అన్వేషించండి
Advertisement
IPL 2024: “18”ను అధిగమిస్తేనే, ప్లే ఆఫ్‌కు బెంగళూరు
RCB vs CSK: చెన్నై సూపర్‌కింగ్స్ కంటే తక్కువ నెట్ రన్‌రేట్ ఉన్న బెంగళూరు, ఎంత తేడాతో గెలిస్తే ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుందన్న అందరికీ ఉన్న ప్రశ్న . ఈ మ్యాచ్ లో బెంగళూరు ఎలా గెలవలంటే ..
Conditions For RCB to Reach Playoff: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో అసలు సిసలు సమరానికి రంగం సిద్ధమైంది. వరుస విజయాలతో మంచి ఊపుమీదున్న బెంగళూరు(RCB).. చెన్నై(CSK)పై ఘన విజయం సాధించి ప్లే ఆఫ్‌కు చేరాలని గట్టి పట్టుదలతో ఉంది. విరాట్ కోహ్లీ భీకర ఫామ్‌లో ఉండడంతో ఇది సాధ్యమయ్యేలానే కనిపిస్తుంది. అయితే చెన్నై సూపర్‌కింగ్స్ కంటే తక్కువ నెట్ రన్‌రేట్ ఉన్న బెంగళూరు... చెన్నైపై ఎంత తేడాతో గెలిస్తే ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుందన్న ప్రశ్న అందరిలోనూ ఉత్పన్నమవుతుంది. ప్రస్తుతం చెన్నై ఖాతాలో 14 పాయింట్లు ఉండగా.. నెట్ రన్ రేట్ + 0.528గా ఉంది. అదే ఆర్సీబీ విషయానికి వస్తే.. ఆ జట్టు ఖాతాలో 12 పాయింట్లు ఉండగా.. నెట్ రన్ రేట్ + 0.387గా ఉంది. ఈ నెట్ రన్‌రేట్‌ను బెంగళూరు దాటాలంటే ఏం చేయాలంటే......
18 పరుగుల తేడాతో గెలిస్తేనే..
చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై గెలిస్తే ప్లేఆఫ్స్ చేరుకుంటుంది. బెంగళూరు జట్టుకు మాత్రం నెట్ రన్ రేట్ కీలకంగా మారనుంది. చెన్నైపై బెంగళూరు ముందుగా బ్యాటింగ్ చేస్తే 18 పరుగుల తేడాతో గెలవాలి, అదే రెండోసారి బ్యాటింగ్ చేస్తే 11 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించాలి. అంటే 18.1 ఓవర్లలోనే చెన్నైను బెంగళూరు ఆలౌట్ చేయాలి. 18 పరుగుల లోపు తేడాతో ఓడిపోయినా చెన్నై ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఒకవేళ వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయితే గనుక ఇరు జట్ల ఖాతాలో చెరో పాయింట్ చేరుతుంది. అప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ ముందుకెళ్తుంది. బెంగళూరు మరోసారి లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. మ్యాచ్ పూర్తిగా 20 ఓవర్లపాటు జరిగితే చెన్నై ముందు బెంగళూరు 200 పరుగుల లక్ష్యం పెట్టి... రుతురాజ్ సేనను 182కే కట్టడి చేయాలి. 5 ఓవర్ల గేమ్ జరిగినప్పుడు బెంగళూరు 80 పరుగులు చేస్తే.. చెన్నైను 62కే పరిమితం చేయాలి. బెంగళూరు రెండోసారి బ్యాటింగ్ చేస్తే చెన్నై నిర్దేశించిన లక్ష్యాన్ని 18.1 ఓవర్లలోనే పూర్తి చేయాలి. 19 ఓవర్ల మ్యాచ్ అయితే 17.1 ఓవర్లలోనే ఛేదన జరగాలి.
వరుణుడు కరుణిస్తాడా
ఈ ఐపీఎల్‌లోనే కీలకమైన ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. క్రికెట్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందన్న వార్తలు అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మ్యాచ్ జరిగే రోజున బెంగళూరులో వర్షం కురిసే అవకాశాలు అధికంగా ఉన్నాయని వెదర్.కామ్ వెల్లడించింది. రోజంతా 73 శాతం, సాయంత్రం 6 గంటల సమయంలో 80 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. ఎడతెరిపి లేకుండా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని సదరు వెబ్‌సైట్ పేర్కొంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
క్రికెట్
క్రికెట్
నెల్లూరు
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion