అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

IPL 2023: క్వాలిఫయర్ 1 బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న చెన్నై - గత సీజన్ నుంచి సూపర్ కమ్‌బ్యాక్!

చెన్నై సూపర్ కింగ్స్ రెండో స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయింది. వారి పెర్ఫార్మెన్స్ హైలెట్స్ ఇవే.

Chennai Super Kings In IPL 2023: మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2023 ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన రెండో జట్టుగా అవతరించింది. ఢిల్లీతో జరిగిన చివరి మ్యాచ్‌లో చెన్నై 77 పరుగుల తేడాతో గెలిచి ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. మహేంద్ర సింగ్ ధోని నుంచి ఓవరాల్ టీమ్ వరకు మొత్తం జట్టు ప్రదర్శన ఈ సీజన్‌లో ఎలా ఉందో చూద్దాం.

ఐపీఎల్ 2022 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. కానీ ఈసారి జట్టు అద్భుతమైన పునరాగమనం చేసి ప్లేఆఫ్‌లకు అర్హత సాధించింది. ఈ సీజన్‌లో చెన్నై మొత్తం 14 లీగ్ మ్యాచ్‌లు ఆడింది. 14 మ్యాచ్‌లలో జట్టు 8 గెలిచింది. 5 మ్యాచ్‌లు ఓడిపోయింది. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు. దీంతో ఆ జట్టు మొత్తం 17 పాయింట్లు సాధించి అర్హత సాధించింది. జట్టు నెట్ రన్‌రేట్ +0.652గా ఉంది.

ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడానికి ఇవే ప్రధాన కారణాలు
బ్యాటింగ్ - ఈ సీజన్ లో చెన్నై అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శించింది. టాప్ ఆర్డర్‌లో డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. డెవాన్ కాన్వే 14 లీగ్ మ్యాచ్‌ల్లో 585 పరుగులు చేశాడు. అదే సమయంలో రుతురాజ్ గైక్వాడ్ 504 పరుగులు సాధించాడు.

దీని తర్వాత మిడిలార్డర్‌లో అజింక్య రహానే, శివమ్ దూబే వంటి బ్యాట్స్‌మెన్ అద్భుతమైన టచ్‌లో కనిపించారు. ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు అద్భుతంగా రాణించారు. దీంతో పాటు లోయర్ ఆర్డర్‌లో రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ తమ వంతు పాత్రను చక్కగా పోషించారు. ధోని బ్యాట్ నుండి చాలా చిన్నదైన, ముఖ్యమైన ఇన్నింగ్స్‌లు కనిపించాయి.

బౌలింగ్- బ్యాటింగ్ మాదిరిగానే చెన్నై ఈ సీజన్‌లో బౌలింగ్‌లో గొప్ప ఫాంను కనబరిచింది. జట్టు వైపు నుంచి మతిషా పతిరనా, తుషార్ దేశ్‌పాండే వంటి యువ ఫాస్ట్ బౌలర్లు నిప్పులు చెరిగారు. పతిరనా డెత్ ఓవర్లలో చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. దీంతో పాటు రవీంద్ర జడేజా, మహిష్ తీక్షణ స్పిన్ విభాగంలో బాధ్యతలు చక్కగా నిర్వహించారు.

మహేంద్ర సింగ్ ధోనీ అద్భుతమైన కెప్టెన్సీ - గత సీజన్‌లో మహేంద్ర సింగ్ ధోనీ కొన్ని మ్యాచ్‌లకు మాత్రమే కెప్టెన్‌గా వ్యవహరించాడు. దాని భారాన్ని జట్టు భరించవలసి వచ్చింది. ఈసారి అన్ని మ్యాచ్‌లలో ధోనీ జట్టుకు నాయకత్వం వహించాడు. అద్భుతమైన కెప్టెన్సీకి పేరుగాంచిన ధోనీ, ఈ సీజన్‌లో మరోసారి ఈ విషయాన్ని చూపించాడు. అన్ని మ్యాచ్‌ల్లోనూ బౌలర్‌ నుంచి ఫీల్డర్‌ వరకు జట్టులోని ఆటగాళ్లందరినీ బాగా ఉపయోగించుకున్నాడు.

ఐపీఎల్‌ 2023 సీజన్ 67వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK) 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. దీంతో చెన్నై 77 పరుగులతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ టాప్ 2కి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లే. ఎందుకంటే ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న లక్నో రెండో స్థానానికి చేరాలంటే కోల్‌కతాను 97 పరుగులతో ఓడించాల్సి ఉంటుంది.

ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మెన్‌లో కేవలం డేవిడ్ వార్నర్ (86: 58 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లు) మాత్రమే రాణించాడు. ఇంకెవరూ అతనికి సహకారం అందించలేదు. ఇక చెన్నై విషయానికి వస్తే... చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లలో డెవాన్ కాన్వే (87: 52 బంతుల్లో, 11 ఫోర్లు, మూడు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (79: 50 బంతుల్లో, మూడు ఫోర్లు, ఏడు సిక్సర్లు) కూడా భారీ అర్థ సెంచరీ సాధించాడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Pushpa 2: పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఫ్లైట్ లేట్ అయితే ఎయిర్ లైన్ సంస్థ ఇవి ఇవ్వాల్సిందేపెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Pushpa 2: పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
IPL Auction 2025 Live Streaming: నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
PM Modi Comments: రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
AUS vs IND: ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
Embed widget