అన్వేషించండి

IPL 2024: యశ్‌ ఠాకూర్‌ అరుదైన రికార్డు, గిల్‌ వికెట్‌ గుర్తుండిపోతుంది

GT vs LSG :గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో గెలవడంలో యశ్‌ ఠాకూర్‌ కీలక పాత్ర పోషించాడు. 30 పరుగులు ఇచ్చి అయిదు వికెట్లు తీసి గుజరాత్‌ పతానాన్ని శాసించాడు.

'Shubman Gill's Wicket Was The Most Special' - Yash Thakur After Superb Five-Wiicket Haul Vs GT: గుజరాత్‌ టైటాన్స్‌(GT)తో జరిగిన మ్యాచ్‌లో లక్నో(LSG) ఘన విజయం సాధించింది. దీంతో హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో లక్నో గెలవడంలో యశ్‌ ఠాకూర్‌ కీలక పాత్ర పోషించాడు. 30 పరుగులు ఇచ్చి అయిదు వికెట్లు తీసి గుజరాత్‌ పతానాన్ని శాసించాడు. ఈ ఐపీఎల్‌లో అరుదైన ఘనతను యశ్‌ ఠాకూర్‌ తన పేరిట నమోదు చేసుకున్నాడు. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి మెయిడిన్‌ చేసిన బౌలర్‌గా అవతరించాడు. దీంతోపాటు ఈ సీజన్‌లో తొలి ఐదు వికెట్లు తీసిన బౌలర్‌గానూ నిలిచాడు. ఈ ప్రదర్శనపై యశ్‌ ఠాకూర్‌ స్పందించాడు. ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం ఆనందంగా ఉందన్ానడు. శుభ్‌మన్‌ గిల్‌ను ఔట్‌ చేసేందుకు పక్కా ప్రణాళికతో బరిలోకి దిగానని... దానిని అమలు చేయమని కేఎల్ రాహుల్‌ సూచించాడని.. అది విజయవంతమైందని తెలిపాడు. ఐపీఎల్‌లో తొలిసారి గుజరాత్‌పై తాము విజయం సాధించామని.... గిల్‌ను ఔట్‌ చేయడమే గుర్తుండిపోతుందన్నాడు. 

ఈ రికార్డులు కూడా...
ఐపీఎల్‌లో గుజరాత్‌ చేసిన రెండో అత్యల్ప స్కోరు ఇదే. లక్నోపై 130 పరుగులకు ఆలౌటైంది. గతేడాది ఢీల్లీపై 125 పరుగులు చేసింది. ఐపీఎల్‌లో గుజరాత్‌ రెండోసారి మాత్రమే ఆలౌట్‌ అయింది. గతేడాది చెన్నైపై 157 పరుగులకు ఆలౌట్‌ అయింది.  గుజరాత్‌పై ఐదు వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా యశ్‌ ఠాకూర్‌ నిలిచాడు. అంతకుముందు ఉమ్రాన్‌ మాలిక్ (5/25), భువనేశ్వర్ కుమార్‌ (5/30) ఈ ఘనత సాధించారు. వీరిద్దరూ హైదరాబాద్‌ బౌలర్లే. లక్నో తరఫున అత్యుత్తమ ఎకానమీతో బౌలింగ్‌ చేసిన టాప్ బౌలర్ కృనాల్‌ పాండ్య. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్ల కోటాలో 11 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. 

మ్యాచ్‌ సాగిందిలా..
గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 33 పరుగుల తేడాతో లక్నో ఘన విజయం సాధించింది. 163 లక్ష్యఛేదనలో గుజరాత్ మొత్తం వికెట్లు కోల్పోయి 130 పరుగులకే కుప్పకూలింది. స్వల్ప ఛేద‌నలో గుజ‌రాత్ టైటాన్స్(Gujarat Titans) క‌ష్టాల్లో ప‌డింది. రెండు ప‌రుగుల వ్య‌వ‌ధిలో కీల‌క వికెట్లు కోల్పోయింది. ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా వ‌చ్చిన‌ కేన్ విలియ‌మ్స‌న్(1) వెనుదిరిగాడు. ర‌వి బిష్ణోయ్ ఓవ‌ర్లో అతడికే క్యాచ్ ఇచ్చాడు. కుడివైపు ఎగిరి మరీ బిష్ణోయ్ ఆ బంతిని అందుకున్నాడు. దాంతో, 56 ప‌రుగుల‌కే రెండో వికెట్ ప‌డింది. అంతకుమందు య‌వ్ ఠాకూర్ బౌలింగ్‌లో ధాటిగా ఆడుతున్న కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్(19) ఔట‌య్యాడు. ఠాకూర్ వేసిన ఆరో ఓవ‌ర్ ఆఖ‌రి బంతికి బౌల్డ‌య్యాడు. దాంతో, 54 ప‌రుగుల వద్ద గుజ‌రాత్ తొలి వికెట్ కోల్పోయింది. దీంతో పవర్‌ ప్లే ముగిసేసరికి గుజరాత్ స్కోరు 54/1. కృనాల్ పాండ్య కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. ఒకే ఓవర్ లో రెండు వికెట్లు తీశాడు. 10 ఓవర్లు ముగిసేసరికి నాలుగు కీలకమైన వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. తరువాత కృనాల్ పాండ్య వేసిన 13 ఓవర్‌లో తొలి బంతికి దర్శన్‌ నల్కండే దొరికిపోయాడు. తరువాత నుంచి గుజరాత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. గుజరాత్ జట్టులో ప్రధాన బ్యాటర్లంతా పెవిలియన్‌ చేరారు.న్ దీంతో 33 పరుగుల తేడాతో లఖ్‌నవూ ఘన విజయం సాధించింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sandhya Theater: సంధ్య థియేటర్ ఘటన - బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షల సాయం
సంధ్య థియేటర్ ఘటన - బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షల సాయం
Vizag news: వైజాగ్ ప్రజలకు బిగ్ అలర్ట్ -  జనవరి ఒకటి నుంచి భూముల విలువ పెంపు - ఎక్కడెక్కడ ఎంత పెరగనున్నాయంటే ?
వైజాగ్ ప్రజలకు బిగ్ అలర్ట్ - జనవరి ఒకటి నుంచి భూముల విలువ పెంపు - ఎక్కడెక్కడ ఎంత పెరగనున్నాయంటే ?
Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Non Detention Policy: 5, 8 తరగతుల విద్యార్థులు పాస్ కావాల్సిందే - 'నాన్ డిటెన్షన్ విధానం' రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం
5, 8 తరగతుల విద్యార్థులు పాస్ కావాల్సిందే - 'నాన్ డిటెన్షన్ విధానం' రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sandhya Theater: సంధ్య థియేటర్ ఘటన - బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షల సాయం
సంధ్య థియేటర్ ఘటన - బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షల సాయం
Vizag news: వైజాగ్ ప్రజలకు బిగ్ అలర్ట్ -  జనవరి ఒకటి నుంచి భూముల విలువ పెంపు - ఎక్కడెక్కడ ఎంత పెరగనున్నాయంటే ?
వైజాగ్ ప్రజలకు బిగ్ అలర్ట్ - జనవరి ఒకటి నుంచి భూముల విలువ పెంపు - ఎక్కడెక్కడ ఎంత పెరగనున్నాయంటే ?
Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Non Detention Policy: 5, 8 తరగతుల విద్యార్థులు పాస్ కావాల్సిందే - 'నాన్ డిటెన్షన్ విధానం' రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం
5, 8 తరగతుల విద్యార్థులు పాస్ కావాల్సిందే - 'నాన్ డిటెన్షన్ విధానం' రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం
Allu Arjun Father-in-law: కాంగ్రెస్‌ పెద్దలతో అల్లు అర్జున్ మామ సమావేశం, సంధ్య థియేటర్ ఎపిసోడ్‌లో నెక్ట్స్ ఏం జరగబోతోంది?
కాంగ్రెస్‌ పెద్దలతో అల్లు అర్జున్ మామ సమావేశం, సంధ్య థియేటర్ ఎపిసోడ్‌లో నెక్ట్స్ ఏం జరగబోతోంది?
Paatal Lok 2: సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ 'పాతాళ్‌ లోక్‌' సీజన్‌ 2 - స్ట్రీమింగ్‌ డేట్ వచ్చేసిందోచ్ 
సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ 'పాతాళ్‌ లోక్‌' సీజన్‌ 2 - స్ట్రీమింగ్‌ డేట్ వచ్చేసిందోచ్ 
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Sania Mirza And Shami : దుబాయ్‌లో జంటగా కనిపించిన సానియా మీర్జా, షమీ - సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందా ?
దుబాయ్‌లో జంటగా కనిపించిన సానియా మీర్జా, షమీ - సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందా ?
Embed widget