SRH vs DC, IPL 2023: ఉప్పల్‌లో టాస్ ఓడితే.. మ్యాచ్ గెలిచినట్టే! రికార్డ్స్ చూడండి!!
SRH vs DC, IPL 2023: ఐపీఎల్ 2023లో మరికాసేపట్లో సన్‌రైజర్స్ హైదరాబాద్, దిల్లీ క్యాపిటల్స్ (SRH vs DC) ఢీకొంటున్నాయి. మరి వీరిలో ఎవరిపై ఎవరిది పైచేయి! రీసెంట్ ఫామ్ ఎలా ఉంది? పిచ్ రిపోర్టు ఏంటి?
SRH vs DC, IPl 2023:
ఐపీఎల్ 2023లో మరికాసేపట్లో సన్‌రైజర్స్ హైదరాబాద్, దిల్లీ క్యాపిటల్స్ (SRH vs DC) ఢీకొంటున్నాయి. పాయింట్ల పట్టికలో ఆఖర్లో ఉన్న రెండు జట్లూ తమ అదృష్టాన్ని మార్చుకోవాలని పట్టుదలగా ఉన్నాయి. మరి వీరిలో ఎవరిపై ఎవరిది పైచేయి! రీసెంట్ ఫామ్ ఎలా ఉంది? పిచ్ రిపోర్టు ఏంటి?
నువ్వా నేనా!
ఇండియన్ ప్రీమియర్ లీగులో సన్‌రైజర్స్ హైదరాబాద్, దిల్లీ క్యాపిటల్స్ మధ్య పోరు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది! అయితే డీసీపై ఆరెంజ్ ఆర్మీదే కాస్త అప్పర్ హ్యాండ్! లీగ్ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 21 సార్లు తలపడ్డాయి. సన్‌రైజర్స్ 11 సార్లు గెలవగా దిల్లీ 9 విజయాలు సాధించింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. రీసెంట్ ఫామ్ చూసుకుంటే దిల్లీ క్యాపిటల్స్ జోష్‌లో ఉంది. చివరి ఐదు మ్యాచుల్లో నాలుగు గెలిచింది. 2020లో హైదరాబాద్ 88 రన్స్ తేడాతో దుమ్మురేపింది. ఆ తర్వాత నాలుగింట్లోనూ డీసీ అదరగొట్టింది. ఒక మ్యాచులో సూపర్ ఓవర్లో గెలిచింది.
టాస్ ఓడితే.. గెలుపే!
ఉప్పల్ పిచ్ చివరి మూడు మ్యాచుల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్లకే అనుకూలించింది. రెండు విజయాలు అందించింది. సూర్యాస్తమయం కావడంతో పిచ్‌పై నెర్రలు పెద్దవయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు స్పిన్నర్లు ఎఫెక్టివ్‌గా ఉంటారు. సెకండ్ బ్యాటింగ్ చేసేటప్పుడు కొంత డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది. ఇక ఉప్పల్‌లో ఇప్పటి వరకు 67 టీ20లు జరగ్గా ఛేదన జట్లే 38 గెలిచాయి. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్స్ 29 విజయాలు అందుకున్నాయి. టాస్ గెలిచిన వాళ్లతో పోలిస్తే ఓడిన వాళ్లకే విజయాల శాతం ఎక్కువ. 67.16 శాతం మ్యాచులు గెలిచారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, అభిషేక్ శర్మ, అయిడెన్ మార్ క్రమ్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్, కార్తీక్ త్యాగి, ఫజల్‌హాక్ ఫరూఖీ, అన్మోల్‌ప్రీత్ సింగ్, అఖిల్ కుమార్ రెడ్డి, నితీష్ కుమార్ రెడ్డి, మయాంక్ దాగర్, ఉపేంద్ర యాదవ్, సంవీర్ సింగ్, సమర్థ్ వ్యాస్, విక్రాంత్ శర్మ, మయాంక్ మార్కండే, ఆదిల్ రషీద్, హెన్రిచ్ క్లాసెన్, మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, రిపుల్ పటేల్, రోవ్‌మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, యశ్ ధుల్, మిచెల్ మార్ష్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, ఎన్రిచ్ నోర్జే, చేతన్ సకారియా, కమలేష్ నాగర్‌కోటి, ఖలీల్ అహ్మద్, ఎంగిడి, ముస్తాఫిజుర్ రెహమాన్, అమన్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్, ఇషాంత్ శర్మ, ఫిల్ సాల్ట్, ముఖేష్ కుమార్.
Next station 🚍: Uppal 🏟️ pic.twitter.com/hW1y8fu6Tq
— SunRisers Hyderabad (@SunRisers) April 24, 2023
Lead us, Captain 🫡 pic.twitter.com/CJPccaHIxf
— SunRisers Hyderabad (@SunRisers) April 24, 2023