LSG vs GT Preview: కొత్త టీమ్స్.. కొత్త రైవల్రీ - టైటాన్స్‌పై ప్రతీకారానికి లక్నో రెడీ!
LSG vs GT Preview: ఇండియన్ ప్రీమియర్ లీగు 2023లో మరో బ్యూటిఫుల్ కాంటెస్ట్‌కు వేళైంది. శనివారం మధ్యాహ్నం లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ జెయింట్స్ (LSG vs GT) తలపడుతున్నాయి.
LSG vs GT Preview:
ఇండియన్ ప్రీమియర్ లీగు 2023లో మరో బ్యూటిఫుల్ కాంటెస్ట్‌కు వేళైంది. శనివారం మధ్యాహ్నం లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ జెయింట్స్ (LSG vs GT) తలపడుతున్నాయి. ఏకనా మైదానం ఇందుకు వేదిక. గతేడాది వరుస పరాజయాలకు రాహుల్ సేన ప్రతీకారం తీర్చుకుంటుందా? టేబుల్ టాపర్‌గా నిలిచేనా?
కేఎల్‌కు ఇన్‌స్వింగర్స్ భయం
గతేడాది అరంగేట్రం చేసిన లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) ఈ సీజన్లో ఫుల్ జోష్‌లో ఉంది. థ్రిల్లింగ్ విక్టరీస్ సాధిస్తోంది. అయితే లాస్ట్ సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ చేతిలో చావుదెబ్బ తిన్నది. అందుకే ఈసారి కచ్చితంగా గెలవాలని పట్టుదలగా ఉంది. ప్రతిసారీ కష్టమైన పిచ్ మీద ఆడుతుండటంతో లక్నో పవర్‌ప్లే స్కోర్లు తక్కువగా ఉంటున్నాయి. కైల్ మేయర్స్ ఫర్లేదు కానీ కేఎల్ రాహుల్ (KL Rahul) మాత్రం మెరుపు ఓపెనింగ్స్ బాకీ ఉన్నాడు. మహ్మద్ షమీ వేసే ఇన్‌స్వింగర్లకు అతడి వద్ద జవాబు ఉందో లేదో చూడాలి. రషీద్ పైనా బెటర్ రికార్డేమీ లేదు. దీపక్ హుడా, ఆయుష్ బదోనీ పెద్ద ఇన్నింగ్స్ ఆడాలి. నికోలస్ పూరన్, స్టాయినిస్ 100 శాతం న్యాయం చేస్తున్నారు. బౌలింగ్ పరంగా లక్నోకు తిరుగులేదు. పేస్, స్పిన్ ఆప్షన్లు బాగానే ఉన్నాయి. నవీన్ ఉల్ హఖ్, యుధ్‌వీర్ రాణిస్తున్నారు. సీనియర్లు అవేశ్, మార్క్‌వుడ్, స్టాయినిస్, మేయర్స్ ఫాస్ట్ బౌలింగ్‌తో అదరగొడుతున్నారు. రవి బిష్ణోయ్, గౌతమ్, కృనాల్ స్పిన్ ఓకే. ఛేజింగ్ వీక్‌నెస్ వదిలేస్తే లక్నోకు ఎదురుండదు.
టెక్నికల్‌గా జీటీ పైచేయి!
చివరి సీజన్లో ఆడిన రెండింట్లోనూ లక్నోను ఓడించడం గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) కాన్ఫిడెన్స్‌ను పెంచేదే! ఈ సీజన్లోనూ వారు అమేజింగ్ విక్టరీస్ సాధిస్తున్నారు. శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) నిలకడగా రాణిస్తున్నాడు. వృద్ధిమాన్ ఫర్వాలేదు. సాయి సుదర్శన్ వన్‌డౌన్‌లో సెటిలయ్యాడు. మిడిలార్డర్లో హార్దిక్ పాండ్య (Hardik Pandya), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా ఉన్నారు. అయితే ఆపదలో ఆదుకుంటున్నారు కానీ వీరిలో నిలకడ లేదు. మిల్లర్‌తో డేంజర్ తప్పదు. రషీద్ ఖాన్ ఆఖర్లో ఫినిషర్ రోల్ కూడా పోషిస్తున్నాడు. టైటాన్స్ బౌలింగ్ మాత్రం అదుర్స్! కొత్త బంతితో ఓపెనింగ్ స్పెల్‌లో మహ్మద్ షమీ అత్యంత డేంజరస్‌గా ఉన్నాడు. అల్జారీ జోసెఫ్ అతడికి తోడున్నాడు. బౌన్సీ పిచ్‌లపై హార్దిక్ పాండ్య దుమ్మురేపుతున్నాడు. ఇప్పుడు మోహిత్ శర్మ జత కలిశాడు. రషీద్ , సాయి కిషోర్ స్పిన్‌కు తిరుగులేదు.
గుజరాత్ టైటాన్స్ జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుభమన్ గిల్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, విజయ్ శంకర్, మహమ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, ప్రదీప్ సాంగ్వాన్, దర్శన్ నల్కండే, జయంత్ యాదవ్, ఆర్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, కేన్ విలియమ్సన్, ఒడియన్ స్మిత్, కెఎస్ భరత్, శివమ్ మావి, ఉర్విల్ పటేల్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ.
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు: కేఎల్ రాహుల్, నికోలస్ పూరన్, మార్కస్ స్టోయినిస్, అవేశ్ ఖాన్, కృనాల్ పాండ్యా, మార్క్ వుడ్, క్వింటన్ డి కాక్, దీపక్ హుడా, రవి బిష్ణోయ్, కృష్ణప్ప గౌతమ్, డేనియల్ సామ్స్, అమిత్ మిశ్రా, కైల్ మేయర్స్, జయదేవ్ ఉనద్కత్, రొమారియో షెపర్డ్, నవీన్-ఉల్-హక్, యష్ ఠాకూర్, మొహ్సిన్ ఖాన్, ఆయుష్ బడోని, యుధ్వీర్ సింగ్ చరక్, కరణ్ శర్మ, మయాంక్ యాదవ్.