అన్వేషించండి

IPL 2024 CSK vs GT:చెన్నై హోరా, గుజరాత్ జోరా?

Chennai Super Kings vs Gujarat Titans: ఐపీఎల్‌లో మరో ఆసక్తికర సమరం జరగునుంది. తొలి మ్యాచ్‌లో విజయం సాధించి సీజన్‌ను ఘనంగా ఆరంభించిన చెన్నై సూపర్‌కింగ్స్‌ గుజరాత్‌ టైటాన్స్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి.

IPL 2024 CSK vs GT Match  preview :  ఐపీఎల్‌(IPL)లో మరో ఆసక్తికర సమరం జరగునుంది. తొలి మ్యాచ్‌లో విజయం సాధించి ఐపీఎల్‌ సీజన్‌ 17ను ఘనంగా ఆరంభించిన చెన్నై సూపర్‌కింగ్స్‌(CSK) గుజరాత్‌ టైటాన్స్‌(GT) అమీతుమీ తేల్చుకోనున్నాయి. తొలి మ్యాచ్‌లో అద్భుత విజయాలు సాధించిన ఇరు జట్లు ఆ జోరు కొనసాగించాలని పట్టుదలగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి ఐపీఎల్‌లో ఆధిపత్యం ప్రదర్శించాలని చెన్నై.. గుజరాత్ వ్యూహాలు రచిస్తున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లోనే తన కెప్టెన్సీతో ఆకట్టుకున్న రుతురాజ్‌ గైక్వాడ్‌.. ఈ మ్యాచ్‌లోనూ విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాడు. ఇటు గుజరాత్‌ టైటాన్స్‌కు నాయకత్వం వహిస్తున్న గిల్‌ కూడా తొలి మ్యాచ్‌లో తన నిర్ణయాలతో మెప్పించాడు. ఈ ఇద్దరు యువ ఆటగాళ్లకు ఈ మ్యాచ్‌ కీలకంగా మారనుంది. 24 ఏళ్ల గిల్‌ ఐపీఎల్‌లోనే అతి పిన్న వయస్కుడైన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. గిల్‌కు గుజరాత్‌ ప్రధాన కోచ్‌ ఆశిష్ నెహ్రా నుంచి మంచి సహకారం లభిస్తోంది.

గిల్‌-రుతురాజ్‌ వ్యూహాలే కీలకం
గుజరాత్‌ జట్టులో అనుభవజ్ఞులైన డేవిడ్ మిల్లర్, కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఉన్నారు. వీరిద్దరూ గిల్‌కు సహయకరంగా ఉంటున్నారు. చెన్నైలోనూ రుతురాజ్‌ గైక్వాడ్‌కు మిస్టర్ కూల్‌, తలైవా ధోనీ అండగా నిలుస్తున్నాడు. అయితే చెన్నైను బౌలింగ్ వైఫల్యం కాస్త ఆందోళన పరుస్తోంది. పేసర్ తుషార్ దేశ్‌పాండే తొలి మ్యాచ్‌లో ఆశించిన మేర రాణించలేదు. ముస్తాఫిజుర్ రెహ్మాన్ నాలుగు వికెట్లు పడగొట్టిన తర్వాత కూడా చెన్నై బౌలర్లను ఎదుర్కొంటూ బెంగళూరు బ్యాటర్లు అనుజ్ రావత్, దినేష్ కార్తీక్ 95 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరి భాగస్వామ్యంతో బెంగళూరు... చెన్నైకు పోరాడే లక్ష్యాన్ని నిర్దేశించింది. శార్దూల్ ఠాకూర్ జట్టులో చోటు కోసం ఎదురు చూస్తున్నాడు. అన్‌ క్యాప్డ్‌ ముఖేష్ చౌదరిని కూడా చెన్నై జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. శ్రీలంక పేసర్ మతీషా పతిరాణ గాయం నుంచి కోలుకున్నాడు. అతడికి తుది జట్టులో చోటు దక్కుతుందా లేదా అన్నది చూడాలి. రచిన్ రవీంద్రను స్పిన్నర్‌గా జట్టులోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రచిన్‌ రవీంద్ర.. 15 బంతుల్లో 37 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇదే ఫామ్‌ను ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాలని రచిన్‌ చూస్తున్నాడు. తొలి మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన సమీర్ రిజ్వీకు బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు. ఈ మ్యాచ్‌లో అతడు సత్తా చాటాలని చూస్తున్నాడు. బెంగళూరు  మ్యాచ్‌లో ధోని కూడా బ్యాటింగ్ చేయలేదు. తలైవా అభిమానులు ధోనీ బ్యాటింగ్‌ చూసేందుకు తహతహలాడుతున్నారు. 

గుజరాత్‌ జోరు సాగేనా
ముంబైతో మ్యాచ్‌లో గెలిచిన టాప్‌  ఆర్డర్‌ బ్యాటర్లు భారీ స్కోరు చేయడంలో విఫలం కావడం గుజరాత్‌ను ఆందోళన పరుస్తోంది. గిల్, వృద్ధిమాన్ సాహా భారీ స్కోర్లు చేయాలని గుజరాత్‌ మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. అజ్మతుల్లా ఒమర్జాయ్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియాలు తమ ఫామ్‌ను నిరూపించుకోవాల్సి ఉంది. చెన్నైలో జన్మించిన క్రికెటర్ సాయి సుదర్శన్‌పై గుజరాత్‌ భారీ ఆశలు పెట్టుకుంది. నెమ్మదిగా ఉండే చెపాక్ పిచ్‌పై రషీద్ ఖాన్, సాయి కిషోర్ కీలక పాత్ర పోషిస్తారు. 

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), MS ధోని, మొయిన్ అలీ, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, శివమ్ దూబే, రాజవర్ధన్ హంగార్కర్, రవీంద్ర జడేజా, అజయ్ మండల్, ముఖేష్ చౌదరి, అజింక్యా రహానే, షేక్ రషీద్, మిచెల్ ఎస్. , సిమర్‌జీత్ సింగ్, నిశాంత్ సింధు, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ, రచిన్ రవీంద్ర, శార్దూల్ ఠాకూర్, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, ముస్తాఫిజుర్ రెహమాన్, మరియు ఆరవెల్లి అవనీష్ రావు 

గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, రాహుల్ తెవాటియా, నూర్ అహ్మద్, సాయి కిషోర్, రషీద్ ఖాన్, జోస్హూ లి ఖాన్, , మోహిత్ శర్మ, అజ్మతుల్లా ఒమర్జాయ్, ఉమేష్ యాదవ్, షారుక్ ఖాన్, సుశాంత్ మిశ్రా, కార్తీక్ త్యాగి, మానవ్ సుతార్, స్పెన్సర్ జాన్సన్, సందీప్ వారియర్

టాప్ హెడ్ లైన్స్

Yashasvi Jaiswal Trade: రాయల్స్ ను వీడాలని  జైస్వాల్ సంచలన నిర్ణయం..! రిటైన్ చేసుకున్నా ట్రేడింగ్ కోసం ఫ్రాంచైజీల వేట, రేసులో లక్నో ఢిల్లీ కోల్‌కతా జట్లు
రాయల్స్ ను వీడాలని  జైస్వాల్ సంచలన నిర్ణయం..! రిటైన్ చేసుకున్నా ట్రేడింగ్ కోసం ఫ్రాంచైజీల వేట, రేసులో లక్నో ఢిల్లీ కోల్‌కతా జట్లు
Hardik Pandya News: PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
Balakrishna Dhoni : కొందరికి కెప్టెన్ కూల్... మనందరికీ తలా - ధోనీపై బాలయ్య ఎలివేషన్ వేరే లెవల్
కొందరికి కెప్టెన్ కూల్... మనందరికీ తలా - ధోనీపై బాలయ్య ఎలివేషన్ వేరే లెవల్
IPL 2027 Retention Full List: ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: సీఎం రేవంత్ రెడ్డి
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: సీఎం రేవంత్ రెడ్డి
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
Pollution Certificate: పొల్యూషన్ రూల్స్‌ పాటించని 17,000కు పైగా వాహనాలు సీజ్.. దాదాపు 26,000 ట్రాఫిక్‌ చలాన్లు జారీ, జర జాగ్రత్త!
పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే తప్పదు 'జరిమానా'.. 17 రోజుల్లోనే దాదాపు 26,000 చలాన్లు జారీ
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Aakasamlo Oka Tara OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
Embed widget