IPL Auction 2024: అత్యంత ఖరీదైన ఆటగాడిగా పాట్ కమిన్స్, ధర అచ్చంగా రూ.20.50 కోట్లు
Pat Cummins IPL Auction 2024: ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా ప్యాట్ కమిన్స్ నిలిచాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ 20.50 కోట్లకు కొనుగోలు చేసింది.
Most Expensive Player IPL History: ఐపీఎల్ 2024 మినీ వేలం ఉత్సాహంగా జరుగుతోంది. ఈసారి వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడుగా పాట్ కమిన్స్ (Pat Cummins) నిలిచాడు. కోట్ల బేస్ ప్రైస్‌తో దిగిన పాట్ కమ్మిన్స్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ మొత్తాన్ని పెట్టి కమిన్స్ను కొనుగోలు చేసింది. ముందుగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఇతని కోసం పోటీ పడ్డాయి. మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ఎంట్రీతో పూర్తిగా మారిపోయింది.
ఆస్ట్రేలియా ఆటగాడు ప్యాట్ కమిన్స్ బేస్ ప్రైస్ రూ.2 కోట్లు. కమిన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ తొలి బిడ్ వేసింది. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ రూ.4.80 కోట్ల వరకు పాడింది. ఆ తర్వాత ఆర్సీబీ బరిలోకి దిగింది. 7.60 కోట్ల వరకు చెన్నై వేలంలో ఉంది. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ జోరు కొనసాగింది. 20.50 కోట్లకు కొనుగోలు చేసింది.
కెప్టెన్ పాట్ కమ్మిన్స్ తన నాయకత్వంలో ఆస్ట్రేలియాకు ఆరో ప్రపంచకప్‌ను అందించాడు. ఫైనల్ లో వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచిన టీమిండియాను ఓడించి మరీ తన జట్టును విశ్వ విజేతగా నిలిపాడు. అందుకే ఇప్పుడు ఫ్రాంచైజీల దృష్టి కూడా కమిన్స్‌పై పడింది. 2018 ఐపీఎల్ వేలంలో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సామ్‌కరన్‌ను పంజాబ్ కింగ్ రూ.18.50 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకున్న రికార్డును కమిన్స్ బద్దలు కొట్టాడు.
ఐపీఎల్ వేలంలో మొత్తం 1166 మంది ఆటగాళ్లు పేర్లు నమోదు చేసుకోగా..ఐపీఎల్ పాలకవర్గం మొత్తం ఈ జాబితాను పది ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు అందించింది. ఆటగాళ్లపై ఫ్రాంఛైజీల ఆసక్తి ఆధారంగా జాబితాను 333కు కుదించింది. ఇందులో 214 మంది భారతీయులు, 119 మంది విదేశీయులు, అసోసియేట్ దేశాల నుంచి ఇద్దరు ఉన్నారు. హర్షల్ పటేల్, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్ కనీస ధర రూ.2 కోట్లు ఉన్న ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. వేలంలో ఖర్చు పెట్టడానికి ఫ్రాంఛైజీల వద్ద మొత్తం రూ.262.95 కోట్లు ఉన్నాయి. మొత్తం 77 మంది నుంచి గరిష్టంగా 30 మంది విదేశీ క్రికెటర్లను జట్లు కొనుక్కోవచ్చు. ఈసారి వేలంలో స్టార్ ఆటగాళ్లు చాలామంది ఉన్నారు. వన్డే ప్రపంచకప్ ఆస్ట్రేలియా గెలవడంలో కీలకపాత్ర పోషించిన ట్రావిస్ హెడ్ ను సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. మంచి ఫామ్‌లో ఉన్న ఆస్ట్రేలియా ఆటగాడిని రూ.6.8 కోట్లకు తన టీంలోకి రప్పించుకుంది. రూ. 2 కోట్ల బేస్ ప్రైస్‌తో వేలానికి వచ్చిన హెడ్‌ను దక్కించుకోవడం కోసం హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడినప్పటికీ కావ్య మారన్ చివరి వరకూ పట్టు విడువలేదు.
ఇదే పంథా లో ఆస్ట్రేలియా ఆటగాడు ప్యాట్ కమిన్స్ విషయంలో కూడా ముందుకు వెళ్ళింది సన్‌రైజర్స్ హైదరాబాద్ . బేస్ ప్రైస్ రూ.2 కోట్లు. కమిన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ తొలి బిడ్ వేసింది. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ రూ.4.80 కోట్ల వరకు పాడింది. ఆ తర్వాత ఆర్సీబీ బరిలోకి దిగింది. 7.60 కోట్ల వరకు చెన్నై వేలంలో ఉంది. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ జోరు కొనసాగింది. 20.50 కోట్లకు కొనుగోలు చేసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎందరో యువకుల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసింది. 2008లో ప్రారంభమైన ఈ లీగ్ విజయవంతంగా.. 16 సీజన్‌లు పూర్తి చేసుకుంది. అనతి కాలంలోనే రిచ్చెస్ట్ క్రికెట్ లీగ్‌గా నిలిచింది. ఈ లీగ్‌లో ఒక్కసారైనా ఆడితే చాలు అని అనుకునే ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు.