RR vs KKR Match abandoned: వర్షం కారణంగా కోల్‌కత్తా, రాజస్థాన్ మ్యాచ్ రద్దు - అదృష్టమంటే సన్‌రైజర్స్‌దే!
RRvKKR match has been abandoned: కోల్‌కత్తాపై విజయం సాధించి రాజస్థాన్ క్వాలిఫయర్-1 కు అర్హత సాధించాలనుకున్న మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. టాస్ అనంతరం మరోసారి వర్షం కారణంగా మ్యాచ్ రద్దు చేశారు.
KKR vs RR match has been abandoned | గువాహటి: ఐపీఎల్ 2024లో లీగ్ దశలో చివరి మ్యాచ్ వర్షం వల్ల రద్దు అయింది. ఆదివారం రాత్రి రాజస్థాన్, కోల్‌కతా జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేశారు. టాప్ 2 ప్లేస్ కన్ఫామ్ చేసుకోవడానికి రాజస్థాన్ కు ఈ మ్యాచ్ నెగ్గడం తప్పనిసరి. కానీ టాస్ అనంతరం ఒక్క బంతి కూడా పడకుండానే RRvsKKR మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. గువాహటి వేదికగా మ్యాచ్ జరగాల్సి ఉండగా.. సాయంత్రం నుంచే ఇక్కడ వర్షం కురిసింది. కొన్ని గంటలకు వర్షం తగ్గడంతో ఓవర్లు కుదించి మ్యాచ్ నిర్వహించాలని అంపైర్లు భావించారు.
కరుణించిన ఆకాశం - హైదరాబాద్‌కు కలిసొచ్చిన అదృష్టం
స్టేడియం అంతా రెడీ చేసిన అనంతరం 7 ఓవర్ల మ్యాచ్ నిర్వహించాలని నిర్ణయించారు. టాస్ నెగ్గిన కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలింగ్ ఎంచుకుంది. దాదాపు 10:45 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. మరోసారి వర్షం మొదలైంది. దాంతో మ్యాచ్ నిర్వహించే పరిస్థితి లేదని అంపైర్లు కేకేఆర్, రాజస్థాన్ మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ క్వాలిఫయర్ 1కు అర్హత సాధించింది. సన్ రైజర్స్ కు వర్షం ద్వారా కలిసొచ్చి లీగ్ స్టేజ్ లో రెండో స్థానానికి చేరుకుంది.
After 7️⃣0️⃣ matches of hard-fought cricket, a final look at the #TATAIPL 2024 Points Table 🙌
— IndianPremierLeague (@IPL) May 19, 2024
Did your favourite team qualify for the Playoffs? 🤔 pic.twitter.com/s3syDvL6KH
కోల్‌కత్తాపై నెగ్గి పాయింట్స్ టేబుల్ లో రెండో స్థానంలో నిలవాలనుకున్న రాజస్థాన్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. మ్యాచ్ రద్దుతో కేకేఆర్, రాజస్థాన్ కు చెరో పాయింట్ లభించింది. సన్‌రైజర్స్, రాజస్థాన్ 17 పాయింట్లతో ఉండగా, మెరుగైన రన్ రేట్ కలిగిన హైదరాబాద్ టీమ్ రెండో స్థానానికి చేరి క్వాలిఫయర్ 1కు అర్హత సాధించినట్లయింది. ఐపీఎల్ సీజన్ 17 లీగ్ స్టేజీలో కోల్‌కతా నెంబర్ 1గా నిలిచింది. అహ్మదాబాద్ వేదికగా కోల్‌కతా, హైదరాబాద్ జట్ల మే 21న మధ్య క్వాలిఫయర్-1 జరగనుంది. నెగ్గిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరగా.. ఓడిన జట్టు బుధవారం ఆర్సీబీ, రాజస్థాన్‌ల మధ్య జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో తలపడనుంది.
ఆత్మ విశ్వాసంతో కోల్‌కత్తా
గౌతమ్ గంభీర్ చేరికతో కోల్‌కత్తాలో పునరుత్సాహం కనిపిస్తోంది. గతంలో 2012, 2014 సీజన్లలో కెప్టెన్ గా కేకేఆర్‌కు ఐపీఎల్ ట్రోఫీలు అందించాడు గంభీర్. ఇప్పుడు మెంటార్‌గా వ్యవహరిస్తున్న గౌతీ జట్టు కొత్త బలాన్నిచ్చాడు. ఈ సీజన్‌లో కేకేఆర్ పూర్తి ఆత్మ విశ్వాసంతో ఉంది. వాస్తవానికి రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ఓడిపోయినా కోల్‌కత్తా నెంబర్ వన్‌గా కొనసాగుతుంది. ఓపెనర్లు సాల్ట్, సునీల్ నరైన్ బ్యాట్‌తో అద్భుతాలు చేస్తున్నారు. ఓపెనింగ్ జోడీ జట్టు సగం భారాన్ని తగ్గిస్తోంది. ఆండ్రీ రస్సెల్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, వెంకటేశ్ అయ్యర్, వరుణ్ చక్రవర్తి రాణించడంతో కోల్‌కత్తా నెంబర్ వన్‌గా లీగ్ స్టేజీని ముగించింది.