అన్వేషించండి
Advertisement
KKR vs SRH, IPL 2024 Final : రికార్డులు ఎందుకు భాయ్, తేల్చుకుందాం రండి
KKR vs SRH, IPL 2024 final: లీగ్ దశ దాటిప్లేఆఫ్‌లను ఎదుర్కొని విజయం సాధించిన2 జట్లు తుది సమరానికి సిద్ధమయ్యాయి. 3వ సారి కప్పు కోసం కోల్‌కత్తా, 2వ సారి కప్పు కోసం హైదరాబాద్ రెడీగా ఉన్నాయి.
KKR vs SRH Head To Head Records: ఐపీఎల్(IPL) 2024 అంతిమ యుద్ధానికి అంతా సిద్ధమైంది. లీగ్ దశలను దాటి... ప్లేఆఫ్‌లను సమర్థంగా ఎదుర్కొని విజయం సాధించిన రెండు జట్లు తుది సమరానికి సిద్ధమయ్యాయి. కమిన్స్ నేతృత్వంలోని సన్ రైజర్స్ హైదరాబాద్(SRH)... శ్రేయస్స్ అయ్యర్ సారథ్యంలోని కోల్‌కత్తా నైట్ రైడర్స్(KKR) మైదానంలో భీకర పోరుకు సిద్ధమయ్యాయి. పటిష్టమైన బౌలింగ్, దుర్భేధ్యమైన బ్యాటింగ్ లైనప్‌లు ఉన్న రెండు జట్ల మధ్య పోరు అభిమానులకు ఉత్కంఠ పోరును అందించడం ఖాయంగా కనిపిస్తోంది. పాట్ కమిన్స్ వ్యూహాలు... గౌతం గంభీర్ ప్రణాళికల మధ్య మైదానంలో చిన్నపాటి యుద్ధమే జరగనుంది. మూడోసారి కప్పు అందుకోవాలని కోల్‌కత్తా.... రెండోసారి కప్పును ఒడిసిపట్టాలని హైదరాబాద్ తొడలు కొడుతున్నాయి. ఈ మహా పోరు కోసం కోట్లాది మంది అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
రికార్డులు వారివైపే
ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్... కోల్‌కత్తా నైట్ రైడర్స్ మధ్య 27 మ్యాచులు జరిగాయి. ఇందులో కోల్‌కత్తా పద్దెనిమిది మ్యాచ్‌లు గెలుపొందగా, హైదరాబాద్ కేవలం తొమ్మిది మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. ఈ సీజన్‌లోనే కోల్‌కత్తా-హైదరాబాద్ రెండు సార్లు తలపడగా ఈ రెండు మ్యాచుల్లోనూ కోల్‌కత్తానే విజయం సాధించింది. 2023 సీజన్‌లో కూడా రెండు మ్యాచులు గెలవగా ఈ రెండు జట్లు చెరో మ్యాచ్‌లో గెలుపొందాయి. ఈ సీజన్‌లో లీగ్ మ్యాచ్‌లో చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో కోల్‌కత్తా గెలిచింది. క్వాలిఫయర్ వన్‌లో హైదరాబాద్‌ను కోల్‌కత్తా చిత్తు చేసింది. తటస్థ వేదికల మీద కూడా కోల్‌కతా నైట్‌రెడర్స్ జట్టు ఆధిపత్యం సాగింది. తటస్థ వేదికల్లో ఇరు జట్లు 9 మ్యాచ్‌ల్లో ఢీకొనగా కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు 6 విజయాలు సాధించింది. మరోవైపు హైద్రాబాద్ 3 విజయాలు సాధించింది. మరో 3 మ్యాచ్‌లను కోల్పోయింది. ఇలా ఎటుచూసినా గణాంకాలు హైదరాబాద్‌ని కోల్‌కతా సమర్ధవంతంగా నిలువరించింది.
ఎర్రమట్టి పిచ్ సిద్ధం
కోల్‍కతా, హైదరాబాద్ మధ్య జరిగే ఐపీఎల్ ఫైనల్ కోసం చెపాక్ స్టేడియంలో ఎర్రమట్టి పిచ్ సిద్ధం చేశారు. ఈ ఎర్రమట్టి పిచ్ ఎక్కువగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. మ్యాచ్ గడుస్తున్నా కొద్ది స్పిన్నర్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఒక్కసారి బ్యాటర్లు క్రీజులు కుదురుకుంటే మాత్రం భారీ స్కోరు నమోదు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. చెపాక్‌లో టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేసేందుకు ఎక్కువ అవకాశం ఉంది.
వర్షం పడుతుందా..?
కోల్‍కతా, హైదరాబాద్ మధ్య జరిగే ఫైనల్‌కు చెపాక్‍లో వర్షం పడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. చెపాక్‌లో వర్షం పడే అవకాశం అయిదు శాతమే అని వాతావరణ విభాగం తెలిపింది. వాన పడినా మ్యాచ్‍కు స్వల్ప అంతరాయమే ఏర్పడే అవకాశం ఉంది. వాన వల్ల ఇవాళ మ్యాచ్ సాధ్యం కాకపోయినా ఫైనల్‍కు సోమవారం రిజర్వ్ డే ఉంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
హైదరాబాద్
సినిమా
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement