IPL 2024: హ్యాట్రిక్ విజయాల దూకుడు, బెంగళూరు ప్లే ఆఫ్ అవకాశాలేంటీ?
Royal Challengers Bengaluru : సన్ రైజర్స్ హైదరాబాద్ లాంటి స్ట్రాంగ్ టీమ్ ను, గుజరాత్ టైటాన్స్ ను వరసగా రెండుసార్లు ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హ్యాట్రిక్ విజయాలను అందుకుంది.
Playoff chances for Royal Challengers Bengaluru: ఈ ఐపీఎల్(IPL)లో ఆరంభంలో వరుస పరాజయాలతో సతమతమైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)... ఇప్పుడు ఫామ్‌లోకి వచ్చింది. వరుసగా మూడు విజయాలు సాధించి ఫుల్ ఫామ్‌లోకి వచ్చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ లాంటి స్ట్రాంగ్ టీమ్ ను, గుజరాత్ టైటాన్స్ ను వరసగా రెండుసార్లు ఓడించి..హ్యాట్రిక్ విజయాలను అందుకుంది. ప్లే ఆఫ్ అవకాశాలు సన్నగిల్లిన వేళ ఇక పోయేదేం అనుకున్న ఆర్సీబీ తెగించి ఆడుతూ విజయాలు అందుకుంటోంది. ఇదే ఆటతీరుతో ప్లే ఆఫ్స్ రేసులోకి ఆర్సీబీ ఒక్కసారిగా దూసుకువచ్చింది. అదేంటీ ఆర్సీబీ కి ఇంకా ఛాన్స్ ఉందా అంటే ఎస్ టెక్నికల్ గా ఉంది. పాయింట్స్ టేబుల్ ఓ సారి గమనిస్తే ఇప్పటి వరకూ 11 మ్యాచులు ఆడిన ఆర్సీబీ 4 మ్యాచులు గెలుచుకుని 8 పాయింట్లతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. బెంగళూరు కింద పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు ఉన్నాయి. ఇక బెంగళూరు చేతిలో మూడు మ్యాచులు మిగిలి ఉన్నాయి. ప్లే ఆఫ్ రేసులు నిలబడాలంటే మిగిలి ఉన్న ఈ మూడు మ్యాచుల్లోనూ బెంగళూరు కచ్చితంగా విజయం సాధించాలి. వీలైనంత పెద్ద విజయాలు నమోదు చేయటంతో పాటు 14పాయింట్లు తెచ్చుకోవాలి. 14పాయింట్స్ అండ్ బెటర్ రన్ రేట్ సాధిస్తే బెంగళూరు ఆశలు ఉంటాయి. ఇప్పటికే రాజస్థాన్ ప్లే ఆఫ్‌కు చేరింది. ముంబైకి దాదాపుగా ఛాన్సెస్ లేనట్లే. ఆర్సీబీ 14పాయింట్లు ప్లస్ బెటర్ రన్ రేట్ ఉంటే రెండు మూడు స్థానాలను కేకేఆర్, లక్నో.. చెన్నై తన్నుకుపోయినా నాలుగో ప్లేస్‌లో బెంగళూరు ఆర్సీబీ క్వాలిఫైయర్స్ కి వెళ్లాలంటే అద్భుతాలు జరగాలి. చెన్నై, లక్నో లాంటి జట్లు మిగిలిన మ్యాచులన్నీ ఓడిపోతే ఆర్సీబీ జట్టుకు లైన్ క్లియర్ అయినట్లే. ఆర్సీబీ మూడు మ్యాచులు గెలిస్తేనే ఈ అవకాశమైనా ఉంటుంది. అప్పుడే క్వాలిఫైయర్స్ లోకి వెళ్లి ఆడి గెలిచి ఈ సాలా కప్ నమ్మదే అనొచ్చు.
ఈ జట్ల పరిస్థితి ఇలా..
ముంబై ఇండియన్స్: 10 మ్యాచ్‌లలో 7 ఓటములతో ముంబై ఇండియన్స్ వద్ద కేవలం 6 పాయింట్లే ఉన్నాయి. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించినా ముంబైకు 14 పాయింట్లే వస్తాయి. ప్రస్తుత రేసును బట్టి చూస్తే ముంబై ప్లే ఆఫ్‌కు అర్హత సాధించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ముంబై ఒక్క మ్యాచ్ ఓడిపోయినా అధికారికంగా ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది.
పంజాబ్ కింగ్స్: పంజాబ్ కింగ్స్ 10 మ్యాచ్‌లలో 4 గెలిచి 8 పాయింట్లతో ఉంది. ప్లేఆఫ్‌కు చేరాలంటే మిగిలిన నాలుగు మ్యాచుల్లో పంజాబ్ గెలవాలి. ఒక్క మ్యాచ్ ఓడిపోయినా పేలవమైన నెట్ రన్ రేట్ -0.662 ఉన్న పంజాబ్ ప్లే ఆఫ్ ఆశలు సంక్లిష్టంగా మారుతాయి. అప్పుడు అన్ని మ్యాచులు గెలిచినా వేరే జట్ల గణాంకాల మీద ఆధారపడాల్సి ఉంటుంది.
గుజరాత్ టైటాన్స్: ప్లే ఆఫ్ చేరుకునేందుకు గుజరాత్ టైటాన్స్ తీవ్రంగా పోరాడుతోంది. గుజరాత్ 10 మ్యాచ్‌లు ఆడి 4 మాత్రమే గెలిచి ప్రస్తుతం 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. గుజరాత్ నెట్ రన్ రేట్ ఇతర జట్ల కంటే అధ్వాన్నంగా ఉంది. గుజరాత్ టైటాన్స్ అన్ని మ్యాచ్‌లు గెలిస్తే 16 పాయింట్లు వస్తాయి. అయినా ప్లే ఆఫ్‌కు చేరడం కష్టమే. అన్ని మ్యాచులు గెలిచినా వేరే జట్ల గణాంకాల మీద ఆధారపడాల్సి ఉంటుంది.