అన్వేషించండి
Advertisement
IPL 2024: ఒక్క ఓటమి లేని లక్నోకు కోల్‌కత్తా షాక్ ఇస్తుందా ?
KKR vs LSG : కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ , లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. రెండు జట్లూ ఇప్పటివరకూ మూడు మ్యాచుల్లో తలపడ్డాయి. ఈ మూడు మ్యాచుల్లోలక్నో విజయం సాధించింది.
IPL 2024 KKR vs LSG Head to head Records: ఐపీఎల్ (IPL) 2024లో ఇవాళ మధ్యాహ్నం జరిగే 28వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్(KKR), లక్నో సూపర్ జెయింట్స్(LSG) తలపడనున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. కోల్‌కత్తా మొత్తం నాలుగు మ్యాచ్‌లలో మూడు మ్యాచుల్లో గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. కోల్‌కత్తా తమ సొంత మైదానంలో... లక్నోపై మొదటి విజయాన్ని నమోదు చేయడానికి ఆసక్తిగా ఉంటుంది. మరోవైపు లక్నో గత అయిదు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచుల్లో ఓడిపోయి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. కోల్‌కత్తాపై లక్నో సూపర్ జెయింట్స్ రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించి పూర్తి ఆదిపత్యం ప్రదర్శించింది.
హెడ్-టు-హెడ్ రికార్డ్స్
కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్‌లో ఇప్పటివరకూ మూడు మ్యాచుల్లో తలపడ్డాయి. ఈ మూడు మ్యాచుల్లోలక్నో విజయం సాధించింది. 2023లో ఈ రెండు జట్లు మద్య జరిగిన చివరి మ్యాచులో లక్నో కేవలం ఒక పరుగు తేడాతో గెలిచింది.
పిచ్ ఎలా ఉంటుందంటే..?
ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటర్‌లకు, బౌలర్లకు సమానంగా అనుకూలిస్తుంది. కెప్టెన్లు టాస్ గెలిచినప్పుడు ముందుగా బౌలింగ్ ఎంచుకుంటారు. ముగ్గురు స్పిన్నర్లతో కోల్‌కత్తా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆదివారం కోల్‌కతాలో ఉష్ణోగ్రత 37 డిగ్రీలు ఉంటుంది వర్షం పడే అవకాశం 10 శాతం మాత్రమే ఉంది. గాలిలో 46 శాతం తేమతో గాలి వేగం గంటకు 11 కి.మీ. ఉంటుంది.
దృష్టంతా వారిపైనే
కోల్‌కత్తా నైట్ రైడర్స్ ఎక్కువగా సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్‌లపైనే ఎక్కువ ఆధారపడుతోంది. వీరిద్దరూ విఫలం కావడంతో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్‌పై కోల్‌కత్తా ఓడిపోయింది. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో నరైన్ (27), రస్సెల్ (10) బ్యాట్‌తో విఫలం కావడంతో కోల్‌కత్తాకు ఓటమి తప్పలేదు. నరైన్, రస్సెల్ దూకుడుతో గత మ్యాచుల్లో కోల్‌కత్తా 200కుపైగా స్కోరు సాధించింది. కానీ వీరిద్దరూ విఫలం కావడంతో చెన్నైపై కేవలం 137 పరుగులకే పరిమితమైంది. నితీష్ రానా లేకపోవడంతో కోల్‌కత్తా కీలక బ్యాటర్‌ను కోల్పోయింది. గాయంతో బాధపడుతున్న నితీశ్ రానా.... ఈ మ్యాచ్‌కు కూడా దూరం కానున్నాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌పై భారీ స్కోరుపై కన్నేశాడు. గత నాలుగు మ్యాచుల్లో అయ్యర్ 0, 39, 18, 34 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు చేసి ఫామ్‌లోకి రావాలని అయ్యర్ చూస్తున్నారు.
కోల్‌కత్తా లెవన్( అంచనా): సాల్ట్ , సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రింకు సింగ్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, వరుణ్ చకరవర్తి. ఇంపాక్ట్ ప్లేయర్: అనుకుల్ రాయ్.
లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డి కాక్, KL రాహుల్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, యశ్ ఠాకూర్, అర్షద్ ఖాన్. ఇంపాక్ట్ ప్లేయర్: ఎం సిద్దార్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
తిరుపతి
హైదరాబాద్
తిరుపతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion