అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

IPL 2024: చెన్నై జైత్రయాత్రను ఢిల్లీ ఆపగలదా ?

IPL 2024 Dc Vs CSK : ఐపీఎల్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై మరో సమరానికి సిద్ధమైంది. ఆడిన రెండు మ్యాచుల్లోనూ గెలిచి పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్న చెన్నై, ఢిల్లీ క్యాపిటల్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.

IPL 2024 Dc Vs CSK Match preview and prediction : ఐపీఎల్‌(IPL)లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై(CSK) మరో సమరానికి సిద్ధమైంది. ఆడిన రెండు మ్యాచుల్లోనూ గెలిచి పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్న చెన్నై... రిషభ్‌ పంత్‌ సారధ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్‌(DC)తో అమీతుమీ తేల్చుకోనుంది. అయితే ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడిన ఢిల్లీ... ఆడిన రెండు మ్యాచుల్లోనూ గెలిచిన చెన్నైని ఎలా అడ్డుకోగలదా అన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. అయితే పృథ్వీ షా మళ్లీ జట్టులో చేరనుండడం ఢిల్లీ బ్యాటింగ్ లైనప్‌ను మరింత పటిష్టం చేయనుంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ఆడిన గత నాలుగు మ్యాచుల్లోనూ ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓడిపోవడం వారి ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీస్తోంది.

చెన్నైతో జరిగిన గత మూడు మ్యాచుల్లోనూ ఢిల్లీ ఘోరంగా ఓడిపోయింది. 91, 27, 77 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో అయినా గెలిచి ఈ చెత్త రికార్డును చెరిపేసుకోవాలని ఢిల్లీ పట్టుదలతో ఉంది. ఢిల్లీ ప్రధాన కోచ్‌ రికీ పాంటింగ్... డైరెక్టర్‌ సౌరవ్ గంగూలీ ఈ మ్యాచ్‌ కోసం ఎలాంటి వ్యూహాలు రచిస్తారో వేచి చూడాలి. పృథ్వీ షా. రికీ భుయ్‌ రాణిస్తే ఢిల్లీ బ్యాటింగ్‌ కాస్త మెరుగవుతుంది. కానీ ఫిట్‌నెస్‌ పూర్తిగా సాధించని పృథ్వీ షా ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. డేవిడ్ వార్నర్, కెప్టెన్ రిషబ్ పంత్ గాడిన పడాల్సి ఉంది, మిచెల్ మార్ష్‌పై కూడా ఢిల్లీ ఆశలు పెట్టుకుంది. అయితే ముస్తాఫిజుర్ రెహ్మాన్, దీపక్ చాహర్, మతీషా పతిరాణ, రవీంద్ర జడేజాలతో పటిష్టంగా ఉన్న చెన్నై బౌలింగ్‌ను ఢిల్లీ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.  పంత్ విఫలమైతే ధాటిగా ఆడగల దేశీయ క్రికెటర్లు లేకపోవడం ఢిల్లీని వేధిస్తోంది. ఇషాంత్‌శర్మ మళ్లీ జట్టులోకి వస్తే ఢిల్లీ బౌలింగ్‌ కాస్త మెరుగుపడుతుంది. 

చెన్నై బ్యాటింగ్ కూడా...
రచిన్‌ రవీంద్ర, రహానే, రుతురాజ్‌, ధోనీ, రవీంద్ర జడేజాలతో కూడా చెన్నై బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్టంగా ఉంది. ధోనీ మార్గనిర్దేశనం చెన్నైకి బాగా కలిసి వస్తోంది. ముస్తాఫిజుర్ బౌలింగ్‌ చెన్నైకు ప్రధాన బలం. చెన్నైకి పెద్దగాసమస్యలు ఏమీ లేవు. 
జట్లు
చెన్నై: ధోని, మొయిన్ అలీ, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్‍(కెప్టెన్‌), రాజవర్ధన్ హంగర్గేకర్, రవీంద్ర జడేజా, అజయ్ మండల్, ముఖేష్ చౌదరి, అజింక్యా రహానే,  షేక్ రషీద్, మిచెల్ శాంట్నర్‌, సిమర్జిత్‌ సింగ్‌, నిశాంత్ సింధు, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ, రచిన్ రవీంద్ర, శార్దూల్ ఠాకూర్, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, ముస్తాఫిజుర్ రెహమాన్, అవనీష్ రావు అరవెల్లి. 

ఢిల్లీ క్యాపిటల్స్: రిషబ్ పంత్ (కెప్టెన్‌), డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, యశ్ ధుల్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, మిచెల్ మార్ష్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్, అన్రిచ్ నోర్ట్జే, కుల్దీప్ యాదవ్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఖలీల్ అహ్మద్ ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్, ట్రిస్టన్ స్టబ్స్, రికీ భుయ్, కుమార్ కుషాగ్రా, రసిఖ్ దార్, ఝే రిచర్డ్‌సన్, సుమిత్ కుమార్, స్వస్తిక్ చికారా, షాయ్ హోప్.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Srikakulam Latest News: తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
Weather Update Today:తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత - వాయుగుండం ప్రభావంతో ఏపీలో వర్షాలు
తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత - వాయుగుండం ప్రభావంతో ఏపీలో వర్షాలు
Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Embed widget