అన్వేషించండి

IPL 2024 MS Dhoni: ధోనీ అసలు నువ్వు మారవా! ఎప్పుడూ ఇంతేనా ? కెరీర్‌లో 5 కీలక నిర్ణయాలు ఇవీ

Dhoni Steps Down as CSK Captain: కొన్ని వందల కోట్ల మందికి ఆరాధ్య క్రికెటర్ గా, వ్యక్తిగా ఉన్న ఎంఎస్ ధోనీ ట్రూ క్యారెక్టర్ తెలియాలంటే ఈ నిర్ణయాలు చూస్తే మీకు అర్థమవుతుంది.

MS Dhoni CSK Captaincy IPL 2024: కొంతమంది ఉంటారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా వాళ్ల ట్రూ క్యారెక్టర్ ను వదులుకోరు. కోట్లాది మందికి ఆరాధ్య క్రికెటర్ గా, వ్యక్తిగా ఉన్న ఎంఎస్ ధోనీ కూడా అంతే. ధోనీ ట్రూ క్యారెక్టర్ లో ఒక లక్షణం ఏంటో తెలుసా... తన చుట్టూ ఎంత మార్కెటింగ్, ప్రమోషన్స్, బ్రాండ్ వేల్యూ వంటి డీలింగ్స్ జరిగినా సరే తన పని తను చేసుకుంటూ పోతాడు. తనకు అనిపించిందే చేస్తాడు. అందులో భాగమే... తన క్రికెటింగ్ కెరీర్ లో ఈ 5 సడెన్ నిర్ణయాలపై ఓ లుక్కేయండి.

నంబర్ వన్. 30 డిసెంబర్ 2014. అప్పటికే ధోనీ 90 టెస్టులు ఆడాడు. అందులో దాదాపు సగం కెప్టెన్ కూడా. హాయిగా ఇంకో పది టెస్టులు ఆడేసుకోవచ్చు. వంద టెస్టుల మైలురాయి చేరుకోవచ్చు. కానీ ఆస్ట్రేలియా టూర్ నడుస్తుండగానే మధ్యలోనే విరాట్ కు బాధ్యతలు అప్పగించాడు. టెస్టుల్లో ఇక తన ఫిట్ అవనని స్వయంగా గ్రహించాడేమో. బ్యాటన్ స్మూత్ గా పాస్ చేశాడు. 

నంబర్ 2: 4 జనవరి 2017. వన్డే,టీ20 కెప్టెన్సీ మళ్లీ విరాట్ కు అప్పగించిన రోజు. లిమిటెడ్ ఓవర్స్ లో ధోనీ అప్పటికీ ప్రమాదకర ఆటగాడే. కానీ కెప్టెన్సీ ఎందుకు వదిలేశాడు. మళ్లీ జట్టు కోసమే. 2019 ప్రపంచకప్ కు ఇంకో రెండేళ్లే ఉందన్న దృష్టితో కొత్త కెప్టెన్ కు సర్దుకోవడానికి టైం ఇవ్వాలని గ్రహించి ముందుగానే బాధ్యతలు వదులుకున్నాడు.  

నంబర్ 3: ఆగస్ట్ 15 2020. కరోనా నుంచి సురక్షితంగా ఎలా ఉండాలా అని అందరూ చూస్తున్న రోజులు.సైలంట్ గా మరో బాంబ్ పేల్చాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ రిటైర్మెంట్. వరల్డ్ కప్ రనౌట్ తర్వాత ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడలేదు. రిటైర్మెంట్ కూడా ఆర్భాటం ఏమీ లేదు.మై పల్ దో పల్ కా షాయర్ హూ... ఓ పాట యాడ్ చేసి ఓ వీడియో వదిలాడు. 1929 నిమిషాలకు నేను రిటైర్ అయినట్టు భావించండన్నాడు. అంతే 

నంబర్ 4: మార్చ్ 24 2022. తొలిసారిగా సీఎస్కే కెప్టెన్సీ వదిలేశాడు. ఈసారీ సడన్ నిర్ణయమే. రవీంద్ర జడేజాకు అప్పగించాడు. కానీ తప్పని పరిస్థితుల్లో సీజన్ మధ్యలో కెప్టెన్సీ మళ్లీ తీసుకోవాల్సి వచ్చింది. 

నంబర్ 5: మార్చ్ 21 2024.  అంటే ఇవాళ. రెండోసారి కెప్టెన్సీ వదిలేశాడు. కుర్రాడు రుతురాజ్ గైక్వాడ్ కు అప్పగించాడు. దాదాపుగా ఆటగాడిగా కూడా ఇదే ఆఖరు సీజన్ కావొచ్చు. రుతురాజ్ ను దగ్గరుండి చూసి, నేర్పించాల్సినవి నేర్పించి.... రిటైర్ అయిపోతాడేమో. అది కూడా ఎలాంటి హంగులూ లేకుండానే అవొచ్చేమో. ఎందుకంటే ధోనీ అంటే అంతే కదా. అతను అలానే ఉంటాడు. అదే చేస్తాడు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Mahakumbha Mela 2025 : మహా కుంభమేళాకు ఉగ్రవాద ముప్పు..! ఆస్పత్రుల్లో స్పెషల్ వార్డులు.. ఎన్ఐఏ అలెర్ట్
మహా కుంభమేళాకు ఉగ్రవాద ముప్పు..! ఆస్పత్రుల్లో స్పెషల్ వార్డులు.. ఎన్ఐఏ అలెర్ట్
Embed widget