IPL 2024: హార్దిక్ గాయంతో బాధపడుతున్నాడా ?మాజీ పేసర్ సంచలన వ్యాఖ్యలు
Hardik Pandya: హార్దిక్ పాండ్య పై న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ సైమన్ డౌల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారాయి.
Doubts arise over Hardik Pandya's fitness amid IPL bowling absence: ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardic Pandya) గాయంతో బాధపడుతున్నాడా..? ముంబై ఇండియన్స్(MI) ఆడిన తొలి మ్యాచ్‌లో తొలి ఓవర్ తానే వేసి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన పాండ్యా... తర్వాతి మ్యాచుల్లో క్రమంగా బౌలింగ్‌కు దూరంగా ఉంటున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లోనూ పాండ్యా ఒకే ఓవర్ బౌలింగ్ వేశాడు. ఆ తర్వాత మరో ఓవర్ వేయలేదు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్య పై న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ సైమన్ డౌల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారాయి.
పాండ్యాకు ఏమైంది..?
ముంబై ఇండియన్స్ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయంతో బాధ పడుతున్నాడని న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ సైమన్ డౌల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను గాయపడ్డ విషయాన్ని పాండ్యా ఒప్పుకోవడం లేదని కూడా ఆరోపణలు చేశాడు. 2024లో తొలి రెండు మ్యాచుల్లో ముంబై బౌలింగ్ దాడిని ప్రారంభించిన హార్దిక్, తర్వాత రెండు మ్యాచుల్లో కనీసం ఒక్క ఓవర్‌ను కూడా వేయలేదు. గురువారం రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం ఒకే ఓవర్ వేసి 13 పరుగులు ఇచ్చాడు. తర్వాత మరో ఓవర్ వేయలేదు. గాయంతో పాండ్య బాధపడుతుండడమే ఇందుకు కారణమని డౌల్ చెప్పాడు. పాండ్యాలో ఏదో లోపం ఉందని ... అతను దానిని ఒప్పుకోవడం లేదని డౌల్ తెలిపాడు. సరైన సమయంలో బౌలింగ్ చేస్తానన్న హార్దిక్ మాటలు ఓ సాకు మాత్రమే అని డౌల్ అన్నాడు.
బుమ్రా వల్లే..
వాంఖడేలో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు(RCB)పై ఘన విజయం సాధించడంపై ముంబై)MI) కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) హర్షం వ్యక్తం చేశాడు. విజయం ఎప్పుడూ బాగానే ఉంటుందని ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. అయిదు వికెట్లతో ముంబై పతనాన్ని శాసించిన బుమ్రాపై పాండ్యా ప్రశంసల వర్షం కురిపించాడు. బుమ్రా తమ వైపు ఉండడం చాలా అదృష్టమని.. బుమ్రా తన పనిని తాను సమర్థంగా పూర్తి చేస్తాడని హార్దిక్ పాండ్యా తెలిపాడు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో తాము గెలిచిన విధానం కూడా చాలా ఆకట్టుకుంటుందని పాండ్యా అన్నాడు. రోహిత్ శర్మ- ఇషాన్ కిషన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారన్న ముంబై కెప్టెన్ వాళ్లు వేసిన పునాదిపై తాము లక్ష్యాన్ని సునాయసంగా ఛేదించామన్నాడు. జట్టుకు ఏం కావాలో ఆటగాళ్లందరికీ తెలుసని పాండ్యా తెలిపాడు. బుమ్రా అనుభవం, విశ్వాసం అపారమని కొనియాడాడు.
అరుదైన రికార్డు
ఈ ఐపీఎల్‌లో ముంబై సారధి హార్దిక్ పాండ్యా(Hardic Pandya) అరుదైన రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్(MI) తరఫున 100 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా హార్దిక్ రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో 223 సిక్సర్లతో కీరన్ పొలార్డ్ అగ్రస్థానంలో ఉండగా... 210 సిక్సర్లతో హిట్‌మాన్ రోహిత్ శర్మ తర్వాతి స్థానాల్లో హార్దిక్ నిలిచాడు. ముంబై ఇండియన్స్ తరఫున 94వ మ్యాచ్ ఆడిన హార్దిక్ ఈ ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్‌లో 20 బంతుల్లో సిక్సర్, బౌండరీ సాయంతో 24 పరుగులు చేసిన హార్దిక్.. ముంబై తరఫున 15 వందల పరుగులను కూడా పూర్తి చేసుకున్నాడు. హార్దిక్ ఓవరాల్‌గా తన ఐపీఎల్ కెరీర్‌లో 124 మ్యాచ్‌లు ఆడి 127 సిక్సర్లు బాదాడు.