By: ABP Desam | Updated at : 26 Mar 2022 01:39 PM (IST)
Edited By: Ramakrishna Paladi
ఫస్ట్ విక్టరీని డిసైడ్ చేసే 6 క్రికెటర్లు వీరే! ఆ ఇద్దరు మాత్రం కేక! @csk, kkr twitter
IPL 2022 Top six players to watch out in csk vs kkr match: ఐపీఎల్ (IPL 2022) సరికొత్త సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ (Chennai Superkings), గతేడాది రన్నరప్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knightriders) తలపడుతున్నాయి. మరికొద్ది గంటల్లోనే మ్యాచ్ మొదలవుతోంది. ఇప్పటికే జట్లన్నీ మ్యాచు కోసం ప్రాక్టీస్ చేశాయి. ఐపీఎల్ (csk vs kkr) తొలి మ్యాచుకు సంబంధించి ఆరుగురు ఆటగాళ్లపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. వారు ఎలా ఆడతారోనని అభిమానులు ఉత్కంఠంతో ఎదురు చూస్తున్నారు. వాళ్లు ఎవరంటే?
రాక్‌స్టార్ Ravindra Jadeja
రవీంద్ర జడేజా (Jaddu) నిజమైన రాక్‌స్టార్‌గా మారిపోయాడు. చెన్నై సూపర్‌కింగ్స్‌కు (CSK) కెప్టెన్‌గా ఎంపికవ్వడమంటే మాటలు కాదు. కొత్త కెప్టెన్‌పై ఫ్యాన్స్ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 151 మ్యాచులాడిన అతడు 2386 పరుగులు చేశాడు. 127 వికెట్లు పడగొట్టాడు. గత సీజన్లో ఒక ఓవర్లో 37 పరుగులు దంచికొట్టాడు. మొత్తంగా 16 మ్యాచుల్లో 227 కొట్టాడు. ఈ సీజన్‌కు ముందు మంచి ఫామ్‌లో ఉన్నాడు.
MS Dhoniపై ఫ్యాన్స్ అంచనాలు
మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఈ సీజన్ నుంచి కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ ఆడటం లేదు కాబట్టి ఈ సీజన్లో రాణించాలని అభిమానులు ఆశపడుతున్నారు. ఇప్పటి వరకు 193 మ్యాచులాడిన అతడు 4746 పరుగులు చేశాడు. ఈ సీజన్లో 400 పరుగుల కొట్టి 5000 రన్స్ మైలురాయి దాటాలని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. కెప్టెన్సీ భారం లేదు కాబట్టి బాగా బ్యాటింగ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
రన్‌రాజా Ruturaj Gaikwad
చెన్నై యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌పై అందరికీ భారీ అంచనాలే ఉన్నాయి. గతేడాది 16 మ్యాచుల్లో 635 కొట్టాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. పెద్దగా అవకాశాలు రాలేదు గానీ దేశవాళీలో మాత్రం పరుగుల వరద పారించాడు. సీజన్‌కు ముందు గాయపడటం కాస్త కలవరపరిచే అంశం. అతడు చివరి సీజన్ ప్రదర్శనే మళ్లీ రిపీట్ చేయాలని సీఎస్‌కే ఆశ.
మెచ్యూర్డ్ Shreyas Iyer
ఇండియన్ క్రికెట్లో ఒక ప్రామిసింగ్ క్రికెటర్‌గా ఎదిగాడు శ్రేయస్ అయ్యర్ (Shreyas). ఇన్నాళ్లూ దిల్లీకి ఆడిన అతడు కేకేఆర్‌కు (KKR) కెప్టెన్‌గా వచ్చేశాడు. ఇన్నింగ్స్‌ను బట్టి రన్‌రేట్‌ను పరుగెత్తించే ఆటగాడు. సీజన్‌కు ముందు అంతర్జాతీయ క్రికెట్లో దుమ్మురేపాడు. టెస్టు సిరీసులో అలరించాడు. ఇప్పటి వరకు 87 ఐపీఎల్ మ్యాచుల్లో 2375 పరుగులు చేశాడు. కొత్త కెప్టెన్‌పై కేకేఆర్‌కు భారీ ఆశలే ఉన్నాయి.
మిస్టీరియస్ Varun Chakravarthy
ఆర్కిటెక్టర్‌గా ఉద్యోగ ప్రయాణం మొదలు పెట్టి టీఎన్‌పీఎల్‌లో మిస్టరీ స్పిన్నర్‌గా మారి ఐపీఎల్‌లో అదరగొడుతున్నాడు వరుణ్ చక్రవర్తి. తన మిస్టరీ స్పిన్‌తో మహామహులనే బోల్తా కొట్టిస్తున్నాడు. 31 ఐపీఎల్ మ్యాచుల్లో అతడు 6.82 ఎకానమీ, 20.50 స్ట్రైక్‌రేట్‌తో 36 వికెట్లు తీశాడు. అతడిని ఎదుర్కోవడం అంత సులభమైన విషయం కాదు.
థ్రిల్ చేసిన Venkatesh Iyer
గత సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫైనల్ చేరిందంటే ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ మెరుపులే కారణం! తన ఎడమచేతి వాటం బ్యాటింగ్‌తో కేకేఆర్ ఓపెనింగ్ అవసరాలు తీర్చేశాడు. తనలోని డిస్ట్రక్టివ్ బ్యాటింగ్‌ను ప్రపంచానికి పరిచయం చేశాడు. 10 మ్యాచుల్లోనే 370 పరుగులు చేశాడు. 4 హాఫ్ సెంచరీలూ ఉన్నాయి. బంతితోనూ మ్యాజిక్ చేశాడు. 8.3 ఓవర్లు విసిరి 3 వికెట్లు తీశాడు.
IPL 2022 Final Prize Money: ఐపీఎల్ ప్రైజ్‌మనీ వివరాలు ఇవే - ఆటగాళ్లపై కనకవర్షం - ఎవరికి ఎంత లభించనుందంటే?
IPL Final, RR vs GT Fantasy 11: ఐపీఎల్ ఫైనల్ ఫాంటసీ XIలో బెస్ట్ టీమ్ ఇదే!
IPL 2022, GT vs RR Final: బట్లర్ మరో సెంచరీకి అడ్డుగా టైటాన్స్ 'మాంత్రికుడు'! మిల్లర్‌కూ ఓ కిల్లర్ ఉన్నాడోచ్!
IPL 2022, GT vs RR Final: లక్షా పదివేల మంది ఎదుట ట్రోఫీ ఎత్తేది ఎవరు? RRపై 2-0తో GTదే పైచేయి!
IPL 2022, Jos Buttler: సెంచరీ ముందు జోస్ బట్లర్ ఫెయిల్యూర్! కాపాడిన సంగక్కర, సన్నిహితులు!
Southwest Monsoon : కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు, మరో వారంలో తెలుగు రాష్ట్రాలకు
Infinix Note 12 Flipkart Sale: ఇన్ఫీనిక్స్ నోట్ 12 సేల్ ప్రారంభం - అదిరిపోయే ఫీచర్లు - ఎలా ఉందో చూశారా?
The Conjuring House: ‘ది కంజూరింగ్’ హౌస్, ఆ దెయ్యాల కొంపను రూ.11 కోట్లకు అమ్మేశారు, చరిత్ర తెలిస్తే షాకవుతారు!
F3 Movie OTT Release: 'ఎఫ్3' ఓటీటీ రిలీజ్ అప్డేట్ - స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?