IPL 2024:జులపాల ధోనీ అప్పట్లో మెరిశాడు, ఇప్పుడు ఏం చేస్తాడో ?
IPL 2024 CSK VS PBKS: ఈరోజు జరిగే చెన్నై మ్యాచ్ కి ఓ ప్రాధాన్యం ఉంది. 2010లో జరిగిన సీజన్‌లో ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంది. అప్పుడు కూడా ఇదే ధర్మశాలలో పంజాబ్ మీద మ్యాచ్. అప్పుడేం జరిగిందంటే..
Chennai and Punjab will going to face each other after 12 years in Dharamshala: ఐపీఎల్ 53వ మ్యాచ్లో ధర్మశాల స్టేడియాన్ని రెండో హోం గ్రౌండ్‌గా ఎంచుకున్న పంజాబ్ కింగ్స్(PBKS).. చెన్నై సూపర్‌కింగ్స్(CSK)తో కీలక మ్యాచ్ తలపడనుంది. గత మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని చెన్నై జట్టు కసిగా ఉంది. గత మ్యాచ్‌లో చెన్నై 162 పరుగులు చేయగా... పంజాబ్ సునాయసంగా ఈ లక్ష్యాన్ని ఛేదించింది. ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే గెలుపు తప్పనిసరి కావడంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని చెన్నై, పంజాబ్ జట్లు పట్టుదలతో ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ ఇంకా నాలుగు మ్యాచులు మిగిలి ఉన్నాయి. పంజాబ్, గుజరాత్, బెంగుళూరు జట్లతో చెన్నై మ్యాచులు ఆడాల్సి ఉంది. ప్లేఆఫ్ స్పాట్ కోసం పోటీలో ఉండాలంటే చెన్నై కనీసం రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాలి. మూడు విజయాలు సాధిస్తే చెన్నై 16 పాయింట్ల మార్క్‌ను చేరుకుంటుంది. మొత్తం నాలుగు మ్యాచుల్లో గెలిస్తే చెన్నైకు మొత్తం 18 పాయింట్లు దక్కి మిగతా ఎవరితో సంబంధం లేకుండా ప్లే ఆఫ్‌కు చేరుతుంది.
ఈ మ్యాచ్ గుర్తుందా...
ఈరోజు జరిగే చెన్నై మ్యాచ్ కి ఓ ప్రాధాన్యం ఉంది. 2010లో జరిగిన సీజన్‌లో ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంది. అప్పుడు కూడా ఇదే ధర్మశాలలో పంజాబ్ మీద మ్యాచ్. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ 192పరుగులు చేసింది. ఛేజింగ్ లో సురేశ్ రైన్, బద్రీనాథ్ లు బాగానే ఆడినా కావాల్సిన ఫినిషింగ్ రాలేదు. అలాంటి టైమ్ లో దిగిన ధోని చాలా అగ్రెసివ్ గా ఆడాడు. 29బాల్స్ మాత్రమే ఆడి 5ఫోర్లు 2సిక్సులతో 54పరుగులు చేసి చెన్నైను ప్లే ఆఫ్‌కు చేర్చాడు. మ్యాచ్ లో విన్నింగ్ షాట్ సిక్స్ కొట్టిన తర్వాత తనను తనే అరుచుకుంటూ ధోని మొహం మీద ఒక్క పంచ్ ఇచ్చుకుంటాడు. ఆ ఏడాది అదే అగ్రెషన్ తో తమ తొలి ఐపీఎల్ ట్రోఫీ అందుకున్న సీఎస్కే...14ఏళ్లు గిర్రున తిరిగే సరికి 5ఐపీఎల్ ట్రోఫీలతో ముంబైతో సమానంగా అతిపెద్ద ఐపీఎల్ జట్లలో ఒకటిగా నిలిచింది. అంతటి ఐకానిక్ ఇంపార్టెన్స్ ఉన్న గ్రౌండ్ లో మళ్లీ అదే పంజాబ్ తో అలాంటి సిచ్యుయేషన్ లో మ్యాచ్. ఈసారి కూడా సీఎస్కే తో పాటు ధోని ఉన్నాడు. మరి ఈ సారి జులపాల జుట్టు మాహీ ఏం చేస్తాడని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. రుతురాజ్ గైక్వాడ్ బాగా ఆడుతున్నా మిడిల్ ఓవర్లలోనే శివమ్ దూబే మీద అతిగా ఆధారపడుతున్న సీఎస్కే ఈ మ్యాచ్ లో జూలు విదిలించి ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరోవైపు పంజాబ్ మంచి టచ్ లో ఉంది. మ్యాచులు గెలవలేకపోయినా వాళ్లది దాదాపు అన్నీ లాస్ట్ ఓవర్ లో ఫలితాలు తేలిన మ్యాచ్ లే. బెయిర్ స్టో, శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ ఇంట్రెస్టింగ్ ప్లేయర్స్ పంజాబ్ లో..వాళ్లు చెన్నైని ఏం చేస్తారో చూడాలి.
హైబ్రిడ్ పిచ్‌పై...
పంజాబ్‌పై ఘన విజయం సాధించి ప్లే ఆఫ్ రేసులో ముందుకు వెళ్లాలని రుతురాజ్ సారధ్యంలోని చెన్నై జట్టు భావిస్తోంది. ఈ మ్యాచ్ హైబ్రిడ్ పిచ్‌లపై జరగనుంది. ఈ టోర్నీలో 200పైన స్కోర్లు తరచూ నమోదవుతున్నాయి. 200కుపైగా లక్ష్యం కూడా నిలవట్లేదు. ఈ పరిస్థితుల్లో బ్యాటర్లకు, బౌలర్లకు సమానంగా సహకరించాలన్న ఉద్దేశంతో ఈ హైబ్రిడ్ పిచ్‌లను రూపొందిస్తున్నారు. చెన్నై జట్టు MS ధోనీ, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా వంటి ఆటగాళ్లు ఉన్నారు. ఉన్నారు. పంజాబ్‌లో జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రాన్, లియామ్ లివింగ్‌స్టోన్, కగిసో రబడ, అర్ష్‌దీప్ సింగ్ ఉన్నారు. వీరులో ఇద్దరు నిలబడితే మ్యాచ్ ఏకపక్షంగా మారే అవకాశం ఉంది.
ఈ మ్యాచ్ గుర్తుందా..?