News
News
వీడియోలు ఆటలు
X

IPL 2023, GT vs MI: హిట్‌మ్యాన్‌దే క్వాలిఫయర్‌-2 టాస్‌! మళ్లీ ఛేజింగే!

IPL 2023, GT vs MI: ఐపీఎల్‌ 2023 క్వాలిఫయర్‌ -2 టాస్‌ వేశారు. మొతేరా వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌, ముంబయి ఇండియన్స్‌ తలపడుతున్నాయి.

FOLLOW US: 
Share:

IPL 2023, GT vs MI: 

ఐపీఎల్‌ 2023 క్వాలిఫయర్‌ -2 టాస్‌ వేశారు. మొతేరా వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌, ముంబయి ఇండియన్స్‌ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన రోహిత్‌ శర్మ వెంటనే ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. వర్షం కురవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించాడు.

'మేం ఛేజ్‌ చేస్తాం. పిచ్‌ బాగుంది. వికెట్‌ను మెరుగ్గా ఉపయోగించుకుంటాం. మ్యాచ్‌ సాగే కొద్దీ పిచ్‌ మరింత మెరుగు అవుతుంది. మా ఇష్ట ప్రకారమే నడుచుకుంటున్నాం. ఈ సీజన్లో మేం టార్గెట్లను బాగా ఛేదించాం. సరికొత్త జట్టును నిర్మించుకున్నాం. కొత్తవాళ్లు వచ్చారు. ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాం. శక్తి మేరకు ఆడాల్సిన మ్యాచ్‌ ఇది. టోర్నీ ఆరంభంలో కాస్త ఆందోళన చెందాం. కానీ ఇప్పుడు స్థిరత్వం వచ్చింది. హృతిక్‌ షోకీన్‌ ప్లేస్‌లో కుమార్‌ కార్తికేయను తీసుకున్నాం' అని ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు.

'టాస్‌ గెలిస్తే మేమూ బౌలింగే తీసుకొనేవాళ్లం. నాకౌట్స్‌, క్వాలిఫయర్స్‌ ఫన్నీగా ఉంటాయి. అత్యుత్తమ ఆటతీరును బయటపెట్టాల్సి ఉంటుంది. అలాగే మ్యాచ్‌ను ఆస్వాదించాలి. శక్తిమేరకు ఆడితే ఎలాంటి ఫలితం వచ్చినా సంతోషమే. అభిమానులు మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నారు. గుజరాత్‌ ప్రజలు నమ్మకంగా ఉంటారు. రెండు మార్పులు చేశాం. శనక, నల్కండే స్థానాల్లో జోష్‌ లిటిల్‌, సాయి సుదర్శన్‌ వచ్చారు' అని గుజరాత్‌ టైటాన్స్‌ సారథి హార్దిక్‌ పాండ్య అన్నాడు.

ముంబయి ఇండియన్స్‌: ఇషాన్‌ కిషన్‌, రోహిత్‌ శర్మ, కామెరాన్‌ గ్రీన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, టిమ్‌ డేవిడ్‌, క్రిస్‌ జోర్డాన్‌, పియూష్ చావ్లా, జేసన్‌ బెరెన్‌ డార్ఫ్, కుమార్‌ కార్తికేయ, ఆకాశ్ మధ్వాల్‌

గుజరాత్‌ టైటాన్స్‌: వృద్ధిమాన్‌ సాహా, శుభ్‌మన్‌ గిల్‌, సాయి సుదర్శన, విజయ్ శంకర్, హార్దిక్‌ పాండ్య, డేవిడ్‌ మిల్లర్‌, రాహుల్‌ తెవాతియా, మోహిత్‌ శర్మ, నూర్‌ అహ్మద్‌, మహ్మద్‌ షమి

Published at : 26 May 2023 07:50 PM (IST) Tags: Rohit Sharma Hardik Pandya Gujarat Titans IPL 2023 Mumbai Indian GT vs MI Qualifier 2

సంబంధిత కథనాలు

Ruturaj Gaikwad Wedding: ఇంటివాడైన రుతురాజ్- ఉత్కర్ష పవార్‌తో జట్టుకట్టిన సీఎస్కే ఓపెనర్

Ruturaj Gaikwad Wedding: ఇంటివాడైన రుతురాజ్- ఉత్కర్ష పవార్‌తో జట్టుకట్టిన సీఎస్కే ఓపెనర్

Viral Video: ఆ ట్రోఫీని వదిలేసి ముందు నన్ను హగ్ చేసుకో - వైరల్ అవుతున్న సాక్షి-ధోని వీడియో

Viral Video: ఆ ట్రోఫీని వదిలేసి ముందు నన్ను హగ్ చేసుకో - వైరల్ అవుతున్న సాక్షి-ధోని వీడియో

MS Dhoni Knee Surgery: ధోనికి విజయవంతంగా శస్త్రచికిత్స - రిటైర్మెంట్‌పై నిర్ణయం అప్పుడే!

MS Dhoni Knee Surgery: ధోనికి విజయవంతంగా శస్త్రచికిత్స - రిటైర్మెంట్‌పై నిర్ణయం అప్పుడే!

WTC 2023 Final: ఐపీఎల్ ముగిసింది - ఐసీసీ వేట మొదలైంది - డబ్ల్యూటీసీ ఫైనల్‌ వేదిక, బ్రాడ్‌కాస్ట్, జట్ల వివరాలివే

WTC 2023 Final: ఐపీఎల్ ముగిసింది - ఐసీసీ వేట మొదలైంది - డబ్ల్యూటీసీ ఫైనల్‌ వేదిక, బ్రాడ్‌కాస్ట్, జట్ల వివరాలివే

Annamalai on Jadeja: సీఎస్‌కే విజయం వెనుక బీజేపీ హస్తం - తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు

Annamalai on Jadeja: సీఎస్‌కే విజయం వెనుక బీజేపీ హస్తం - తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

YS Viveka Case : అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి - సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

YS Viveka Case :  అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి -   సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

Weather Latest Update: నేడు ఏపీలో ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు, తెలంగాణలో వేడి కాస్త తక్కువే - ఐఎండీ

Weather Latest Update: నేడు ఏపీలో ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు, తెలంగాణలో వేడి కాస్త తక్కువే - ఐఎండీ

Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!

Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!