IPL 2024 KKR vs MI: వర్షం వల్ల ఓవర్లు కుదింపు, టాస్ నెగ్గి బౌలింగ్ తీసుకున్న ముంబై ఇండియన్స్
IPL 2024 MI vs KKR: ఐపీఎల్ సీజన్ 17లో 60 మ్యాచ్ లో భాగంగా కోల్ కత్తా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. వర్షం వల్ల టాస్ ఆలస్యమైంది. టాస్ నెగ్గిన ముంబై కెప్టెన్ పాండ్యా బౌలింగ్ తీసుకున్నాడు.
కోల్‌కత్తా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) సీజన్ 17లో భాగంగా శనివారం రాత్రి కోల్ కత్తా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యమైంది. వర్షం ఆగడంతో టాస్ వేశారు. టాస్ నెగ్గిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే వర్షం కారణంగా సమయం వృథా కావడంతో మ్యాచ్ ను 16 ఓవర్లకు కుదించారు. ఐపీఎల్ లో ఇది 60వ మ్యాచ్. కాగా, పాయింట్స్ టేబుల్ లో కోల్ కత్తా అగ్రస్థానంలో నిలవగా, ముంబై 4 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది.
🚨 Toss Update 🚨
— IndianPremierLeague (@IPL) May 11, 2024
Mumbai Indians elect to bowl against Kolkata Knight Riders.
Follow the Match ▶️ https://t.co/4BkBwLMkq0#TATAIPL | #KKRvMI pic.twitter.com/TYcl4kXeks
కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ 11: ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, నితీష్ రాణా, శ్రేయర్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణ్ దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి , హెచ్. రానా
ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11: ఇషాన్ కిషన్ (వికెట్ కీపన్), నేహాల్ వధేరా, ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, A. కాంబోజ్, పీయూష్ చావ్లా, జస్ప్రిత్ బుమ్రా, ఎన్. తుషార