RCB vs LSG, IPL 2023: టర్నింగ్ బాల్‌తో ఆర్సీబీకి భయం! వీక్‌నెస్ దాటితేనే LSGపై విజయం!
RCB vs LSG, IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగులో సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. మరి నేడు గెలిచేదెవరో!!
RCB vs LSG, IPL 2023:
ఇండియన్ ప్రీమియర్ లీగులో సోమవారం 15వ మ్యాచ్ జరుగుతోంది. చిన్నస్వామి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. రాహుల్ సేన విన్నింగ్ మూమెంటమ్ కంటిన్యూ చేయాలని పట్టుదలగా ఉంది. మిస్టేక్స్ తగ్గించుకొని నిలకడగా రాణించాలని ఆర్సీబీ భావిస్తోంది. మరి నేడు గెలిచేదెవరో!!
వస్తున్నాడు రాహుల్!
లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergiants) ఈ సీజన్లో మంచి మూమెంటమ్ కనబరుస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో మెరుస్తోంది. మూడేళ్ల తర్వాత లోకల్ బాయ్ కేఎల్ రాహుల్ హోమ్ గ్రౌండ్ చిన్నస్వామిలో అడుగు పెడుతున్నాడు. సెన్సిబుల్ ఇన్నింగ్సు ఆడుతున్న అతడి నుంచీ ఈ సారి ఫైర్‌వర్క్స్ ఆశించొచ్చు. క్వింటన్ డికాక్ (Quinton Dekock) రాకతో తలనొప్పి మొదలైంది. అతడిని తుది జట్టులోకి తీసుకుంటే మార్కస్ స్టాయినిస్‌కు చోటు కష్టమే. భీకరమైన ఫామ్‌లో ఉన్న కైల్ మేయర్స్ (Kyle Mayars) వదులుకోలేరు. కృనాల్ ఫామ్‌లోకి వచ్చాడు. దీపక్ హుడా ఫామ్‌లోకి రావాలి. బౌలింగ్ పరంగా ఇబ్బందులేం లేవు. ఫ్లూ నుంచి కోలుకుంటే మార్క్‌వుడ్ ఆడతాడు. గాయం నుంచి అవేశ్ కోలుకున్నాడో లేదో తెలీదు. అమిత్ మిశ్రా, రవి బిష్ణోయ్, కృష్ణప్ప గౌతమ్ స్పిన్ బౌలింగ్ కీలకం కానుంది.
ఏదైనా జరగొచ్చు!
తొలి మ్యాచులో 8 వికెట్ల తేడాతో ముంబయి ఇండియన్స్‌ను ఓడించిన ఆర్సీబీ (Royal Challengers Bangalore) వీక్‌నెస్‌లు కేకేఆర్‌పై బయటపడ్డాయి. ఈడెన్‌లో నరైన్, చక్రవర్తి స్పిన్ దెబ్బకు ఆ జట్టు బ్యాటర్లు విలవిల్లాడారు. విరాట్ కోహ్లీ (Virat Kohli) సూపర్ ఫామ్‌లో ఉన్నా స్పిన్నర్ల బౌలింగ్‌లో ఔటవుతున్నాడు. డుప్లెసిస్‌దీ అదే ఇబ్బంది. మాక్సీ ఫామ్‌లో లేడు. టాప్-3ని త్వరగా పెవిలియన్ పంపిస్తే మిడిలార్డర్ కుప్పకూలడం ఖాయం. నిలబడితే మాత్రం భారీ స్కోర్లు వస్తాయి. పవర్ ప్లేలో మంచి బౌలింగ్ చేస్తున్న ఆర్సీబీ ఆ తర్వాత గాడి తప్పుతున్నారు. ఈడెన్‌లో తొలుత అద్భుతంగా వేసి... శార్దూల్ ఠాకూర్‌తో దెబ్బతిన్నారు. 89/5తో ఉన్న కేకేఆర్‌ను 204/7కు తీసుకొచ్చారు. ఇప్పటికే హేజిల్‌వుడ్ లేడు. వనిందు హసరంగ నేడు ఆడితే బౌలర్లపై పనిభారం తగ్గుతుంది. అతడు మిడిల్‌లో వికెట్లు తీస్తే ఆఖర్లో పేసర్లు కాస్త ఒత్తిడి తేగలరు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సుయాష్ ప్రభుదేశాయ్, రజత్ పటీదార్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, ఫిన్ అలెన్, గ్లెన్ మాక్స్‌వెల్, వనిందు హసరంగా, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, డేవిడ్ విల్లీ, మహి పాల్ లోమ్రార్, కర్ణ్ శర్మ, మహమ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్, సిద్ధార్థ్ కౌల్, ఆకాష్ దీప్, సోను యాదవ్, అవినాష్ సింగ్, రాజన్ కుమార్, మనోజ్ భాండాగే, విల్ జాక్వెస్, హిమాన్షు శర్మ, రీస్ టాప్లీ.
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు: కేఎల్ రాహుల్, నికోలస్ పూరన్, మార్కస్ స్టోయినిస్, అవేశ్ ఖాన్, కృనాల్ పాండ్యా, మార్క్ వుడ్, క్వింటన్ డి కాక్, దీపక్ హుడా, రవి బిష్ణోయ్, కృష్ణప్ప గౌతమ్, డేనియల్ సామ్స్, అమిత్ మిశ్రా, కైల్ మేయర్స్, జయదేవ్ ఉనద్కత్, రొమారియో షెపర్డ్, నవీన్-ఉల్-హక్, యష్ ఠాకూర్, మొహ్సిన్ ఖాన్, ఆయుష్ బడోని, యుధ్వీర్ సింగ్ చరక్, కరణ్ శర్మ, మయాంక్ యాదవ్.