By: ABP Desam | Updated at : 17 May 2023 11:31 AM (IST)
పంజాబ్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్ ( Image Source : Twitter, PBKS )
PBKS vs DC, IPL 2023:
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో నేడు పంజాబ్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్ (PBKS vs DC) తలపడుతున్నాయి. ధర్మశాల ఇందుకు వేదిక. డేవిడ్ భాయ్ జట్టేమో పరువు కోసం పాకులాడుతోంది. గబ్బర్ సేన ప్లేఆఫ్ చేరుకొనేందుకు పట్టుదలగా ఉంది. మరి ఇందులో గెలిచేదెవరు?
రెండు గెలిస్తేనే!
అదృష్టమో.. దురదృష్టమో.. కొన్నేళ్లుగా పంజాబ్ కింగ్స్‌కు (Punjab Kings) అచ్చిరావడం లేదు. 2013లో చివరిసారిగా ప్లేఆఫ్ చేరుకుంది. అప్పట్నుంచి కష్టపడుతూనే ఉంది. ఈ సీజన్లో గబ్బర్ నాయకత్వంలో కాస్త ఆశలు రేపుతోంది. ఇప్పటికే 12 మ్యాచుల్లో 6 విజయాలతో 12 పాయింట్లు సాధించింది. మరో 4 పాయింట్లు వస్తే నాకౌట్ దశకు చేరుకోవచ్చు. ఇందుకోసం మొదట దిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించాలి. టార్గెట్ మిస్సైందా! ఇక ఎలిమినేట్ అవ్వాల్సిందే! పంజాబ్‌లో విదేశీయులతో పోలిస్తే దేశవాళీ క్రికెటర్లు రాణిస్తున్నారు. ప్రభుసిమ్రన్ మొన్నే సెంచరీ కొట్టాడు. జితేశ్ శర్మ వికెట్‌కీపింగ్, మ్యాచ్ ఫినిషింగ్ టాలెంట్ అద్భుతం! వీరిద్దరినీ ఎంకరేజ్ చేయడం ముఖ్యం. లియామ్ లివింగ్‌స్టోన్‌కు దిల్లీ బౌలర్లపై మంచి రికార్డు లేదు. బౌలింగ్ పరంగా కింగ్స్ ఫర్వాలేదు. అయితే మూమెంట్స్‌ను ఒడిసిపట్టడం ముఖ్యం. అర్షదీప్, ఎలిస్, చాహర్, రిషి మంచి బౌలింగ్ చేయాలి.
పరువు కోసమే!
ఐపీఎల్ 2023లో అందరి కన్నా ముందుగా ఎలిమినేట్ అయిన టీమ్ దిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)! ఎన్నో ఆశలతో అడుగుపెట్టినా.. ఆటగాళ్ల గాయాలు, ఫామ్ లేమి వీరిని ఇబ్బంది పెట్టింది. ఆరంభంలోనే తడబడటంతో మూమెంటమ్ అందుకోలేకపోయింది. అందుకే చివరి రెండు మ్యాచుల్లో గెలిచి పరువు నిలుపుకోవాలని పట్టుదలతో ఉంది. మంచి బ్యాటర్లు ఉన్నప్పటికీ ఎందుకో జట్టు కూర్పు కుదర్లేదు. అయితే పంజాబ్ కింగ్స్ అందరి బౌలింగ్‌లోనూ డేవిడ్ వార్నర్‌కు సూపర్ రికార్డు ఉంది. ఒక్కసారీ ఔటవ్వలేదు. ఫిల్‌సాల్ట్ నెమ్మదించాడు. మిచెల్ మార్ష్, రిలీ రొసో తమ స్థాయికి తగ్గట్టు ఆడలేదు. మనీశ్ పాండే మరో సీజన్లోనూ నిరాశపరిచాడు. అక్షర్ పటేల్ ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆకట్టుకుంటున్నాడు. ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ, ముకేశ్, కుల్‌దీప్ బౌలింగ్ ఫర్వాలేదు. ఈ మ్యాచులో దిల్లీ గెలిచిందంటే పంజాబ్ ప్లేఆఫ్ రేసు నుంచి ఎలిమినేట్ అవుతుంది.
Also Read: ఆఖరి ఓవర్ థ్రిల్లర్! ప్లేఆఫ్ రేసులో ముంబయిని వెనక్కి నెట్టేసిన లక్నో!
దిల్లీ క్యాపిటల్స్ జట్టు: రిషబ్ పంత్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, రిపుల్ పటేల్, రోవ్‌మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, యశ్ ధుల్, మిచెల్ మార్ష్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, ఎన్రిచ్ నోర్జే, చేతన్ సకారియా, కమలేష్ నాగర్‌కోటి, ఖలీల్ అహ్మద్, ఎంగిడి, ముస్తాఫిజుర్ రెహమాన్, అమన్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్, ఇషాంత్ శర్మ, ఫిల్ సాల్ట్, ముఖేష్ కుమార్
పంజాబ్ కింగ్స్ జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), షారుఖ్ ఖాన్, జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, భానుక రాజపక్సే, జితేష్ శర్మ, రాజ్ బావా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ తైడే, అర్ష్‌దీప్ సింగ్, బల్తేజ్ సింగ్, నాథన్ ఎల్లిస్, కగిసో రబడ రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్, సామ్ కరణ్, సికందర్ రజా, హర్‌ప్రీత్ భాటియా, విద్వాత్ కేవరప్ప, మోహిత్ రాఠి, శివమ్ సింగ్.
IPL 2023 Winner: ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం - వైరల్ అయిన గూగుల్ సీఈఓ ట్వీట్
MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?
Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?
CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!
CSK Vs GT: చితక్కొట్టిన సాహా, సాయి సుదర్శన్ - చెన్నై ముందు భారీ టార్గెట్!
Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారం
BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?
మెగాస్టార్ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ
Wrestlers Protest: పతకాలను గంగానదిలో పారేసి, ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తామంటున్న రెజ్లర్లు!