అన్వేషించండి
Advertisement
IPL 2024: మెరిసిన పూరన్, ఓటమితో వెనుదిరిగిన ముంబై
MI vs LSG Highlights: ఐపీఎల్-17 సీజన్‌ను ఓటమితో మొదలుపెట్టిన ముంబై ఇండియన్స్ ఓటమితోనే ముగించింది. సొంత మైదానం వాంఖడేలో లక్నో సూపర్ జెయింట్స్ పై 18 రన్స్ తేడాతో పరాజయం పాలైంది.
MI vs LSG Highlights: తన పేలవ ప్రదర్శనతో ఈ సీజన్ లో అందరినీ నిరాశ పరచి పట్టికలో అట్టడుగున నిలిచిముంబై ఇండియిన్స్ తన ఆటను ఓటమితోనే ముగించింది. స్వంత స్టేడియం అయిన వాంఖడెలో మొదట లక్నో ను సరిగ్గా కట్టడి చేయలేక 200పైగా స్కోరు చేసే అవకాశం చేజేతులా కల్పించిందిచి.. ఆ తర్వాత ఛేదనలో మంచి ఆరంభం లభించినా తరువాత తరువాత తేలిపోయి ఓటమి కొనితెచ్చుకుంది. ముంబైకి రోహిత్ శర్మ 38 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు 68 స్కోర్ చేసి అదిరిపోయే ఆరంభమిచ్చినా మిడిలార్డర్ చేతులెత్తేశారు. ఆఖర్లో నమన్ ధీర్(28 బంతుల్లో 4ఫోర్లు,5 సిక్స్‌లతో 62 పరుగులు చేసినా జట్టు స్కోర్ 196/6 వద్దే ఆగిపోయింది. దీంతో పరిమితమై 18 రన్స్ తేడాతో పరాభవాన్ని మూటగట్టుకుంది.
రాణించిన రాహుల్, పూరన్
టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన లక్నోకు తొలి ఓవర్‌లోనే గట్టి షాక్ తగిలింది. మూడో బంతికే దేవదత్ పడిక్కల్‌ను తుషారా అవుట్ చేశాడు. పడిక్కల్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని లక్నోకు తొలి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత కెప్టెన్ రాహుల్, స్టోయినీస్ మరో వికెట్ పడకుండా కాస్త జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 49 పరుగులు జోడించారు. పవర్ ప్లే చివరి బంతికి స్టోయినిస్ అవుటయ్యాడు. 22 బంతుల్లో అయిదు ఫోర్లతో 28 పరుగులు చేసిన స్టోయినిస్‌ను పియూష్ చావ్లా వికెట్ల ముందు దొరకబుచ్చుకుని అవుట్ చేశాడు. అనంతరం 11 పరుగులే చేసి దీపక్ హుడా అవుట్ అయ్యాడు. 9 బంతుల్లో 11 పరుగులు చేసిన హుడాను కూడా పియూష్ చావ్లా పెవిలియన్‌కు పంపి లక్నోను మరో దెబ్బ కొట్టాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్ రాహుల్ సాధికారికంగా బ్యాటింగ్ చేశాడు. మరీ ధాటిగా ఆడకున్నా చెత్త బంతులను భారీ షాట్లు ఆడాడు. హుడా అవుటైన తర్వాత రాహుల్‌తో జత కలిసిన పూరన్ ధాటిగా ఆడాడు. రాహుల్- పూరన్ భారీ షాట్లు ఆడడంతో లక్నో స్కోరు బోర్డు వేగాన్ని అందుకుంది. పూరన్...ముంబై బౌలర్లను ఊచకోత కోశాడు. అందిన బంతిని అందినట్లే బాదేశాడు. కేవలం 29 బంతులు ఎదుర్కొన్న పూరన్ ఎనిమిది సిక్సర్లు, అయిదు ఫోర్లతో 75 పరుగులు చేసి అవుటయ్యాడు. పూరన్‌ను తుషారా అవుట్ చేశాడు. కె.ఎల్ రాహుల్ కూడా 41 బంతుల్లో 3 ఫోర్లు, మూడు సిక్సర్లతో 55 పరుగులు చేసి పియూష్ చావ్లా బౌలింగ్‌లో అవుటయ్యాడు. కానీ అర్షద్ ఖాన్ ఆడిన తొలి బంతికే అవుటయ్యాడు. కానీ చివర్లో ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా ధాటిగా ఆడడంతో లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో పియూష్ చావ్లా, తుషారా మూడేసి వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగిన సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ 2.2 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక్క వికెట్ తీయకుండా 22 పరుగులు ఇచ్చాడు.
రోహిత్, నమన్ పోరాడినా
కొండంత స్కోరును కరిగించే క్రమంలో ముంబై కూడా ఆది నుంచే లక్నో బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. బౌండరీతో ఆటను మొదలు పెట్టిన రోహిత్ భారీ సిక్సర్లతో వాంఖడేను ఉర్రూతలూగించాడు. మిడిల్ ఆర్డర్ విఫలమైనా ఆఖర్లో నమన్ ధీర్ మెరుపులతో లక్నోను భయపెట్టాడు. అయినా సరే ముంబై విజయతీరాలకు చేరాలేకపోయింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
నిజామాబాద్
మొబైల్స్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion