IPL 2024: రాజస్థాన్ రాయల్స్ విజయమా, ఢిల్లీ దరహాసమా ? - పంత్‌పై కెప్టెన్సీ భారం
RR vs DC IPL 2024: ఐపీఎల్ 2024లో తొలి మ్యాచ్‌లో పరాజయం పాలైన ఢిల్లీ క్యాపిటల్స్‌తో... విజయంతో ఖాతా తెరిచిన రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి.
ఆత్మవిశ్వాసంతో రాజస్థాన్..
సొంత మైదానంలో ఆడుతుండడం రాజస్థాన్‌తో కలిసిరానుంది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించడం రాజస్థాన్ ఆత్మ విశ్వాసాన్ని పెంచింది. రాజస్థాన్ రాయల్స్ ఓపెనింగ్ జోడీ జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్.. ఢిల్లీ బౌలర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌లను ఎలా ఎదుర్కొంటారో చూడాలి. కెప్టెన్ సంజూ శాంసన్ అజేయంగా 82 పరుగులు చేయడంతో తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. రియాన్ పరాగ్ కూడా రాణించడం రాజస్థాన్‌కు కలిసిరానుంది. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ ఈ మ్యాచ్‌లో కీలకం కానున్నారు. ట్రెంట్ బౌల్ట్ పేస్ కూడా రాజస్థాన్ కీలకంగా మారనుంది.
రాజస్థాన్ రాయల్స్: సంజు శాంసన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, అబిద్ ముస్తాక్, అవేష్ ఖాన్, ధ్రువ్ జురెల్, డోనోవన్ ఫెరీరా, జోస్ బట్లర్, కుల్దీప్ సిన్, కునాల్ సింగ్ రాథోడ్, నాంద్రే బర్గర్, నవదీప్ సైనీ, ప్రసిద్ధ్ కృష్ణ, రవిచంద్రన్ అశ్విన్, రియాన్ పరాగ్, సందీప్ శర్మ , షిమ్రాన్ హెట్మేయర్, శుభమ్ దూబే, రోవ్‌మన్ పావెల్, టామ్ కోహ్లర్-కాడ్‌మోర్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్ మరియు తనుష్ కోటియన్.
ఢిల్లీ క్యాపిటల్స్: రిషబ్ పంత్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, యశ్ ధుల్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, మిచెల్ మార్ష్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్, అన్రిచ్ నోర్ట్జే, కుల్దీప్ యాదవ్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఖలీల్ అహ్మద్ ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్, ట్రిస్టన్ స్టబ్స్, రికీ భుయ్, కుమార్ కుషాగ్రా, రసిఖ్ దార్, రిచర్డ్‌సన్, సుమిత్ కుమార్, స్వస్తిక్ చికారా మరియు షాయ్ హోప్.