By: Rama Krishna Paladi | Updated at : 19 Apr 2023 09:28 PM (IST)
కేఎల్ రాహుల్ ( Image Source : Twitter, IPL )
RR vs LSG, IPL 2023:
సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ డిఫెండబుల్ స్కోరే చేసింది. ఆతిథ్య రాజస్థాన్ రాయల్స్‌కు 155 రన్స్ టార్గెట్ ఇచ్చింది. టూ పేస్ పిచ్‌పై షాట్లు ఆడేందుకు లక్నో బ్యాటర్లు కష్టపడ్డారు. ఓపెనర్ కైల్ మేయర్స్ (51; 42 బంతుల్లో 4x4, 3x6) ఈ సీజన్లో మూడో హాఫ్ సెంచరీ కొట్టాడు. కేఎల్ రాహుల్ (39; 32 బంతుల్లో 4x4, 1x6) సెకండ్ ఫిడెల్ ప్లే చేశాడు. ఆఖర్లో నికోలస్ పూరన్ (29; 20 బంతుల్లో 2x4, 1x6) మెరుపు షాట్లు బాదేశాడు. రాయల్స్‌లో రవిచంద్రన్ అశ్విన్ 2 వికెట్లు తీశాడు.
Ravichandran Ashwin kept things tight with the ball in #RR's disciplined bowling performance and he becomes our Top Performer from the first innings of the #RRvLSG clash in the #TATAIPL.
— IndianPremierLeague (@IPL) April 19, 2023
A look at his bowling summary 👇👇 pic.twitter.com/tzcZDCnYfa
మేయర్స్, రాహుల్ ఓపెనింగ్
రెండు వైపులా పదునైన పిచ్.. మధ్య మధ్యలో నెర్రలు.. బౌలర్లకు అనుకూలిస్తున్న వికెట్.. దాంతో లక్నో సూపర్ జెయింట్స్ మొదట నిలకడగా ఆడింది. ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ బౌలింగ్ ఆడేందుకు ఇబ్బంది పడింది. పవర్ ప్లే ముగిసే సరికి కేఎల్ రాహుల్, కైల్ మేయర్స్ 37 పరుగులే చేశారు. అయితే 7-9 ఓవర్ల మధ్య ఓపెనర్లు ఇద్దరూ చెలరేగారు. యుజ్వేంద్ర చాహల్‌ను టార్గెట్ చేసి సిక్సర్లు, బౌండరీ బాదారు. 9 ఓవర్లకు 74 స్కోరుతో స్ట్రాటజిక్ టైమౌట్ తీసుకున్నారు. తొలి వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యం అందించిన ఈ జోడీని 10.4వ బంతికి రాహుల్‌ను ఔట్ చేయడం ద్వారా హోల్డర్ విడదీశాడు. మరో 3 పరుగులకే ఆయుష్ బదోనీ (1)ని ట్రెంట్ బౌల్ట్ ఔట్ చేశాడు. 99 వద్ద భారీ షాట్ ఆడబోయి దీపక్ హుడా (2) పెవిలియన్ చేరాడు.
Innings Break!
— IndianPremierLeague (@IPL) April 19, 2023
Disciplined bowling by the @rajasthanroyals restrict #LSG to a total of 154/7 on the board.#RR chase coming up shortly.
Scorecard - https://t.co/gyzqiryPIq #TATAIPL #RRvLSG #IPL2023 pic.twitter.com/rdwfhIlhmd
స్టాయినిస్, పూరన్ దంచుడు
ఒకవైపు వికెట్లు పడుతున్నా కైల్ మేయర్స్ నిలిచాడు. 40 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్నాడు. దాంతో 13.3 ఓవర్లకు లక్నో 100 పరుగుల మైలురాయికి చేరుకుంది. 14-17 ఓవర్ల మధ్య లక్నోను రాజస్థాన్ బౌలర్లు నిలువరించారు. జట్టు స్కోరు 104 వద్ద మైయర్స్‌ను అశ్విన్ బౌల్డ్ చేశాడు. క్యారమ్ బాల్‌ను మేయర్స్ అంచనా వేయలేకపోయాడు. ఈ సిచ్యువేషన్లో మార్కస్ స్టాయినిస్, నికోలస్ పూరన్ కలిసి ఐదో వికెట్‌కు 34 బంతుల్లో 45 రన్స్ పాట్నర్‌షిప్ అందించారు. జట్టు స్కోరును 150 దాటించారు. హోల్డర్ వేసిన 19వ ఓవర్లో పూరన్ రెండు బౌండరీలు, ఒక సిక్సర్ బాది 17 రన్స్ రాబట్టాడు. ఆఖరి ఓవర్లో స్టాయినిస్, పూరన్, యుధ్‌వీర్ ఔటవ్వడంతో లక్నో 154/7 వద్ద ఆగిపోయింది.
రాజస్థాన్ రాయల్స్: యశస్వీ జైశ్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్, రియాన్ పరాగ్, షిమ్రన్ హెట్‌మైయిర్, ధ్రువ్ జోరెల్, రవిచంద్రన్ అశ్విన్, జేసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్, కైల్ మేయర్స్, దీపక్ హుడా, కృనాల్ పాండ్య, నికోలస్ పూరన్, మార్కస్ స్టాయినిస్, ఆయుష్ బదోనీ, నవీన్ ఉల్ హఖ్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, యుధ్‌వీర్ చరక్
ICYMI - You miss I hit!
— IndianPremierLeague (@IPL) April 19, 2023
Trent Boult cleans up the stumps of Ayush Badoni as #LSG lose their second wicket.
Live - https://t.co/vqw8WrjNEb#TATAIPL | #RRvLSG pic.twitter.com/ArZh7HlSCQ
Piyush Chawla: నా కొడుకు కోసమే తిరిగొచ్చా - ఏబీపీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో పీయూష్ చావ్లా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Ruturaj Gaikwad Wedding: ఇంటివాడైన రుతురాజ్- ఉత్కర్ష పవార్‌తో జట్టుకట్టిన సీఎస్కే ఓపెనర్
Viral Video: ఆ ట్రోఫీని వదిలేసి ముందు నన్ను హగ్ చేసుకో - వైరల్ అవుతున్న సాక్షి-ధోని వీడియో
MS Dhoni Knee Surgery: ధోనికి విజయవంతంగా శస్త్రచికిత్స - రిటైర్మెంట్‌పై నిర్ణయం అప్పుడే!
WTC 2023 Final: ఐపీఎల్ ముగిసింది - ఐసీసీ వేట మొదలైంది - డబ్ల్యూటీసీ ఫైనల్ వేదిక, బ్రాడ్‌కాస్ట్, జట్ల వివరాలివే
అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్
Janasena News : జనసేనలోకి ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు - చీరాలపై గురి పెట్టారా ?
చాలా సింపుల్‌గా నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్ దంపతుల కుమార్తె వివాహం
నాంపల్లి పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు- చేప ప్రసాదం కోసం వచ్చే వారికి ప్రత్యేక పార్కింగ్ స్థలాలు