Harry Brook: మోస్ట్ డిజప్పాయిటింగ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ - రూ. 13 కోట్ల రేటు - ఒక్క సెంచరీ మినహా!
సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 13.25 కోట్లు చెల్లించి కొనుగోలు చేసిన హ్యారీ బ్రూక్ ఘోరంగా విఫలం అయ్యాడు.
Harry Brook In IPL 2023: ఐపీఎల్ 2023లో ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో స్టార్ బ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూక్ మరోసారి ఫ్లాప్ అయ్యాడు. ఐదో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన హ్యారీ బ్రూక్ రెండో బంతికి ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు. టెస్ట్ మ్యాచ్‌లలో టీ20లా బ్యాటింగ్ చేసిన హ్యారీ బ్రూక్ ఐపీఎల్ 2023లో వరుసగా ఫ్లాప్ అవుతున్నట్లు కనిపిస్తున్నాడు.
మినీ వేలంలో రూ. 13.25 కోట్ల భారీ ధరకు ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూక్‌ను హైదరాబాద్ తమ జట్టులో చేర్చుకుంది. అయితే ఈ సీజన్‌లో అతని బ్యాట్ నుండి ఒక సెంచరీ వచ్చింది. కానీ అది తీసేస్తే అతని ప్రదర్శన డిజాస్టర్ అయింది. హ్యారీ బ్రూక్‌కి ఇది తొలి ఐపీఎల్ సీజన్.
హ్యారీ బ్రూక్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు మొత్తం ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేశాడు. అందులో అతను ఒకసారి సెంచరీ సాధించాడు. అయితే అతను నాలుగు సందర్భాల్లో రెండంకెల స్కోరును దాటలేకపోయాడు. అదే సమయంలో అతను మిగిలిన అన్ని ఇన్నింగ్స్‌ల్లోనూ 20 పరుగుల మార్కును దాటలేదు. హ్యారీ బ్రూక్ ఇప్పటివరకు ఆడిన మొత్తం ఎనిమిది ఇన్నింగ్స్‌లలో వరుసగా 13, 3, 13, 100*, 9, 18, 7 మరియు 0 పరుగులు చేశాడు.
ఇప్పటివరకు ఆడిన 8 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసిన బ్రూక్ కేవలం 23.29 సగటుతో, 125.38 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. సెంచరీ సహాయంతో మొత్తం 163 పరుగులు సాధించాడు. ఈ సీజన్‌లో హైదరాబాద్ జట్టు సగానికి పైగా మ్యాచ్‌లు ఆడింది. అయితే బ్రూక్ ఇప్పటివరకు బ్యాట్‌తో విఫలమయ్యాడు.
కేకేఆర్‌తో సెంచరీ చేయడం ద్వారా సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున మూడంకెల స్కోరు చేసిన మూడో బ్యాటర్‌గా బ్రూక్ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ ఘనత ఎస్ఆర్‌హెచ్ మాజీ సారథి డేవిడ్ వార్నర్, ఓపెనర్ జానీ బెయిర్ స్టో ల పేరిట ఉండేది. వార్నర్ భాయ్ కూడా కేకేఆర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై రెండు సెంచరీలు బాదాడు. బెయిర్ స్టో.. ఆర్సీబీ పై వంద పరుగులు కొట్టాడు.
1. డేవిడ్ వార్నర్ : 2017 ఏప్రిల్ 30న కేకేఆర్ పై - (59 బంతుల్లో 126, 10 ఫోర్లు, 8 సిక్సర్లు)
2. జానీ బెయిర్ స్టో : 2019, మార్చి 31న ఆర్సీబీపై - (56 బంతుల్లో 114, 12 ఫోర్లు 7 సిక్సర్లు)
3. డేవిడ్ వార్నర్ : 2019, మార్చి 31న ఆర్సీబీపై - (55 బంతుల్లో 100 నాటౌట్, 5 ఫోర్లు, 5 సిక్సర్లు)
4. హ్యారీ బ్రూక్ : 2023, ఏప్రిల్14న కేకేఆర్ పై (55 బంతుల్లో 100 నాటౌట్, 12 ఫోర్లు, 3 సిక్సర్లు)
ఐపీఎల్‌లో సెంచరీ కంటే ముందే బ్రూక్.. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) లో కూడా శతకం బాదాడు. పీఎస్ఎల్ లో లాహోర్ ఖలాండర్స్ తరఫున ఆడుతున్న అతడు.. గతేడాది ఫిబ్రవరి 19న సెంచరీ చేశాడు. లాహోర్ - ఇస్లామాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బ్రూక్.. ఐదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి 49 బంతుల్లోనే 10 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 102 రన్స్ చేశాడు. కాగా ఇప్పటివరకూ పీఎస్‌ఎల్ తో పాటు ఐపీఎల్ లో సెంచరీ చేసిన ఏకైక బ్యాటర్ బ్రూక్. క్రిస్ గేల్, కీరన్ పొలార్డ్ వంటి దిగ్గజాలు.. డుప్లెసిస్, రిలీ రూసో వంటి టీ20 స్టార్ బ్యాటర్లు అక్కడా ఇక్కడా ఆడినా వారికి కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు.