IPL 2023, SRH vs RCB: వర్చువల్ నాకౌట్లో టాస్ గెలిచిన బెంగళూరు!
IPL 2023, SRH vs RCB: సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ వెంటనే బౌలింగ్ ఎంచుకున్నాడు.
IPL 2023, SRH vs RCB:
ఇండియన్ ప్రీమియర్ లీగు 2023లో నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి. ఉప్పల్ స్టేడియంలో టాస్ వేశారు. టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ వెంటనే బౌలింగ్ ఎంచుకున్నాడు. జట్టులో మార్పులేమీ చేయలేదన్నాడు.
'మేం మొదట బౌలింగ్ చేస్తాం. చివరి రెండు మ్యాచుల్లో మంచు కురిసింది. ఉప్పల్ వికెట్ బాగుంది. నెమ్మదిగా ఉండొచ్చు. సేమ్ టీమ్‌తో బరిలోకి దిగుతున్నాం. హసరంగ గాయపడ్డాడు. బ్రాస్‌వెల్ రాకతో బ్యాటింగ్ బలం పెరిగింది. మళ్లీ కొత్తగా మొదలు పెట్టాలి. క్రికెట్ చాలా ఫన్నీ గేమ్. విచిత్రాలు జరుగుతూనే ఉంటాయి' అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ అన్నాడు.
'మేం ఎలాగైనా బ్యాటింగే చేయాలనుకున్నాం. అందుకే టాస్ ఓడిపోయినందుకు బాధేం లేదు. కొన్ని మార్పులు చేశాం. బ్రూక్ వస్తున్నాడు. త్యాగీని తీసుకున్నాం. ఉమ్రాన్ మా ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్. సన్‌రైజర్స్‌కు ఆడుతున్నందుకు గర్వంగా ఉంది. ఏదేమైనా సామర్థ్యం మేరకు ఆడలేదు. చివరి రెండు మ్యాచుల్లోనైనా మా పవరేంటో ప్రపంచానికి చూపించాలని అనుకుంటున్నాం' అని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ అయిడెన్ మార్‌క్రమ్ అన్నాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, డుప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రర్, అనుజ్ రావత్, షాబాజ్ అహ్మద్, మైకేల్ బ్రాస్‌వెల్, వేన్ పర్నెల్, హర్షల్ పటేల్, కరన్ శర్మ, మహ్మద్ సిరాజ్
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, అయిడెన్ మార్‌క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, హ్యారీ బ్రూక్, గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, కార్తీక్ త్యాగీ, మయాంక్ డాగర్, భువనేశ్వర్ కుమార్, నితీశ్ రాణా
ఐపీఎల్ 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) అనుకున్నదొక్కటి! అయినది మరొకటి! టీ20 క్రికెట్‌కు నప్పే ఆటగాళ్లను కొనుగోలు చేసినా ఫలితం దక్కలేదు. కోట్టు పెట్టి కొనుకున్న క్రికెటర్లు అస్సలు రాణించలేదు. హెన్రిచ్ క్లాసెన్ ఒక్కడే టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. అదీ 170 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేస్తున్నాడు. మిగిలిన ఆటగాళ్లు ఒక్కరంటే ఒక్కరూ అంచనాలను అందుకోలేదు. ఇప్పటికీ ఓపెనింగ్ పెయిర్ కుదర్లేదు. అభిషేక్, మయాంక్ రాణించడం లేదు. రాహుల్ త్రిపాఠి పదేపదే విఫలమవుతున్నాడు. నిలకడ కోల్పోయాడు. కెప్టెన్ అయిడెన్ మార్‌క్రమ్ ఎప్పుడు ఆడతాడో తెలియదు. 8 పాయింట్లతో ఉన్న సన్‌రైజర్స్ గెలిచినా.. ఓడినా పెద్దగా ఫరక్ పడదు! భువనేశ్వర్, మయాంక్ మర్కండే బంతితో ఫామ్‌లో ఉండటం కాస్త పాజిటివ్ అంశం. నటరాజన్, ఫారూఖీ, ఎన్‌సన్ బౌలింగ్‌లో పస చూపించడం లేదు. సొంత గ్రౌండ్లో ఆర్సీబీపై మంచి రికార్డు ఉండటం ఒక్కటే గుడ్‌న్యూస్!
రాజస్థాన్ రాయల్స్‌పై అద్భుతమైన విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మళ్లీ ప్లేఆఫ్ రేసులోకి వచ్చింది. వరుసగా రెండు మ్యాచులు గెలిస్తే 16 పాయింట్లతో నాకౌట్‌కు వెళ్లొచ్చు. అయితే హైదరాబాద్ చేతిలో ఓడితే ఇక అంతే సంగతులు! మిగతా వాళ్లపై ఆధారపడాల్సి ఉంటుంది. కెప్టెన్ డుప్లెసిస్ సూపర్ డూపర్ ఫామ్‌లో ఉన్నాడు. విరాట్ కోహ్లీ అతడికి అండగా ఉంటున్నాడు. మ్యాడ్ మాక్సీ భీకరమైన షాట్లు ఆడుతున్నాడు. అమేజింగ్ బ్యాటింగ్ స్కిల్స్ ప్రదర్శిస్తున్నాడు. మహిపాల్ లోమ్రర్, దినేశ్ కార్తీక్, బ్రాస్‌వెల్, అనుజ్ రావత్ మరింత రాణించాలి. కేజీఎఫ్ త్రయం ఔటైతే ఆర్సీబీ పని ముగిసినట్టే! ఈ సీజన్లో బౌలింగ్ మాత్రం అదుర్స్! చివరి మ్యాచులో హసరంగ, హేజిల్‌వుడ్ లేకున్నా రాజస్థాన్‌ను 70 లోపే ఔట్ చేశారు. వేన్ పర్నెల్ చుక్కలు చూపించాడు. మహ్మద్ సిరాజ్ ప్రతి మ్యాచులో తనదైన ముద్ర వేస్తున్నాడు. ఉప్పల్ స్టేడియం అతడికి కొట్టిన పిండి! స్పిన్నర్ కరణ్ శర్మకూ ఇక్కడ అనుభవం ఉంది. ఉప్పల్‌లో ఆర్సీబీపై 6-1 తేడాతో సన్‌రైజర్స్‌దే పైచేయి! లక్కు కలిసి రాకుంటే ఆర్సీబీని సన్‌రైజర్స్ మడత పెట్టేస్తారు!
🚨 Toss Update 🚨@RCBTweets win the toss and elect to field first against @SunRisers.
— IndianPremierLeague (@IPL) May 18, 2023
Follow the match ▶️ https://t.co/xdReDEWVDX #TATAIPL | #SRHvRCB pic.twitter.com/lDFOIM4hfM