IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
RCB
RCB
IPL, 2022 | Final | Narendra Modi Stadium, Ahmedabad - 29 May, 08:00 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
TBC
TBC

Ravindra Jadeja Reaction: కెప్టెన్సీపై జడ్డూ ఫస్ట్‌ రియాక్షన్‌! ధోనీపై విధేయత ఎలా చూపించాడో మీరే చూడండి!!

Ravindra Jadeja Reaction: సీఎస్కే కెప్టెన్‌గా ఎంపికవ్వడంపై రవీంద్ర జడేజా (Ravindra Jadeja) స్పందించాడు. ఎంఎస్‌ ధోనీ (MS Dhoni) వారసత్వం ముందుకు తీసుకెళ్లడం కష్టంతో కూడుకున్న పనిగా వర్ణించాడు.

FOLLOW US: 

Ravindra Jadeja as CSK New Captain First reactions : చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్‌గా ఎంపికవ్వడంపై రవీంద్ర జడేజా (Ravindra Jadeja) స్పందించాడు. తనను నమ్మి ఇంతపెద్ద బాధ్యతలను అప్పగించినందుకు సంతోషంగా ఉందన్నాడు. అయితే తాను భర్తీ చేయాల్సింది ఎంఎస్‌ ధోనీ (MS Dhoni) పాత్రనని పేర్కొన్నాడు. అదంత సులభం కాదని వెల్లడించాడు. అతడి వారసత్వం ముందుకు తీసుకెళ్లడం కష్టంతో కూడుకున్న పనిగా వర్ణించాడు.

జడ్డూ స్పందించిన వీడియోను సీఎస్‌కే (CSK) తన ట్విటర్లో పెట్టింది. 'జడ్డూ ఫస్ట్‌ రియాక్షన్‌' అని కామెంట్‌ పెట్టింది. 'చాలా బాగుంది. అదే సమయంలో నేను భర్తీ చేసేదీ చిన్న బాధ్యతను కాదు. మహీ భాయ్‌ ఇప్పటికే గొప్ప వారసత్వాన్ని సృష్టించాడు. దానిని నేను కొనసాగించాల్సి ఉంది' అని జడ్డూ అన్నాడు. 'నేనేం పెద్దగా ఆందోళన చెందడం లేదు. ఎందుకంటే ధోనీ భాయ్‌ నా పక్కనే ఉంటాడు. నాకే అవసరం వచ్చినా అతడివద్దకు వెళ్తాను. అతనెప్పటికీ నాతోనే ఉంటాడు. అందుకే నాకు వర్రీ లేదు. మీ అందరి విషెస్‌, లవ్‌కు ధన్యవాదాలు. మమ్మల్ని ఇలాగే సపోర్ట్‌ చేయండి' అని జడ్డూ అన్నాడు.

ఐపీఎల్‌ 2022లో చెన్నై సూపర్‌కింగ్స్‌ను నడిపించడం జడ్డూకు అంత సులభమేం కాదు! ఎందుకంటే సీఎస్‌కే ఈసారి డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా అడుగు పెడుతోంది. పైగా జట్టులోకి చాలామంది కొత్తగా వచ్చారు. వారి ఆటతీరును అర్థం చేసుకోవాలి. కొందరు ఆటగాళ్లు గాయపడ్డారు. చాలా మ్యాచులకు అందుబాటులో ఉండటం లేదు. జట్టుకు సమతూకం తీసుకురావడం అవసరం. ఇక సీఎస్‌కే ఈ సీజన్‌ తొలి మ్యాచులో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మార్చి 26న తలపడనుంది.

సీఎస్‌కే కెప్టెన్సీ నుంచి ధోనీ తప్పుకోవడం అందరినీ షాక్‌ చేసింది. అతడు జడ్డూకు నాయకత్వ బాధ్యతలు అందించాడని యాజమాన్యం చెప్పింది. 'చెన్నై సూపర్‌కింగ్స్‌ నాయకత్వ బాధ్యతలను మరొకరికి అప్పగించాలని ఎంఎస్‌ ధోనీ నిర్ణయించాడు. జట్టును నడిపించేందుకు రవీంద్ర జడేజాను ఎంచుకున్నాడు. 2012 నుంచి జడ్డూ సీఎస్‌కేలో అంతర్భాగంగా ఉన్నాడు. ఈ జట్టును నడిపించే మూడో కెప్టెన్‌ అతడు. ధోనీ ఈ సీజన్లో, ఇకపైనా చెన్నై సూపర్‌కింగ్స్‌కే ప్రాతినిధ్యం వహిస్తాడు' అని సీఎస్‌కే ప్రకటించింది. మొత్తంగా నాలుగు సార్లు చెన్నైని ధోనీ ఛాంపియన్‌గా నిలబెట్టాడు.

Also Read: ధోనీ ది గ్రేట్‌! తలా.. నీ రికార్డులు తలదన్నేవారే లేరు!

Also Read: మళ్లీ షాకిచ్చిన ధోనీ! జడ్డూకు CSK కెప్టెన్సీ అప్పగించిన మిస్టర్‌ కూల్‌!

Published at : 24 Mar 2022 07:03 PM (IST) Tags: IPL CSK MS Dhoni Chennai super kings IPL 2022 Ravindra Jadeja CSK in IPL IPL 2022 Live CSK New Captain

సంబంధిత కథనాలు

Lucknow Super Giants: లక్నో ఎలిమినేషన్‌కి చెన్నై కారణమా... ఆ ఒక్క మ్యాచ్ ఫలితం మరోలా వచ్చి ఉంటే?

Lucknow Super Giants: లక్నో ఎలిమినేషన్‌కి చెన్నై కారణమా... ఆ ఒక్క మ్యాచ్ ఫలితం మరోలా వచ్చి ఉంటే?

Hardik Pandya: హార్దిక్‌ పాండ్యకు బిగ్‌ ప్రమోషన్‌! ఐర్లాండ్‌ టూర్‌లో టీమ్‌ఇండియాకు కెప్టెన్సీ!!

Hardik Pandya: హార్దిక్‌ పాండ్యకు బిగ్‌ ప్రమోషన్‌! ఐర్లాండ్‌ టూర్‌లో టీమ్‌ఇండియాకు కెప్టెన్సీ!!

Rajat Patidar: 'అన్‌సోల్డ్‌'గా మిగిలి 'అన్‌టోల్డ్‌ స్టోరీ'గా మారిన రజత్‌ పాటిదార్‌

Rajat Patidar: 'అన్‌సోల్డ్‌'గా మిగిలి 'అన్‌టోల్డ్‌ స్టోరీ'గా మారిన రజత్‌ పాటిదార్‌

LSG vs RCB, Eliminator: లక్నో నాకౌట్‌కు 5 కారణాలు - ఆ ఒక్కటే 90% ఓడించింది!

LSG vs RCB, Eliminator: లక్నో నాకౌట్‌కు 5 కారణాలు - ఆ ఒక్కటే 90% ఓడించింది!

LSG vs RCB, Eliminator Highlights: LSGని ఎలిమినేట్‌ చేసిన RCB - రాహుల్‌ సేనను ముంచిన క్యాచ్‌డ్రాప్‌లు!

LSG vs RCB, Eliminator Highlights: LSGని ఎలిమినేట్‌ చేసిన RCB - రాహుల్‌ సేనను ముంచిన క్యాచ్‌డ్రాప్‌లు!
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్‌లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!

Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్‌లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!

Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?

Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?

IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!

IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!

Yes Bank-DHFL Scam : ఎస్ బ్యాంక్-డీహెచ్ఎఫ్ఎల్ నిధుల మళ్లింపు కేసు, పుణెకు చెందిన బిల్డర్ అరెస్టు

Yes Bank-DHFL Scam : ఎస్ బ్యాంక్-డీహెచ్ఎఫ్ఎల్ నిధుల మళ్లింపు కేసు, పుణెకు చెందిన బిల్డర్ అరెస్టు