IPL 2024:సన్‌రైజర్స్ దెబ్బకి హెల్మెట్లతో బాల్ బాయ్స్
DC vs SRH: సన్ రైజర్స్ బ్యాటర్ల విధ్వంసంతో బౌండరీల బయట ఉండి బాల్స్ అందించే బాల్ బాయ్స్ బెంబేలెత్తిపోయారు. రక్షణ కోసం హెల్మెట్స్ ధరించారు.
All the Ball Boys are wearing helmets for the DC vs SRH Match : సన్ రైజర్స్(SRH) మ్యాచ్ అంటే చాలు సిక్సర్ల వర్షం కురవటమే. ఓపెనర్లు హెడ్, అభిషేక్ శర్మ ల దగ్గర మొదలుపెట్టి మార్ క్రమ్, క్లాసెన్, సమద్, షాబాజ్, నితీశ్ రెడ్డి ఇలా ప్రతీ ఒక్కరూ సిక్సర్లు బాదుతూ సన్ రైజర్స్ కి రికార్డు స్థాయి స్కోర్లను అందిస్తున్నారు. మరి ఈ సిక్సర్ల వర్షానికి ప్రభావితం అవుతోంది ప్రత్యర్థి బౌలర్లు మాత్రమే కాదు బౌండరీలు బంతులు అందించే చిన్నపిల్లలు కూడా. అందుకే బాల్ బాయ్స్ కి రక్షణ ఉండాలని హెల్మెట్లు పెట్టి బౌండరీల లైన్స్ దగ్గర ఉంచుతున్నారు. క్రికెట్ అకాడమీలో క్రికెట్ నేర్చుకునే పిల్లలకు సాధారణంగా బాల్ బాయ్స్ గా అవకాశం ఇస్తారు. తమకు ఇష్టమైన క్రికెటర్లను దగ్గర నుంచి ప్రేరణ పొందటం కోసం ఇలాంటి అవకాశాన్ని చిన్నారులకు కల్పిస్తారు.
ఇప్పుడు ఈ ఐపీఎల్లో సన్ రైజర్స్ కురిపిస్తున్న సిక్సర్ల వర్షానికి పిల్లలకు బాల్ తగిలి గాయం అవ్వకుండా ఉండటం కోసమే ఇలా ఏర్పాట్లు చేసినట్లు బీసీసీఐ చెబుతోంది. నిన్న ఢిల్లీతో సన్ రైజర్స్ కి జరిగిన మ్యాచ్ లో ఆరెంజీ ఆర్మీ ఏకంగా 22 సిక్సులు బాదింది. ఢిల్లీ 9 సిక్సులు కొట్టింది. సో మొత్తం మ్యాచ్ లో 31 సిక్సులు పడ్డాయి. ఆ వర్షానికి తడవకుండా ఈ పిల్లలకు హెల్మెట్లు అండ్ బాల్ కోసం వెయిట్ చేస్తున్న ఈ పిల్లల క్యూట్ క్యూట్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.