LSG vs SRH: కొత్త కెప్టెన్ వచ్చిండు.. టాసు గెలిచిండు! SRH ఏం ఎంచుకుందంటే!
LSG vs SRH: ఐపీఎల్ పదో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ అయిడెన్ మార్‌క్రమ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
![LSG vs SRH: కొత్త కెప్టెన్ వచ్చిండు.. టాసు గెలిచిండు! SRH ఏం ఎంచుకుందంటే! IPl 2023 LSG vs SRH sunrisers hyderabad won the toss choose to bat first against Lucknow supergiants LSG vs SRH: కొత్త కెప్టెన్ వచ్చిండు.. టాసు గెలిచిండు! SRH ఏం ఎంచుకుందంటే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/07/daba39ffec720fdc054a8519814d1e111680874666565251_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
LSG vs SRH, IPL 2023:
ఇండియన్ ప్రీమియర్ లీగులో పదో మ్యాచ్ జరుగుతోంది. ఏకనా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ అయిడెన్ మార్‌క్రమ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
'మేం మొదట బ్యాటింగ్ చేయాలని అనుకుంటున్నాం. వికెట్ కాస్త డ్రై అనిపిస్తోంది. మేం తొలి విజయం కోసం పట్టుదలగా ఉన్నాం. కుర్రాళ్లు ఆత్రుతగా ఉన్నారు. రెండు మార్పులు చేశాం. అందులో ఒకటి నేనే. అన్మోల్ ప్రీత్ వస్తున్నాడు' అని మార్‌క్రమ్ అన్నాడు.
'ఇప్పుడే ఏం చెప్పలేం. చివరి మ్యాచులో బాగానే బ్యాటింగ్ చేశాం. ఈ రోజు పరిస్థితులకు తగ్గట్టు ఆడతాం. మేం మొదటి సారి ఏకనా స్టేడియంలో ఆడుతుండటంతో కొన్ని ప్రాణాళికలతో వస్తున్నాం. ఈ మ్యాచ్‌లో వుడ్ ఆడటం లేదు. అవేశ్ ఖాన్ గాయపడటంతో విశ్రాంతి తీసుకుంటున్నాడు. దూకుడుగా ఆడి వికెట్లు తీస్తాం' అని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు.
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్, కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టాయినిస్, నికోలస్ పూరన్, రొమారియో షెఫర్డ్, కృనాల్ పాండ్య, అమిత్ మిశ్రా, యశ్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, రవి బిష్ణోయ్
సన్‌రైజర్స్ హైదరాబాద్: మయాంక్ అగర్వాల్, అన్మోల్ ప్రీత్ సింగ్, రాహుల్ త్రిపాఠి, అయిడెన్ మార్‌క్రమ్, మ్యారీ బ్రూక్, వాషింగ్టన్ సుందర్, అబ్దుల్ సమద్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఆదిల్ రషీద్
జోష్‌లో లక్నో!
చివరి సీజన్‌తో పోలిస్తే లక్నో సూపర్ జెయింట్స్ మరింత పటిష్ఠంగా కనిపిస్తోంది. కైల్ మేయర్స్ రాకతో టాప్ ఆర్డర్ దూకుడుగా మారింది. అతడు క్రీజులో నిలబడితే ప్రత్యర్థి బౌలర్లు ప్రెజర్ ఫీలవుతున్నారు. కేఎల్ రాహుల్ తన స్థాయి బ్యాటింగ్ చేయాల్సి ఉంది. సఫారీ ఆటగాడు క్వింటన్ డికాక్ రావడం గుడ్ సైన్! అయితే ఇప్పుడు ఆడుతున్న నలుగురు ఫారినర్స్‌లో ఎవరిని తీసేయాలన్నదే సమస్య! బహుశా స్టాయినిస్, మేయర్స్‌లో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎంచుకోవచ్చు. దీపక్ హుడా, కృనాల్ పాండ్య జోరు పెంచాలి. ఆయుష్ బదోనీ, పూరన్ ఇంటెట్ బాగుంది. బౌలింగ్ అదుర్సే! అయితే త్వరగా పిచ్‌లను అర్థం చేసుకొని లెంగ్తులు దొరకబట్టాలి. అవేశ్, స్టాయినిస్, మేయర్స్, మార్క్‌వుడ్ పేస్ చూస్తారు. కొత్త కుర్రాడు యశ్ ఠాకూర్ రాణించగలడు. ఉనద్కత్‌తోనే సమస్య. కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్ స్పిన్ కీలకం.
కెప్టెన్ రాకతో బలం!
సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ బాగున్నా ఎందుకో బ్యాలెన్స్ కుదర్లేదు. తొలి మ్యాచులో రాజస్థాన్ ఇచ్చిన పెద్ద టార్గెట్ ఛేజింగ్‌లో ఒత్తిడికి గురయ్యారు. బౌలింగ్ అప్ టు ద మార్క్ లేదు. కెప్టెన్ అయిడెన మార్‌క్రమ్ రావడం కొండంత బలం. అతడు ఇన్నింగ్స్‌ను అభిషేక్, మయాంక్ మెరుపు ఓపెనింగ్స్ ఇవ్వగలరు. మిడిలార్డర్లో రాహుల్ త్రిపాఠి, హ్యారీ బ్రూక్, హెన్రిచ్ క్లాసెన్, ఫిలిప్స్, సుందర్ బ్యాటింగ్ కీలకం. కెప్టెన్ రాకతో మిడిలార్డర్ పటిష్ఠం అవుతుంది. భువీ వికెట్లు తీయాలి. ఉమ్రాన్ మాలిక్, నటరాజన్ బౌలింగ్ బాగుంది. కార్తీక్ త్యాగీకి అవకాశాలిస్తే బాగుంటుంది. ఫజల్ హక్ ఫారూఖీ బదులు జన్‌సెన్ రంగంలోకి దిగుతాడు. కూర్పు కుదిరితే టీమ్ బెటర్ అవుతుంది.
#SRH have won the toss and elect to bat first against #LSG at Lucknow.
— IndianPremierLeague (@IPL) April 7, 2023
Live - https://t.co/07o0jVbgvA #TATAIPL #LSGvSRH #IPL2023 pic.twitter.com/qIVKQ8uO7J
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)