అన్వేషించండి

IPL 2022, RCB vs RR: డీకేను హడలెత్తిస్తున్న యూజీ! సంజుకూ 'రంగ రంగా'!

IPL 2022, RCB vs RR: ఐపీఎల్‌ 2022లో బెంగళూరు ఎప్పుడెలా ఆడుతుందో తెలియడం లేదు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచులో 68కే ఆలౌటైంది! ఇప్పుడు రాజస్థాన్‌ రాయల్స్‌ రూపంలో దానికి మరో గండం ఎదురవుతోంది.

IPL 2022 rcb vs rr yuzvendra chahal troubles dinesh karthik so as sanju samson vs wanindu hasarnga : ఐపీఎల్‌ 2022లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (Royal Challengers Bangalore) ఎప్పుడెలా ఆడుతుందో తెలియడం లేదు. ఈ సీజన్లో ఫస్ట్‌ హాఫ్‌లో కొన్ని మ్యాచుల్లో అదరగొట్టింది. మరికొన్ని మ్యాచుల్లో బెదిరిపోయింది. ముఖ్యంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచులో 68కే ఆలౌటై 'ఇదేందిది'! అనిపించింది. ఇప్పుడు రాజస్థాన్‌ రాయల్స్‌ రూపంలో దానికి మరో గండం ఎదురవుతోంది.

ఎడమచేతి వాటం పేసర్లు ఫామ్‌లో ఉంటే బెంగళూరు విలవిల్లాడుతోంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచులో ఇలాగే జరిగింది. మార్కో జన్‌సెన్‌ ధాటికి తట్టుకోలేక ఇబ్బంది పడింది. అందుకే ఈ మ్యాచులో ట్రెంట్‌ బౌల్ట్‌, ఒబెడ్‌ మెక్‌కాయ్‌ని సంజు శాంసన్‌ కచ్చితంగా వాడుకుంటాడు. అలాగే భీకరమైన ఫామ్‌లో ఉన్న దినేశ్‌ కార్తీక్‌కు యుజ్వేంద్ర చాహల్‌తో ముప్పు ఉంది. ఇక రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజు శాంసన్‌ను వనిందు హసరంగ ఆటాడుకుంటున్నాడు.

ఈ సీజన్లో దినేశ్‌ కార్తీక్‌ను (Dinesh Karthik) బెంగళూరు మ్యాచ్‌ ఫినిషర్‌గా ఉపయోగించుకుంటోంది. అందుకు తగ్గట్టే అతడు భీకరంగా హిట్టింగ్‌ చేస్తున్నాడు. సునాయసంగా మ్యాచులు గెలిపిస్తున్నాడు. పేసర్లనైతే ఉతికి ఆరేస్తున్నాడు. స్పిన్‌లోనూ ధాటిగానే ఆడుతున్నా రిస్ట్‌ స్పిన్నర్ల బౌలింగ్‌లో తడబడుతున్నాడు. అందుకే ఈ మ్యాచులో డీకేకు యూజీతో పోరు తీవ్రంగానే ఉండనుంది. ఈ లెగ్‌ స్పిన్నర్‌ బౌలింగ్‌లో డీకే కేవలం 83 స్ట్రైక్‌రేట్‌తోనే పరుగులు చేస్తున్నాడు. పైగా తొమ్మిది ఇన్నింగ్సుల్లో 3 సార్లు వికెట్‌ ఇచ్చేశాడు.

ఇక సంజు శాంసన్‌కు వనిందు హసరంగతో (Sanju Samson vs Wanindu Hasaranga) చిక్కు ఎదురవుతోంది. అతడు వేసే గూగ్లీలకు ఇబ్బంది పడుతున్నాడు. ఐదు ఇన్నింగ్సుల్లో 15 బంతులు ఎదుర్కొని 4 సార్లు ఔటయ్యాడు. ఈ గణాంకాలు చూస్తుంటేనే సంజూకు అతడంటే హడల్‌ అని అర్థమవుతోంది. ఈ సీజన్లో ఆడిన మొదటి మ్యాచులోనైతే చాలా సాఫ్ట్‌ డిస్మిసల్‌గా వెనుదిరిగాడు. ట్రెంట్‌ బౌల్ట్‌ బౌలింగ్‌లో ఇప్పటి వరకు కోహ్లీ ఔటవ్వలేదు. కానీ అతడున్న ఫామ్‌కి బౌల్ట్‌ ఇన్‌స్వింగర్లు, ఔట్‌ స్వింగర్లు ఎదుర్కోవడం కష్టమే.

RCBదే కాస్త పైచేయి!

ఈ సీజన్లో కొన్ని రోజుల ముందే 'రాయల్స్‌' పోరు జరిగింది. ఈ మ్యాచులో బెంగళూరు విజయం అందుకుంది. జోస్‌ బట్లర్‌ (70), పడిక్కల్‌ (37), హెట్‌మెయిర్‌ (42*) బ్యాటింగ్‌తో మొదట రాజస్థాన్‌ 169 పరుగులు చేసింది. 19.1 ఓవర్లలోనే డుప్లెసిస్‌ బృందం ఈ లక్ష్యాన్ని ఛేదించింది. ఇందుకు  ఒకే ఒక్క కారణం షాబాజ్‌ అహ్మద్‌ (45; 26 బంతుల్లో), దినేశ్‌ కార్తీక్‌ (44*; 23 బంతుల్లో) సూపర్‌ బ్యాటింగే. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 25 సార్లు తలపడగా 13-10తో బెంగళూరుదే పైచేయి.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lagacharla Land Issue : లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
Pawan Kalyan: సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
TG 10th Exams Pattern: తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
Andhra Pradesh Weather:మధ్యాహ్నం తీరం దాటనున్న ఫెంగల్‌- నెల్లూరు సహా ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్- ప్లాష్‌ ఫ్లడ్స్‌ వచ్చే ప్రమాదం
మధ్యాహ్నం తీరం దాటనున్న ఫెంగల్‌- నెల్లూరు సహా ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్- ప్లాష్‌ ఫ్లడ్స్‌ వచ్చే ప్రమాదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Lagacharla Land Acquisition Cancelled | లగచర్ల భూసేకరణ రద్దు వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే..! | ABP DesamPanama Ship Stops Deputy CM Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ను అడ్డుకున్న వెస్ట్ ఆఫ్రికా ఓడ | ABP DesamAllu Arjun Speech Pushpa 2 Mumbai | పుష్ప 2 ముంబై ఈవెంట్లో అల్లు అర్జున్ మాస్ స్పీచ్ | ABP DesamRashmika Mandanna Pushpa 2 Mumbai | ముంబై పుష్ప ఈవెంట్ లో మెరిసిపోయిన శ్రీవల్లి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lagacharla Land Issue : లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
Pawan Kalyan: సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
TG 10th Exams Pattern: తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
Andhra Pradesh Weather:మధ్యాహ్నం తీరం దాటనున్న ఫెంగల్‌- నెల్లూరు సహా ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్- ప్లాష్‌ ఫ్లడ్స్‌ వచ్చే ప్రమాదం
మధ్యాహ్నం తీరం దాటనున్న ఫెంగల్‌- నెల్లూరు సహా ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్- ప్లాష్‌ ఫ్లడ్స్‌ వచ్చే ప్రమాదం
Revanth Reddy on Allu Arjun: పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
SCR: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - తిరుపతికి వీక్లీ స్పెషల్ ట్రైన్స్, ఆ వందేభారత్‌కు అదనపు కోచ్‌లు
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - తిరుపతికి వీక్లీ స్పెషల్ ట్రైన్స్, ఆ వందేభారత్‌కు అదనపు కోచ్‌లు
Sabarimala Yatra History:  శబరిమల యాత్ర ఎప్పటి నుంచి ప్రారంభమైంది .. అయ్యప్ప స్వామి మొదటి ఆదాయం ఎంతో తెలుసా!
శబరిమల యాత్ర ఎప్పటి నుంచి ప్రారంభమైంది .. అయ్యప్ప స్వామి మొదటి ఆదాయం ఎంతో తెలుసా!
YS Jagan: జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
Embed widget