉమ్మడి లక్ష్యం: పవన్ కళ్యాణ్
Pawan Kalyan: పిఠాపురంలో నేను గెలిస్తే వర్మ గెలిచినట్లే, కూటమి విజయమే ఉమ్మడి లక్ష్యం: పవన్ కళ్యాణ్
TSPSC: 'గ్రూప్‌-2' అభ్యర్థులకు అలర్ట్, రివైజ్డ్‌ ఖాళీల వివరాలు వెల్లడి
TSPSC: 'గ్రూప్‌-2' అభ్యర్థులకు అలర్ట్, రివైజ్డ్‌ ఖాళీల వివరాలు వెల్లడి
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Gems Sikakulam Mdical College Studnets on AP Elections | 2024 ఎన్నికలపై స్టూడెంట్స్ మనోగతం | ABPLoksabha Elections 2024 | వీళ్లకు రెండు రాష్ట్రాల్లో రెండు ఓట్లు ఉంటాయి..కానీ.! | ABP DesamHappy Days Rerelease Public Talk | హ్యాపీడేస్ సినిమా రీరిలీజ్ తో థియేటర్ల దగ్గర యూత్ సందడి | ABPAsaduddin Owaisi vs Raja singh | బీఫ్ షాపు జిందాబాద్ అన్న ఓవైసీ.. ఫైర్ అవుతున్న రాజాసింగ్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy :  ఎన్టీఆర్ డైలాగ్‌తో కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి వార్నింగ్ - హైటెన్షన్ కరెంట్ వైర్‌తో  పోల్చుకుని
ఎన్టీఆర్ డైలాగ్‌తో కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి వార్నింగ్ - హైటెన్షన్ కరెంట్ వైర్‌ తో పోల్చుకుని ...
Rana Naidu 2: ‘రానా నాయుడు 2’లో ‘ఏజెంట్’ విలన్ - పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో!
‘రానా నాయుడు 2’లో ‘ఏజెంట్’ విలన్ - పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో!
Pawan Kalyan: పిఠాపురంలో నేను గెలిస్తే వర్మ గెలిచినట్లే, కూటమి విజయమే ఉమ్మడి లక్ష్యం: పవన్ కళ్యాణ్
Pawan Kalyan: పిఠాపురంలో నేను గెలిస్తే వర్మ గెలిచినట్లే, కూటమి విజయమే ఉమ్మడి లక్ష్యం: పవన్ కళ్యాణ్
TSPSC: 'గ్రూప్‌-2' అభ్యర్థులకు అలర్ట్, రివైజ్డ్‌ ఖాళీల వివరాలు వెల్లడి
TSPSC: 'గ్రూప్‌-2' అభ్యర్థులకు అలర్ట్, రివైజ్డ్‌ ఖాళీల వివరాలు వెల్లడి
ITR 2024: ఐటీ రిటర్న్‌ ఫైల్‌ చేసే ముందు ఒకటికి రెండుసార్లు చెక్‌ చేయాల్సిన విషయాలివి
ఐటీ రిటర్న్‌ ఫైల్‌ చేసే ముందు ఒకటికి రెండుసార్లు చెక్‌ చేయాల్సిన విషయాలివి
Telangana Candidates Assets: ఇల్లు లేని బండి, కేసుల్లేని కిషన్ రెడ్డి- తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థుల ఆస్తులు-అప్పుల వివరాలు ఇవే
ఇల్లు లేని బండి, కేసుల్లేని కిషన్ రెడ్డి- తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థుల ఆస్తులు-అప్పుల వివరాలు ఇవే
Duvvada Srinivas: టెక్కలిలో ఇండిపెండెంట్ బరిలో దువ్వాడ వాణి - దువ్వాడ శ్రీనివాస్ స్పందన ఇదే!
టెక్కలిలో ఇండిపెండెంట్ బరిలో దువ్వాడ వాణి - దువ్వాడ శ్రీనివాస్ స్పందన ఇదే!
Weather Latest Update: తెలంగాణలో కూల్ వెదర్‌- హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో కూల్ వెదర్‌- హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు
Embed widget