అన్వేషించండి
Advertisement
IPL 2024: మెరిసిన విరాట్ కోహ్లీ, కోల్‌కత్తా లక్ష్యం ఎంతంటే ?
RCB vs KKR: బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మెరిశాడు. అద్భుత ఇన్నింగ్స్‌తో బెంగళూరుకు పోరాడే స్కోరును అందించాడు.
IPL 2024 RCB vs KKR kolkatta target 183: బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)మెరిశాడు. అద్భుత ఇన్నింగ్స్‌తో బెంగళూరు(RCB)కు పోరాడే స్కోరును అందించాడు. కోహ్లీకి తోడు కామెరూన్ గ్రీన్, దినేశ్ కార్తీక్ మెరవడంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కోహ్లీ 59 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 83 పరుగులు చేశాడు. గ్రీన్ 21 బంతుల్లో 4 ఫోర్లు, రెండు సిక్సులతో 33 పరుగులు చేయగా... దినేశ్ కార్తీక్ 8 బంతుల్లోనే 3 సిక్సర్లతో 20 పరుగులు చేశాడు.
కోహ్లీ కడదాక నిలిచి..
మిచెల్ స్టార్క్ వేసిన తొలి ఓవర్‌లో ఫోర్‌తో కోహ్లీ పరుగుల ఖాతా తెరిచాడు. హర్షిత్ రాణా వేసిన రెండో ఓవర్‌లో బెంగళూరుకు షాక్ తగిలింది. కెప్టెన్ డు ప్లెసిస్ 8 పరుగులు చేసి అవుటయ్యాడు. మిచెల్ స్టార్క్‌కు క్యాచ్ ఇచ్చి డుప్లెసిస్ పెవిలియన్ బాట పట్టాడుమిచెల్ స్టార్క్ వేసిన మూడో ఓవర్‌లో బెంగళూరు వరుస బౌండరీలు కొట్టింది. కోహ్లీ ఒక సిక్స్, ఫోర్ కొట్టగా.. కామెరూన్ గ్రీన్ బౌండరీ బాదాడు. పవర్ ప్లే పూర్తి.. బెంగళూరు 61 పరుగులు చేసింది. సునీల్ నరైన్ వేసిన ఆరో ఓవర్‌లో 15 పరుగులు వచ్చాయి. చివరి మూడు బంతుల్లో గ్రీన్ 4,4,6 కొట్టాడు. తర్వాత బెంగళూరుకు మరో షాక్ తగిలింది. రస్సెల్ బౌలింగ్‌లో కామెరూన్ గ్రీన్ 33 పరుగులు చేసి ఔటయ్యాడు. పది ఓవర్‌లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. కోహ్లీ 36 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. హర్షిత్ రాణా వేసిన 14వ ఓవర్‌లో మాక్స్‌వెల్ సిక్స్, ఫోర్ కొట్టాడు. తర్వాత నరైన్ బౌలింగ్‌లో మాక్స్‌వెల్ 28 పరుగులు చేసి ఔటయ్యాడు. రస్సెల్ బౌలింగ్‌లో రజత్ పటీదార్ 3 పరుగులు చేసి ఔటయ్యాడు. బెంగళూరు బ్యాటర్ అనుజ్ రావత్‌ను హర్షిత్ రాణా అవుటయ్యాడు. 18 ఓవర్లకు బెంగళూరు 5 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. రస్సెల్ బౌలింగ్‌లో దినేశ్ కార్తీక్ రెండు సిక్స్‌లు కొట్టాడు. ఆఖరి బంతికి దినేశ్ కార్తీక్ రనౌట్ కావడంతో బెంగళూరు 6 వికెట్ల నష్టానికి బెంగళూరు 182 పరుగులు చేసింది.
కోల్‌కత్తా జోరు సాగేనా..?
విధ్వంసకర బ్యాటింగ్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్‌తో బలంగా ఉంది. హైదరాబాద్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కోల్‌కత్తా విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో ఉంది. కానీ ఓపెనర్ల జోడి మారే అవకాశం ఉంది. కోల్‌కత్తాను ఓపెనింగ్ సమస్య ఇంకా వెంటాడుతూనే ఉంది. ఓపెనింగ్ స్థానంపై కోల్‌కత్తా ప్రయోగాలు చేస్తూనే ఉంది. రింకూ సింగ్ కోల్‌కత్తాకు మంచి ఫినిషర్ దొరికాడు. బౌలింగ్ విషయానికి వస్తే, సునీల్ నరైన్, సుయాష్ శర్మ, వరుణ్ చక్రవర్తితో కోల్‌కత్తా స్పిన్ విభాగం బలంగా ఉంది. బ్యాటర్లు, బౌలర్లతో పటిష్టంగా ఉన్న కోల్‌కత్తాతో బెంగళూరుకు హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
సినిమా
తెలంగాణ
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion