IPL 2024: మళ్లీ మెరిసిన రియాగ్, సంజూ - గుజరాత్ ముందు బిగ్ టార్గెట్
RR vs GT: గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రియాన్ పరాగ్, సంజు శాంసన్ మెరవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.
IPL 2024 RR vs GT Gujarat Titans target 198 : గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. భారీ స్కోరు చేసింది. రియాన్ పరాగ్, సంజు శాంసన్ మరోసారి మెరవడంతో నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ 48 బంతుల్లో 3 ఫోర్లు, అయిదు సిక్సర్లతో 76 పరుగులు చేశాడు. చివరి వరకు క్రీజులో నిలిచిన సంజు శాంసన్ 38 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 68 పరుగులతో అజేయంగా నిలిచాడు. వర్షం కారణంగా మ్యాచ్ నిర్ణీత సమయం కంటే కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. యశస్వీ జైస్వాల్ 24 పరుగులతో పర్వాలేదనిపించాడు. గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా ఆరంభంలో పరుగులు రావడం గగనమైపోయింది. కానీ క్రీజులో కుదురుకున్నాక రియాన్ పరాగ్, సంజు శాంసన్ స్వేచ్ఛగా పరుగులు చేశారు.
మళ్లీ ఆ ఇద్దరే
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌కు పర్వాలేదనిపించే ఆరంభం దక్కింది. ఈ సీజన్‌లో వరుసగా విఫలమవుతున్న యశస్వీ జైస్వాల్ వరుసగా బౌండరీలు బాది టచ్‌లో కనిపించాడు. తొలి వికెట్‌కు 4.2 ఓవర్లలో 32 పరుగులు చేసిన అనంతరం యశస్వీ జైస్వాల్ అవుటయ్యాడు. 24 పరుగులు చేసిన యశస్వీ జైస్వాల్‌ను ఉమేశ్ యాదవ్ అవుట్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే గత మ్యాచ్‌లో సెంచరీ హీరో జోస్ బట్లర్ త్వరగానే పెవిలియన్ చేరాడు. 10 బంతుల్లో ఎనిమిది పరుగులు చేసిన బట్లర్‌ను రషీద్‌ఖాన్ అవుట్ చేశాడు. ఆ తర్వాత సంజు శాంసన్, రియాన్ పరాగ్ మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడారు. మరో వికెట్ పడకుండా ఇద్దరూ గుజరాత్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఆరంభంలో ఆచితూచి ఆడిన ఈ ఇద్దరు తర్వాత వేగంగా పరుగులు రాబట్టారు. గుజరాత్ బౌలర్లు కూడా ఆరంభంలో రాజస్థాన్ బ్యాటర్లను కట్టడి చేశారు. రియాన్ పరాగ్, సంజు శాంసన్ మరోసారి మెరవడంతో నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ 48 బంతుల్లో 3 ఫోర్లు, అయిదు సిక్సర్లతో 76 పరుగులు చేశాడు. మోహిత్ శర్మ బౌలింగ్‌లో రియాన్ పరాగ్ అవుటయ్యాడు.చివరి వరకు క్రీజులో నిలిచిన సంజు శాంసన్ 38 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 68 పరుగులతో అజేయంగా నిలిచాడు. గుజరాత్ బౌలర్లలో ఉమేష్ యాదవ్ ఒకటి... రషీద్ ఖాన్ ఒక వికెట్ తీశారు. మోహిత్ శర్మ కూడా ఒక వికెట్ తీశాడు. రషీద్ ఖాన్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
గుజరాత్ తీరు మారేనా..?
ఈ ఐపీఎల్‌లో ఇప్పటివరకూ అయిదు మ్యాచులు ఆడిన గుజరాత్... రెండు విజయాలు.. మూడు పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని జట్టు... వరుస పరాజయాల నుంచి బయటపడాలని చూస్తోంది. గిల్ ఫామ్‌లోనే ఉన్నా అతనికి వేరే బ్యాటర్ల నుంచి మద్దతు కరువవుతోంది. గిల్ ఐదు మ్యుచుల్లో 147 స్ట్రైక్ రేట్‌తో 183 పరుగులు చేశాడు. సాయి సుదర్శన్ కూడా పరుగులు చేస్తూనే ఉన్నాడు. ఆఫ్ఘన్ త్రయం అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంది.