SRH vs MI, IPL 2023: సన్‌రైజర్స్‌కు ముంబయి డేంజర్! ఉప్పల్‌లో మూడో గెలుపు ముద్దాడేనా!
SRH vs MI, IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగు 2023లో మంగళవారం 25వ మ్యాచ్ జరుగుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబయి ఇండియన్స్ తలపడుతున్నాయి.
SRH vs MI, IPL 2023:
ఇండియన్ ప్రీమియర్ లీగు 2023లో మంగళవారం 25వ మ్యాచ్ జరుగుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబయి ఇండియన్స్ తలపడుతున్నాయి. ఈ ఫైట్‌కు ఉప్పల్ మైదానం ఆతిథ్యం ఇస్తోంది. చెరో 4 పాయింట్లతో సమంగా ఉన్న వీరిలో మూడో గెలుపు దక్కేది ఎవరికో!
కమాన్.. ఆరెంజ్ ఆర్మీ!
ఈ సీజన్లో తొలి రెండు మ్యాచుల్లో ఇబ్బంది పడ్డ సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) తర్వాత ఫామ్‌లోకి వచ్చింది. రెండు విజయాలు సాధించింది. విన్నింగ్ కాంబినేషన్ సెట్టైనట్టే కనిపిస్తోంది. డిస్ట్రక్టివ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ను (Harry Brook) ఓపెనింగ్‌కు పంపించడం వరంగా మారింది. అతడు సెంచరీ కొట్టి ప్రకంపనలు సృష్టించాడు. మయాంక్ అతడికి అండగా ఉంటాడు. రాహుల్ త్రిపాఠి, అయిడెన్ మార్‌క్రమ్, అభిషేక్ శర్మతో మిడిలార్డర్ పటిష్ఠంగా మారింది. ఈ త్రయంలో ఒక్కరు నిలిచినా రన్స్ ఫెస్ట్ తప్పదు! హెన్రిచ్ క్లాసెన్‌ను మర్చిపోవద్దు. వాషింగ్టన్ సుందర్‌ను మరింత మెరుగ్గా ఉపయోగించుకోవాలి. మార్కో జన్‌సెన్, భువీ లోయర్ ఆర్డర్లో కీలకం అవుతారు. బౌలింగ్ పరంగా ఆరెంజ్ ఆర్మీకి ఫర్వాలేదు. భువీ, ఉమ్రాన్, మార్కో, నట్టూ పేస్‌తో విజృంభిస్తున్నారు. మర్కండే, అభిషేక్, మార్‌క్రమ్, సుందర్ స్పిన్ చూసుకుంటారు.
ముంబయిని ఆపలేం!
చివరి రెండు మ్యాచుల్లో వరుస విజయాలతో ముంబయి ఇండియన్స్ డేంజర్ (Mumbai Indians) బెల్స్ మోగిస్తోంది. ఎందుకంటే జస్ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్ లేకుండానే గెలవడం సింపుల్ కాదు! ఎట్టకేలకు కూర్పు కుదిరింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (Rohit Sharma), ఇషాన్ కిషన్ (Ishan Kishan) పవర్ ప్లే విరుచుకుపడితే అడ్డుకొనేవాళ్లే ఉండరు. వీరిద్దరిలో ఎవరో ఒకరు అటాకింగ్ మోడ్‌లోనే ఉండాలి. వరుస డకౌట్ల నుంచి సూర్యకుమార్ తేరుకున్నట్టే ఉంది. కేకేఆర్ మ్యాచులో డిస్ట్రిక్టివ్‌గా ఆడాడు. హైదరాబాదీ తిలక్ వర్మ (Tilak Varma) ఆ జట్టుకు అత్యంత కీలకంగా మారాడు. కామెరాన్ గ్రీన్, టిమ్ డేవిడ్ నిలిస్తే బంతులు స్టాండ్స్‌లో పడతాయి. అర్జున్ తెందూల్కర్‌ను కొనసాగించొచ్చు. హృతిక్ షోకీన్, పియూష్ చావ్లా తమ స్పిన్‌తో అపోజిషన్ టీమ్‌ను ఇబ్బంది పెడుతున్నారు. రిలే మెరిడీత్, డువాన్ జన్‌సెన్, అర్జున్, అర్షద్, టిమ్ డేవిడ్ పేస్ ఫర్వాలేదు. ముంబయి అస్సలు డిఫెన్సివ్ అప్రోచ్‌కు వెళ్లొద్దు. అటాకింగ్ చేసినంత వరకు వారికి ఎదురుండదు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, అభిషేక్ శర్మ, అయిడెన్ మార్ క్రమ్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్, కార్తీక్ త్యాగి, ఫజల్‌హాక్ ఫరూఖీ, అన్మోల్‌ప్రీత్ సింగ్, అఖిల్ కుమార్ రెడ్డి, నితీష్ కుమార్ రెడ్డి, మయాంక్ దాగర్, ఉపేంద్ర యాదవ్, సంవీర్ సింగ్, సమర్థ్ వ్యాస్, విక్రాంత్ శర్మ, మయాంక్ మార్కండే, ఆదిల్ రషీద్, హెన్రిచ్ క్లాసెన్, మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్.
ముంబై ఇండియన్స్ జట్టు: కామెరాన్ గ్రీన్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, జస్ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్, డెవల్డ్ బ్రేవో, టిమ్ డేవిడ్, ట్రిస్టన్ స్టబ్స్, తిలక్ వర్మ, జే రిచర్డ్సన్, సూర్యకుమార్ యాదవ్, జేసన్ బెహ్రెండార్ఫ్, పీయూష్ చావ్లా, అర్జున్ టెండూల్కర్, షామ్స్ ములానీ, నేహాల్ వధేరా, కుమార్ కార్తికేయ, హృతిక్ షౌకీన్, ఆకాష్ మాధవల్, అర్షద్ ఖాన్, రాఘవ్ గోయెల్, డువాన్ జాన్సెన్, విష్ణు వినోద్.