By: ABP Desam | Updated at : 06 May 2023 05:36 PM (IST)
నేహాల్ వధేరా ( Image Source : IPL )
CSK vs MI, IPL 2023:
ముంబయి ఇండియన్స్ మళ్లీ స్ట్రగుల్ అయింది! చెపాక్‌లో వికెట్లను టపటపా పారేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్‌కు తక్కువ టార్గెట్టే ఇచ్చింది. 20 ఓవర్లు ఆడి 8 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. వికెట్ భిన్నంగా ఉండటంతో కష్టపడితే ఈ స్కోర్‌ను డిఫెండ్ చేసుకోవచ్చు! కుర్రాడు నేహాల్ వధేరా (64; 51 బంతుల్లో 8x4, 1x6) హిట్‌మ్యాన్ సేనను ఆదుకున్నాడు. అమేజింగ్ హాఫ్ సెంచరీ కొట్టాడు. సూర్యకుమార్ యాదవ్ (26; 22 బంతుల్లో 3x4), త్రిస్టన్ స్టబ్స్ (20; 21 బంతుల్లో 2x4) ఆ తర్వాత టాప్ స్కోరర్లు. జూనియర్ మలింగ.. మతీశ పతిరన (3/15) డెత్ ఓవర్లలో రన్స్ అడ్డుకున్నాడు.
Innings break!
— IndianPremierLeague (@IPL) May 6, 2023
An impressive bowling display by @ChennaiIPL restricts #MI to 139/8 in the first innings 👏🏻👏🏻
Can @mipaltan defend this target and continue their winning run 🤔
Scorecard ▶️ https://t.co/hpXamvn55U #TATAIPL | #CSKvMI pic.twitter.com/BtCs6kUktT
టాప్ ఆర్డర్ కొలాప్స్!
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయికి అచ్చిరాలేదు! పవర్‌ప్లే ముగిసే సరికే 34 పరుగులకు 3 కీలక వికెట్లు చేజార్చుకుంది. దేశ్ పాండే వేసిన 2 ఓవర్ ఆఖరి బంతికి ఓపెనర్ కామెరాన్ గ్రీన్ (6) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీపక్ చాహర్ వేసిన మూడో ఓవర్లో రెండు వికెట్లు పడ్డాయి. రెండో బంతికి ఇషాన్ కిషన్ (7) ఇచ్చిన క్యాచ్‌ను తీక్షణ అందుకున్నాడు. ఐదో బంతికి రోహిత్ శర్మ పెవిలియన్ చేరాడు. వరుసగా రెండో మ్యాచులో డకౌట్ అయ్యాడు. అప్పటికి స్కోరు 14. ఈ సిచ్యువేషన్లో నేహాల్ వధేరా, సూర్యకుమార్ యాదవ్ నిలిచారు. నిలకడగా ఇన్నింగ్స్ కొనసాగించారు. నాలుగో వికెట్‌కు 42 బంతుల్లో 54 రన్స్ పాట్నర్‌షిప్ అందించారు.
Matheesha Pathirana walked the talk with the ball and be becomes our 🔝 performer from the first innings of the #CSKvMI clash in the #TATAIPL 2023 👌🏻👌🏻
— IndianPremierLeague (@IPL) May 6, 2023
A look at his bowling summary 🎥🔽 pic.twitter.com/2rPIfirtFR
నిలబడ్డ సూర్య, వధేరా
తొమ్మిది ఓవర్లకు 59/3తో ముంబయి స్ట్రాటజిక్ టైమౌట్‌కు వెళ్లింది. ఆ తర్వాతా పరిస్థితి ఏమీ మారలేదు. జట్టు స్కోరు 69 వద్ద సూర్యకుమార్‌ను జడ్డూ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత ట్రిస్టన్ స్టబ్స్ అండతో వధేరా ఇన్నింగ్స్ నడిపించాడు. ఐదో వికెట్‌కు 42 బంతుల్లో 54 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 15.2 ఓవర్లకు జట్టు స్కోరును 100కు చేర్చారు. 46 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న వధేరా మరింత అగ్రెసిస్‌గా ఆడాడు. బౌండరీలు కొట్టాడు. స్కోరు పెంచే క్రమంలో జట్టు స్కోరు 123 వద్ద పతిరణ అతడిని క్లీన్‌బౌల్డ్ చేశాడు. టిమ్ డేవిడ్ (2), అర్షద్ (1) త్వరగానే ఔటయ్యారు. దాంతో ముంబయి 139/8కి చేరింది.
ముంబయి ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, కామెరాన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, త్రిస్టన్ స్టబ్స్, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, పియూష్ చావ్లా, జోఫ్రా ఆర్చర్, ఆకాశ్ మధ్వాల్, అర్షద్ ఖాన్
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వే, అజింక్య రహానె, మొయిన్ అలీ, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ, దీపక్ చాహర్, మతీశ పతిరన, తుషార్ దేశ్‌పాండే, మహీశ తీక్షణ
Matheesha Pathirana finishes with bowling figures of 3-15 🙌@ChennaiIPL fans, drop a 💛 if you enjoyed that spell 😉 #TATAIPL | #CSKvMI pic.twitter.com/Rkjyd425eE
— IndianPremierLeague (@IPL) May 6, 2023
CSK Vs GT: చితక్కొట్టిన సాహా, సాయి సుదర్శన్ - చెన్నై ముందు భారీ టార్గెట్!
Most Runs In IPL Final: ఐపీఎల్ ఫైనల్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్స్ వీరే - ధోని ఏ ప్లేస్‌లో ఉన్నాడంటే?
CSK Vs GT, Final: చెన్నై కప్‌ను వదిలేసిందా - ఎంత పని చేశావు చాహర్!
CSK Vs GT, Final: గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగే - ఇప్పుడు బౌలింగ్ ఎందుకు - ధోని మాస్టర్ ప్లాన్ ఏంటి?
CSK Vs GT: ఫైనల్లో టాస్ చెన్నైదే - ఛేజింగ్‌కే మొగ్గు చూపిన ధోని!
CPI Narayana : సీఎం జగన్‌కు పదవిలో ఉండే అర్హత లేదు - రాజీనామా చేయాలన్న సీపీఐ నారాయణ !
Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !
SSMB28 Mass Strike: 20 ఏళ్ల తర్వాత మళ్లీ కబడ్డీ ఆడుతున్న మహేష్!
Partner Swapping Case: భార్యల మార్పిడి కేసులో సంచలనం, విషం తాగిన నిందితుడు - మృతి