IPL 2023, PBKS vs RR: సంజూ, గబ్బర్ డిష్యూం డిష్యూం! ఎంఐ, ఆర్సీబీ ఓడితేనే వీళ్లకు ఛాన్స్!
IPL 2023, PBKS vs RR: ఐపీఎల్ 2023లో నేడు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ (PBKS vs RR) తలపడుతున్నాయి. ఎవరు గెలిచినా.. మెరుగైన రన్‌రేట్ ఉంటే మిగతా సమీకరణాల బట్టి ప్లేఆఫ్ రేసులో ఉండొచ్చు.

IPL 2023, PBKS vs RR:
ఐపీఎల్ 2023లో నేడు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ (PBKS vs RR) తలపడుతున్నాయి. ధర్మశాల ఇందుకు వేదిక. ఈ సీజన్లో వీరికి ఇదే చివరి లీగ్ మ్యాచ్! ఎవరు గెలిచినా.. మెరుగైన రన్‌రేట్ ఉంటే మిగతా సమీకరణాల బట్టి ప్లేఆఫ్ రేసులో ఉండొచ్చు. మరి గబ్బర్, సంజూ ఏం చేస్తారో చూడాలి!
ప్చ్.. రాజస్థాన్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ తాజా సీజన్లో రాజస్థాన్ రాయల్స్‌ను (Rajasthan Royals) చూస్తే జాలేస్తోంది! ఆరంభంలో అమేజింగ్ విక్టరీస్‌తో దూసుకెళ్లిన సంజూ సేన.. సెకండాఫ్‌లో అట్టర్ ఫ్లాఫ్ అయింది! గెలిచే మ్యాచుల్ని చేజేతులా వదిలేసింది. నిర్ణయాలు, వ్యూహాల్లో లోపాలు ఇబ్బంది పెట్టాయి. ఆటగాళ్లంతా ఫిట్‌నెస్‌తో ఉన్నా సరిగ్గా ఉపయోగించుకోకపోవడం చేటు చేసింది. యశస్వీ జైశ్వాల్ ఓపెనింగ్‌లో అదరగొడుతున్నాడు. జోస్ బట్లర్ నుంచి మెరుపుల్లేవ్. సంజూ శాంసన్ కీలక ఇన్నింగ్సులు ఆడుతున్నాడు. దేవదత్ పడిక్కల్, హెట్‌మైయిర్, ధ్రువ్ జోరెల్ నిలబడటం లేదు. జేసన్ హోల్డర్ బ్యాటింగ్ స్కిల్స్‌ను అస్సలు వాడుకోలేదు. లెక్క తప్పి ఆర్సీబీ చేతిలో ఘోరంగా ఓడిపోయారు! బౌలింగ్ డిపార్ట్‌మెంట్ ఫర్వాలేదు. ట్రెంట్‌బౌల్ట్ అందుబాటులో ఉన్నాడు. సందీప్ శర్మ, ఒబెడ్ మెకాయ్ అతడికి అండగా ఉంటారు. యూజీ, యాష్ స్పిన్ గురించి తెలిసిందే. ఈ మ్యాచులో భారీ తేడాతో గెలిస్తే ముంబయి, ఆర్సీబీ తర్వాతి మ్యాచుల్లో ఓడితే.. రాయల్స్‌కు ప్లేఆఫ్ ఛాన్స్ ఉంటుంది.
గబ్బర్.. గాబరా!
పంజాబ్ కింగ్స్ (Punjab Kings) కథ ఎప్పట్లాగే ముగిసింది! కొన్ని మ్యాచుల్లో మెరుపులు మినహాయిస్తే ఓటముల పరంపర ఆగలేదు. చివరి మ్యాచులో గెలిచే అవకాశాన్ని గబ్బర్ సేన చేజేతులా వదిలేసింది. సీమ్‌ను అనుకూలించే పిచ్‌పై స్పిన్నర్లతో అటాక్ చేయడం కొంప ముంచింది! ప్రభుసిమ్రన్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. గబ్బర్ నుంచి మెరుపులేం రావడం లేదు. లియామ్ లివింగ్‌స్టోన్ మాత్రం రెచ్చిపోతున్నాడు. పేసర్ల బౌలింగ్‌లో 200 స్ట్రైక్‌రేట్‌తో అటాక్ చేస్తున్నాడు. స్పిన్నర్లు రాగానే చతికిల పడుతున్నాడు. జితేశ్ శర్మ తనదైన ఫినిషింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. షారుక్ ఖాన్‌ను ప్రతిసారీ ప్రెజర్లోనే పంపిస్తున్నారు. అతడేం చేయలేకపోతున్నాడు. షాట్లు ఆడేందుకు ఇబ్బంది పడుతున్నా అథర్వను కంటిన్యూ చేస్తున్నారు. హర్‌ప్రీత్ బౌలింగ్‌లో తేలిపోయాడు. అర్షదీప్‌లో కసి కనిపించడం లేదు. ఎలిస్ ఫర్వాలేదు. సామ్ కరన్ స్కిల్స్ ఏమయ్యాయో తెలియడం లేదు. రజా, రబాడా జస్ట్ ఓకే!
Also Read: ఉప్పల్‌లో కోహ్లీ ఉప్పెన - హైదరాబాద్‌లో టీ20 అంటే విరాట్‌కు పూనకాలే!
పంజాబ్ కింగ్స్ జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), షారుఖ్ ఖాన్, జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, భానుక రాజపక్సే, జితేష్ శర్మ, రాజ్ బావా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ తైడే, అర్ష్‌దీప్ సింగ్, బల్తేజ్ సింగ్, నాథన్ ఎల్లిస్, కగిసో రబడ రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్, సామ్ కరణ్, సికందర్ రజా, హర్‌ప్రీత్ భాటియా, విద్వాత్ కేవరప్ప, మోహిత్ రాఠి, శివమ్ సింగ్.
రాజస్థాన్ రాయల్స్ జట్టు: సంజూ శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, యశస్వి జైస్వాల్, షిమ్రాన్ హెట్ మయర్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, రవి అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ, ఒబెద్ మెక్‌కాయ్, కుల్దీప్ సేన్, కుల్దీప్ యాదవ్, నవదీప్ సైనీ, కేసీ కరియప్ప, జో రూట్, అబ్దుల్ పా, ఆకాష్ వశిష్ట్, మురుగన్ అశ్విన్, కెఎమ్ ఆసిఫ్, ఆడమ్ జంపా, కునాల్ రాథోడ్, డోనోవన్ ఫెరీరా.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

