అన్వేషించండి

IPL 2024: ఓడినా చరిత్ర సృష్టించిన బెంగళూరు, ఛేదనలో ఇదే రికార్డట

Royal Challengers Bengaluru: మ్యాచ్‌లో ఓడినా బెంగళూరు ఓ రికార్డును తన పేరిట లిఖించుకుంది. టీ20 క్రికెట్ చరిత్రలోనే చేజింగ్‌లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది.

Royal Challengers Bengaluru Record : చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(SRH) జట్టు సునామీల విరుచుకుపడి బెంగళూరు(RCB) జట్టును ముంచేసింది.  చిన్నస్వామి స్టేడియం బౌండరీలతో దద్దరిల్లింది. సిక్సులతో తడిసి ముద్దయింది. హైదరాబాద్‌ బ్యాటర్ల విధ్వంసంతో  మార్మోగిపోయింది. సిక్సర్లు కొట్టడం ఇంత తేలికా అనేలా.. బౌండరీలే  సింగల్‌ రన్స్‌గా మారిన వేళ హైదరాబాద్ సృష్టించిన సునామీలో... బెంగళూరు బౌలర్లు గల్లంతయ్యారు. ఐపీఎల్‌ చరిత్రలో ఇప్పటికే అత్యధిక స్కోరు నమోదు చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌... ఇప్పుడు ఆ రికార్డును కాల గర్భంలో కలిపేసింది. మరోసారి ఉప్పెనలా మారి బెంగళూరుపై విరుచుకపడింది. హైదరాబాద్‌ బ్యాటర్ల విధ్వంసంతో తొలుత హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి  287 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 262 పరుగులకే పరిమితం కావడంతో హైదరాబాద్‌ 25 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కోహ్లీ, డుప్లెసిస్‌, దినేశ్ కార్తిక్‌ రాణించినా.. ఆ పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించడానికి మాత్రమే ఉపయోగపడింది. ఈ మ్యాచ్‌లో ఓడినా బెంగళూరు ఓ రికార్డును తన పేరిట లిఖించుకుంది.
 
చేధనలో ఇదే హైయెస్ట్‌ స్కోరు
హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సరికొత్త రికార్డు నమోదు చేసింది. టీ20 క్రికెట్ చరిత్రలోనే చేజింగ్‌లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఈ మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 287 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 262 పరుగులే చేసి ఓటమిపాలైంది. దినేశ్ కార్తీక్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 83, ఫాఫ్ డుప్లెసిస్ 62 పరుగులతో రాణించారు. ఈ మ్యాచ్‌లో ఓడినా.. ఛేజింగ్‌లో 250 ప్లస్ రన్స్ చేసిన తొలి జట్టుగా బెంగళూరు నిలిచింది.
 
ప్లే ఆఫ్‌కు ఇక కష్టమే
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే చాలా కష్టం. తొలి 7 మ్యాచ్‌ల్లో బెంగళూరు కేవలం 2 పాయింట్లు మాత్రమే సాధించింది. బెంగళూరుకు ఇంకా 7 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి, ఫాఫ్ డు ప్లెసిస్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడబోయే 7 మ్యాచ్‌లన్నింటినీ గెలిస్తే అప్పుడు ఆ జట్టు 16 పాయింట్లతో ఉంటుంది. ఈ 16 పాయింట్లు ప్లే ఆఫ్‌కు చేరేందుకు బెంగళూరుకు సరిపోవు. ఒకవేళ అన్ని మ్యాచుల్లో గెలిచినా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడవలసి ఉంటుంది. అంటే ఇప్పుడు ప్లే ఆఫ్‌కు చేరాలన్నా అది బెంగళూరు చేతుల్లో లేదు. ఈ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... పంజాబ్ కింగ్స్‌పై గెలిచింది. చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ చేతిలో పరాజయం పాలైంది. ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాబోయే మ్యాచ్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆడనుంది. మార్చి 21న ఈడెన్ గార్డెన్స్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Tata Punch CNG EMI: టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Neha Shetty : గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Embed widget