IPL 2024: సూర్యా భాయ్ వచ్చేశాడు, ముంబై ఓటములకు చెక్ పడేనా?
MI vs DC IPL 2024: ఈ సీజన్‌లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఢిల్లీ క్యాపిటల్స్ తో అమీతుమీకి దిగనుంది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగనున్నాడు.
MI vs DC IPL 2024 Delhi Capitals opt to bowl: ఐపీఎల్(IPL) 2024 సీజన్‌లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్(MI) మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఢిల్లీ క్యాపిటల్స్(DC)తో అమీతుమీకి దిగనుంది. టాస్ నెగ్గిన ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ తరఫునకుశాగ్రా, జే రిచర్డ్‌సన్ ఐపీఎల్ అరంగేట్రం చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగనున్నాడు. ముంబయి జట్టులో మూడు మార్పులు చేసినట్లు కెప్టెన్ హార్దిక్ పాండ్య తెలిపాడు. నమన్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్, మపాకా స్థానంలో రొమారియో, బ్రెవిస్ స్థానంలో నబీని తీసుకున్నట్టు చెప్పాడు.ఇప్పటివరకూ ఆడిన మూడు మ్యాచూల్లో వరుసగా పరాజయం పాలైన ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. అంటే ఈ లెక్కన పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు... గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.
ఓటమిలో ఒకరిని మించి ఒకరు
ముంబై ఇండియన్స్ ఆడిన మూడు మ్యాచుల్లోనూ పరాజయం పాలైతే.. ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగు మ్యాచుల్లో మూడు మ్యాచుల్లో ఓడిపోయింది. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి మళ్లీ విజయాల బాట పట్టాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ భారీ స్కోర్లపై కన్నేశారు. తిలక్ వర్మ, కూడా ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు చేసి సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నారు. ఈ ముంబై బ్యాటర్లు పర్వాలేదనిపిస్తున్నా.. భారీ స్కోర్లు చేయడంలో మాత్రం విఫలమవుతున్నారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా జట్టులో స్ఫూర్తిని నింపలేకపోతున్నాడు. హార్దిక్ పాండ్యాపై వెల్లువెత్తుతున్న ట్రోలింగ్ కూడా పతాకస్థాయికి చేరింది.
ఐపీఎల్‌లో ఇప్పటివరకూ ముంబై, ఢిల్లీ జట్లు 33 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఈ పోరుల్లో ముంబై ఇండియన్స్ 18 మ్యాచుల్లో గెలిచింది. ఢిల్లీ 15 మ్యాచుల్లో విజయం సాధించింది. ఫలితం రాని మ్యాచ్ ఒక్కటి కూడా లేదు. ముంబైలో ఈ రెండు జట్లు ఎనిమిది సార్లు తలపడ్డాయి. అందులో ముంబై ఇండియన్స్ అయిదుసార్లు విజయం సాధించగా.. ఢిల్లీ మూడు మ్యాచుల్లో గెలిచింది. ఢిల్లీలో ముంబై-ఢిల్లీ జట్లు 11 మ్యాచుల్లో తలపడగా.. ఢిల్లీ 6 సార్లు... ముంబై 5సార్లు గెలిచాయి.
ముంబై పిచ్ ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటర్‌లకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. వాంఖడేలో ఐపీఎల్‌లో మొత్తం 110 మ్యాచ్‌లు జరగగా అందులో 50 సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది. 60సార్లు రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది.