అన్వేషించండి
Advertisement
IPL 2024: చెన్నై గెలవాలంతే? చెపాక్ వేదికగా కీలక సమరం
IPL 2024, CSK vs RR : ఐపీఎల్ 2024, 17వ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడబోతుంది. రెండు జట్ల మధ్యమ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు చెన్నైచిదంబరం స్టేడియంలో జరగనుంది.
CSK vs RR Preview and Prediction : ఐపీఎల్(IPL)లో ప్లే ఆఫ్‌లో అడుగుపెట్టేందుకు రాజస్థాన్(RR).... ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్(CSK).... కీలక మ్యాచ్‌కు సిద్ధమయ్యాయి. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ 6 విజయాలతో ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో కొనసాగుతోంది. దీంతో మిగిలిన చివరి రెండు మ్యాచ్‌లను ఆ జట్టు తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో రాజస్థాన్‌పై గెలిచి ప్లే ఆఫ్ ఆశలు మరింత సంక్లిష్టం చేసుకోవద్దనే పట్టుదలతో చెన్నై ఉంది. అయితే ఇప్పటికే కోల్‌కత్తా ప్లే ఆఫ్‌లో అడుగుపెట్టగా.... ప్లే ఆఫ్‌కు చేరిన రెండో జట్టుగా నిలవాలని రాజస్థాన్ భావిస్తోంది.
చెన్నైకి ప్రాణ సంకటం
రాజస్థాన్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్ చెన్నై సూపర్‌కింగ్స్‌కు చాలా కీలకంగా మారింది. చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. గుజరాత్ టైటాన్స్ చేతిలో 35 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన చెన్నై... ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే మిగిలిన రెండు మ్యాచుల్లో తప్పనిసరిగా గెలవాల్సిన స్థితిలో నిలిచింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఓటమి చెన్నైపై ఒత్తిడిని పెంచింది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ ఓడిపోయినా పెద్దగా ప్రతికూల ప్రభావం ఉండదు. కానీ చెన్నై ఓడిపోతే మాత్రం... ప్లేఆఫ్ ఆశలు మరింత సంక్లిష్టంగా మారుతాయి. అజింక్యా రహానే, రచిన్ రవీంద్ర, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌లతో కూడిన చెన్నై టాపార్డర్ అంచనాలను అందుకోలేకపోతోంది. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో అది కొట్టుచ్చినట్లు కనిపించింది. అయితే సొంత మైదానం చెపాక్‌లో రాజస్థాన్‌పై గెలిచి సత్తా చాటాలని చెన్నై భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో రచిన్ రవీంద్రకు మరోసారి అవకాశం ఇవ్వవచ్చు. డారిల్ మిచెల్, మోయిన్ అలీలలో జట్టులో చోటు దక్కుతుందా లేక చెన్నై ఏమైనా ప్రయోగాలు చేస్తుందేమో చూడాలి. శివమ్ దూబే మొదటి ఆరు మ్యాచ్‌ల్లో 163.51 స్ట్రైక్ రేట్, 60.50 సగటుతో 242 పరుగులు చేశాడు. కానీ తర్వాతి ఆరు మ్యాచ్‌ల్లో మూడుసార్లు సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరాడు. ఇది కూడా చెన్నై విజయాలను తీవ్రంగా దెబ్బతీసింది.
పరాజయాలకు చెక్ పెట్టాలని...
వరుసగా రెండు మ్యాచుల్లో పరాజయం పాలైన రాజస్థాన్.. ఈ మ్యాచ్‌లో గెలిచి అపజయాల జైత్రయాత్రకు చెక్ పెట్టాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్‌కు చేరాలని పట్టుదలగా ఉంది. ఈ సీజన్‌లో అత్యుత్తమంగా రాణించలేకపోయిన ఓపెనర్ యశస్వి జైస్వాల్... టీ 20 ప్రపంచకప్ కోసం అమెరికాకు వెళ్లే ముందు తన సత్తాను నిరూపించుకోవాలని తహతహలాడుతున్నాడు. సంజు శాంసన్ కూడా భారీ ఇన్నింగ్స్‌పై కన్నేశాడు. ఢిల్లీతో జరిగిన చివరి గత మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన హోమ్ గ్రౌండ్‌లో సత్తా చాటాలని చూస్తున్నాడు.
జట్లు
చెన్నై: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), MS ధోని అరవెల్లి అవనీష్, అజింక్యా రహానే, షేక్ రషీద్, మొయిన్ అలీ, శివమ్ దూబే, RS హంగర్గేకర్, రవీంద్ర జడేజా, అజయ్ జాదవ్ మండల్, డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, మిచెల్ సాంట్నర్ , దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ చౌదరి, సిమర్‌జీత్ సింగ్, ప్రశాంత్ సోలంకి, శార్దూల్ ఠాకూర్, మహేశ్ తీక్షణ, సమీర్ రిజ్వీ.
రాజస్థాన్: సంజు శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, షిమ్రాన్ హెట్మెయర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, డోనోవన్ ఫెరీరా, కునాల్ రాథోడ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ సేన్, నవదీప్ సైనీ, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్ రోవ్‌మన్ పావెల్, శుభమ్ దూబే, టామ్ కోహ్లర్-కాడ్‌మోర్, అబిద్ ముస్తాక్, నాంద్రే బర్గర్, తనుష్ కోటియన్, కేశవ్ మహారాజ్.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
తెలంగాణ
ఆటో
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion