(Source: ECI/ABP News/ABP Majha)
IPL 2024: ఆఖరి దశకు ఐపీఎల్2024 అయినా తేలని ప్లే ఆఫ్స్ బెర్తులు
Playoffs Teams In IPL: ప్రస్తుతానికి కేకేఆర్, ఆర్‌ఆర్ 16 పాయింట్లతో ఉంటే.. సీఎస్‌కే, ఎస్‌ఆర్‌హెచ్, ఎల్‌ఎస్‌జీ, డీసీ 12 పాయింట్లతో ఉన్నాయి. మిగిలిన ఆర్సీబీ, పంజాబ్, ముంబై, జీటీ 8పాయింట్లతో ఉన్నాయి.
IPL 2024: బహుశా ఇది ఐపీఎల్ చరిత్రలోనే చిత్రమైన పరిస్థితి ఏమో. ప్రతీ సారి ఐపీఎల్ లో దాదాపుగా 10 మ్యాచులు ముగిసేసరికే ఓ క్లారిటీ వచ్చేసిది. ఏ టీమ్స్ ప్లే ఆఫ్స్ కి వెళ్తున్నాయి. ఏ టీమ్స్ ఇంటికి వెళ్తున్నాయని. కానీ ఈసారి మాత్రం అలా జరగలేదు.
అన్ని టీమ్స్‌కి ఇప్పటికీ 11 మ్యాచులు పూర్తయ్యాయి. ముంబై, ఢిల్లీ అయితే 12మ్యాచులు ఆడేశాయి. సో ఈ రెండు టీమ్స్ కి ఇంక మిగిలింది రెండు మ్యాచులే. మిగిలిన టీమ్స్ మూడు మ్యాచులు ఉన్నాయి. కానీ ఇప్పటివరకూ ఏ టీమ్ కూడా ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై కాలేదు. ఏ టీమ్ కూడా అఫీషియల్ గా ఎలిమినేట్ కాలేదు.
కోల్ కతా నైటర్ రైడర్స్ 8 విజయాలతో 16 పాయింట్లతో టేబుల్ టాపర్ గా ఉంటే...పాయింట్స్ టేబుల్ లో చిట్టచివర ఉన్న గుజారాత్ 4విజయాలతో 8పాయింట్లతో లాస్ట్ ప్లేస్‌లో ఉంది. టాపర్‌కి లీస్ట్‌కి తేడా నాలుగు విజయాలే. ఇలా ఎప్పుడూ జరగలేదు.
ప్రస్తుతానికి కేకేఆర్, ఆర్‌ఆర్ 16 పాయింట్లతో ఉంటే.. సీఎస్‌కే, ఎస్‌ఆర్‌హెచ్, ఎల్‌ఎస్‌జీ ఇంకా నిన్న మ్యాచ్ గెలిచి డీసీ కూడా 12 పాయింట్లతో ఉన్నాయి. ఇక మిగిలిన ఆర్సీబీ, పంజాబ్, ముంబై, జీటీ 8పాయింట్లతో ఉన్నాయి. వీటిలో కేకేఆర్, ఆర్‌ఆర్ టీమ్స్‌కి ప్లే ఆఫ్స్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటే.. మూడు నాలుగు బెర్తుల కోసం పెద్ద పోటీనే ఉంది.
సీఎస్‌కే, ఎస్‌ఆర్‌హెచ్, డీసీ, ఎల్‌ఎస్‌జీకి బెటర్ ప్లే ఆఫ్ ఛాన్సెస్ కనిపిస్తున్నా ఈ నాలుగులో ఏ రెండు వస్తాయో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఏదీ చిన్న టీమ్ కాదు..ఏదీ పెద్ద టీమూ కాదు అన్నట్లుంది సిచ్యుయేషన్. నిన్న DC రాజస్థాన్ కి షాక్ ఇచ్చినట్లు మొన్న ముంబై SRH ని సైలెంట్ చేసినట్లు మిగిలిన టీమ్స్ కూడా షాకులు ఇస్తే మాత్రం ఊహించని ఫలితాలు ఆవిష్కృతమైనా ఆశ్చర్యం లేదు ఈ ఐపీఎల్‌లో.