SRH vs RR, IPL 2023: సన్‌రైజర్స్ ఇంపాక్ట్ ప్లేయర్లుగా వీరే! రాజస్థాన్ కౌంటర్ స్ట్రాటజీ ఇదే!
SRH vs RR, IPL 2023: ఐపీఎల్ 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి మ్యాచ్ ఆడబోతోంది. రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. మరి నేటి మ్యాచులో వీరు ఇంప్టాక్ ప్లేయర్లుగా ఎవరిని ఎంచుకొనే అవకాశం ఉందంటే?
SRH vs RR, IPL 2023:
ఐపీఎల్ 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) తొలి మ్యాచ్ ఆడబోతోంది. గతేడాది రన్నరప్ రాజస్థాన్ రాయల్స్‌తో (Rajastan Royals) తలపడనుంది. మధ్యాహ్నమే మ్యాచ్ మొదలవుతోంది. ఈ సీజన్లో ఇంపాక్ట్ ప్లేయర్ (Impact Player) ఆప్షన్ గెలుపోటములను నిర్దేశిస్తోంది. మరి నేటి మ్యాచులో సన్‌రైజర్స్, రాజస్థాన్ (SRH vs RR) ఇంప్టాక్ ప్లేయర్లుగా ఎవరిని ఎంచుకొనే అవకాశం ఉందంటే?
బ్యాటింగ్/ బౌలింగ్‌ను బట్టే!
ఇంపాక్ట్ ప్లేయర్లను ఎంచుకొనే క్రమంలో అన్ని జట్లు టాస్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాయి. మొదట బ్యాటింగ్ లేదా బౌలింగ్ ఎంచుకోవడాన్ని బట్టి ఇంపాక్ట్ ప్లేయర్లను తీసుకుంటున్నాయి. ఉదాహరణకు మొదట ఫీల్డింగ్ చేసే జట్టు ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎవరినీ సబ్‌స్టిట్యూట్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కువ మంది బౌలర్లను తుది జట్టులో తీసుకొని ఛేదనలో మార్చుకుంటే చాలు. ఇక మొదట బ్యాటింగ్ చేసే టీమ్ ఎక్కువ మంది బ్యాటర్లను ఎంచుకుంటోంది. స్కోరును డిఫెండ్ చేసేటప్పుడు ప్రత్యేకమైన బౌలర్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా తెస్తున్నాయి.
సన్‌రైజర్స్ హైదరాబాద్
తొలుత బ్యాటింగ్ చేస్తే తుది జట్టు అంచనా: అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, హ్యారీ బ్రూక్, గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, అకేల్ హుసేన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్
సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ చేస్తే ముగ్గురు విదేశీయులనే తుది జట్టులోకి తీసుకోవచ్చు. పరిస్థితులను బట్టి ఇంపాక్ట్ ప్లేయర్లు పేసర్ ఫజల్‌హక్ ఫరూఖీ, లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్‌ను ఎంచుకోవచ్చు.
తొలుత బౌలింగ్ చేస్తే తుది జట్టు అంచనా: మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, హ్యారీ బ్రూక్, గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, అకేల్ హుసేన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్, ఆదిల్ రషీద్/ఫజల్‌హక్ ఫరూఖీ
మొదట ఫీల్డింగ్ చేస్తే సన్‌రైజర్స్ ఆరుగురు జెన్యూన్ బౌలర్లను తీసుకోవచ్చు. ఛేదనలో ఎవరో ఒక బౌలర్‌ను సబ్‌స్టిట్యూట్‌గా పంపించి అభిషేక్ శర్మను ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకురావొచ్చు.
రాజస్థాన్ రాయల్స్
తొలుత బ్యాటింగ్ చేస్తే తుది జట్టు అంచనా : జోస్ బట్లర్, యశస్వీ జైశ్వాల్, దేవదత్ పడిక్కల్, సంజూ శాంసన్, షిమ్రన్ హెట్‌మైయిర్, రియాన్ పరాగ్, ఆకాశ్ వశిష్ట, జేసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్
రాజస్థాన్ మొదట బ్యాటింగ్ చేస్తే హార్డ్ హిట్టింగ్ లెఫ్ట్‌హ్యాండర్ ఆకాశ్ వశిష్టను తుది జట్టులోకి తీసుకోవచ్చు. పైగా అతడు ఎడమచేతి వాటం స్పిన్నర్. ఎలాగూ జేసన్ హోల్డర్ ఉంటాడు కాబట్టి మంచి బ్యాటింగ్ డెప్త్ దొరుకుతుంది. ఇన్నింగ్స్ ముగిశాయి. యశస్వీ జైశ్వాల్ లేదా దేవదత్ పడిక్కల్‌లో ఒకరిని బయటకు పంపించి ఫాస్ట్ బౌలర్లు కుల్‌దీప్ సేన్, నవదీప్ సైని, సందీప్ శర్మలో ఎవరో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకుంటారు.
తొలుత బ్యాటింగ్ చేస్తే తుది జట్టు అంచనా: జోస్ బట్లర్, యశస్వీ జైశ్వాల్, సంజూ శాంసన్, షిమ్రన్ హెట్‌మైయిర్, రియాన్ పరాగ్, ఆకాశ్ వశిష్ట, జేసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, నవదీప్ సైని/ కుల్‌దీప్ సేన్ / సందీప్ శర్మ