అన్వేషించండి
IPL 2024 : ఇక ప్లే ఆఫ్ సమరం, పోటీ ఎవరి మధ్యంటే ?
IPL 2024 Playoffs : ఐపీఎల్ 2024 సీజన్ లో లీగ్ దశ ముగిసింది. హోరాహోరీగా సాగిన పోరులో నాలుగు జట్లు క్వాలిఫయర్ లో చోటు దక్కించుకున్నాయి.
![IPL 2024 : ఇక ప్లే ఆఫ్ సమరం, పోటీ ఎవరి మధ్యంటే ? Ipl 2024 Qualifying Teams And Matchs Schedule Venues Full Details IPL 2024 : ఇక ప్లే ఆఫ్ సమరం, పోటీ ఎవరి మధ్యంటే ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/20/7a2173d94b94e85f710411b7fd4148b117161815164941036_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
క్వాలిఫయర్‌లో తలపడే జట్లు ఇవే ( Image Source : Twitter/IndianPremierLeague )
IPL 2024 Playoffs details : ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్లే ఆఫ్ బెర్తులు ఖాయమైయ్యాయి. ఇక టైటిల్ కోసం జరిగే అసలు పోరుకు నాలుగు జట్లే మిగిలాయి. భీకర ఫామ్‌లో ఉన్న ఈ నాలుగు జట్ల మధ్య పోరు అభిమానులకు అసలైన కిక్‌ను అందించనుంది. చివరి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్-కోల్‌కత్తా జట్ల మధ్య మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండా రద్దు కావడంతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది.
మ్యాచ్‌లు ఇలా..
ఇక మే 21 నుంచి నాకౌట్ మ్యాచ్‌లకు తెరలేవనుంది. మే 21న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న తొలి క్వాలిఫియర్... మే 22న ఎలిమినేటర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. రేపు( మంగళవారం) క్వాలిఫైయర్ 1 మ్యాచ్... అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఈ తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్- సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. అనంతరం మే 22వ తేదీ బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలోనే రాజస్థాన్ రాయల్స్ జట్టుతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఆ మ్యాచ్‌లో ఓడిన జట్టు ఇంటిముఖం పడుతుంది. ఇందులో గెలిచిన జట్టు... క్వాలిఫయర్ వన్‌లో ఓడిన జట్టుతో అమీతుమీ తేల్చుకోనుంది. కోల్ కతా నైట్ రైడర్స్ లేదంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఏదో ఒక జట్టు రాయల్ ఛాలెంజర్స్ లేదంటే రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది. క్వాలిఫైయర్ 1 గెలిచిన జట్టుతో మే 26వ తేదీన చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
పాపం రాజస్థాన్
కోల్‌కత్తాపై నెగ్గి పాయింట్స్ టేబుల్ లో రెండో స్థానంలో నిలవాలనుకున్న రాజస్థాన్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. మ్యాచ్ రద్దుతో కేకేఆర్, రాజస్థాన్ కు చెరో పాయింట్ లభించింది. సన్‌రైజర్స్, రాజస్థాన్ 17 పాయింట్లతో ఉండగా, మెరుగైన రన్ రేట్ కలిగిన హైదరాబాద్ టీమ్ రెండో స్థానానికి చేరి క్వాలిఫయర్ 1కు అర్హత సాధించినట్లయింది. ఐపీఎల్ సీజన్ 17 లీగ్ స్టేజీలో కోల్‌కతా నెంబర్ 1గా నిలిచింది. అహ్మదాబాద్ వేదికగా కోల్‌కతా, హైదరాబాద్ జట్ల మే 21న మధ్య క్వాలిఫయర్-1 జరగనుంది. నెగ్గిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరగా.. ఓడిన జట్టు బుధవారం ఆర్సీబీ, రాజస్థాన్‌ల మధ్య జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో తలపడనుంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
బిజినెస్
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion