IPL 2022, PBKS vs GT Preview: గబ్బర్‌ ముందు సాగని షమి ఆటలు! కింగ్స్‌ vs టైటాన్స్‌ పోరులో పైచేయి ఎవరిది?

IPL 2022, PBKS vs GT Preview: ఐపీఎల్‌ 2022లో 16వ మ్యాచులో పంజాబ్‌ కింగ్స్‌ (Punjab Kings), గుజరాత్‌ టైటాన్స్‌ (Gujarat Titans) తలపడుతున్నాయి. మరి ఈ రెండు జట్లలో విజయం ఎవరిది?

FOLLOW US: 

IPL 2022, PBKS vs GT Preview: ఐపీఎల్‌ 2022లో 16వ మ్యాచులో పంజాబ్‌ కింగ్స్‌ (Punjab Kings), గుజరాత్‌ టైటాన్స్‌ (Gujarat Titans) తలపడుతున్నాయి. బ్రబౌర్న్‌  (Brabourne) వేదికగా ఈ మ్యాచ్‌ జరుగుతోంది. ఈ రెండు జట్లు తలో రెండు విజయాలు సాధించి జోరుమీదున్నాయి. మరి ఈ రెండు జట్లలో విజయం ఎవరిది? ఏ జట్టుపై ఎవరిది పైచేయి? ఏ ఆటగాడికి ఎవరితో ముప్పుంది?

* గుజరాత్‌ టైటాన్స్‌ ఇప్పటి వరకు 2 మ్యాచులాడి రెండూ గెలిచింది. అయితే రెండింట్లోనూ గెలుపుకోసం చాలా శ్రమించింది. మహ్మద్‌ షమి (Mohammed Shami), రషీద్‌ ఖాన్‌ (Rashid khan), లాకీ ఫెర్గూసన్‌ (Lockie Ferguson) వంటి బౌలర్లే గుజరాత్‌కు అత్యంత కీలకం. శుభ్‌మన్‌ గిల్‌ (Shubhman gill) రాణించడం శుభసూచకం.

* పంజాబ్‌ కింగ్స్‌ హిట్టర్లు, మంచి బౌలర్లతో ఉంది. లియామ్‌ లివింగ్‌ స్టన్‌ (Liam Livingstone), షారుఖ్‌ ఖాన్‌, ఒడీన్‌ స్మిత్‌, భానుక రాజపక్స దంచికొడుతున్నారు. అర్షదీప్‌, రబాడా, రాహుల్‌ చాహర్‌, హర్‌ప్రీత్‌ బ్రార్‌ రాణిస్తున్నారు.

* ఈ సీజన్లో పవర్‌ప్లేలో పంజాబ్‌ కింగ్స్‌దే అత్యధిక రన్‌రేట్‌. ఓవర్‌కి 10.94 పరుగులు చేస్తోంది. అయితే గుజరాత్‌కు పవర్‌ప్లేలో అత్యుత్తమ బౌలింగ్‌ సగటు 10.71, ఎకానమీ 6.25 ఉన్నాయి.

* ప్రస్తుతం కొత్త బంతితో చెలరేగుతున్న గుజరాత్‌ పేసర్ మహ్మద్‌ షమికి పంజాబ్‌ ఓపెనర్‌ శిఖర్ ధావన్‌పై రికార్డు బాగాలేదు. 11 ఇన్నింగ్సుల్లో 66 బంతులేసి 103 పరుగులు ఇచ్చాడు. ఒక్కసారీ ఔట్‌ చేయలేదు.

* ఈ సీజన్లో శుభ్‌మన్‌ గిల్‌ స్పిన్‌లో 21 బంతులు ఎదుర్కొన్నాడు. 214 స్ట్రైక్‌రేట్‌తో 45 పరుగులు చేశాడు. అయితే రాహుల్‌ చాహర్‌పై (Rahul chahar) మాత్రం అతడిది వెనుకంజే. మూడు ఇన్నింగ్సుల్లో రెండు సార్లు ఔటయ్యాడు.

* ఈ సీజన్లో పంజాబ్‌ కింగ్స్‌ 33 సిక్సర్లు బాదింది. అగ్రస్థానంలోని రాజస్థాన్‌ రాయల్స్‌ (36) తర్వాతి స్థానం దానిదే. హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) 100 ఐపీఎల్‌ సిక్సర్లకు ఒక సిక్స్‌ దూరంలో ఉన్నాడు.

PBKS vs GT Probable XI

పంజాబ్‌ కింగ్స్‌ (Punjab Kings playing XI): మయాంక్‌ అగర్వాల్‌, శిఖర్‌ ధావన్‌, భానుక రాజపక్స, లియామ్‌ లివింగ్‌స్టన్‌, షారుక్‌ ఖాన్‌, జితేశ్ శర్మ, ఒడీన్‌ స్మిత్‌, అర్షదీప్‌ సింగ్‌, కాగిసో రబాడా, రాహుల్‌ చాహర్‌, వైభవ్‌ అరోరా

గుజరాత్‌ టైటాన్స్‌ (Gujarat Titans): శుభ్‌మన్‌ గిల్‌, మాథ్యూ వేడ్‌, విజయ్‌ శంకర్‌, అభినవ్‌ మనోహర్‌, హార్దిక్‌ పాండ్య, డేవిడ్‌ మిల్లర్‌, రాహుల్‌ తెవాతియా, రషీద్‌ ఖాన్‌, వరుణ్‌ ఆరోన్‌, లాకీ ఫెర్గూసన్‌, మహ్మద్‌ షమి

Published at : 08 Apr 2022 12:46 PM (IST) Tags: IPL IPL 2022 Indian Premier League IPL 2022 Schedule IPL 2022 news ipl season 15 IPL 2022 Live pbks vs gt pbks vs gt preview

సంబంధిత కథనాలు

RR Vs RCB Highlights: బెంగళూరును బాదేసిన బట్లర్ - రెండోసారి ఫైనల్‌కు రాజస్తాన్!

RR Vs RCB Highlights: బెంగళూరును బాదేసిన బట్లర్ - రెండోసారి ఫైనల్‌కు రాజస్తాన్!

RR Vs RCB: ఆఖర్లో తడబడ్డ బెంగళూరు - రాజస్తాన్ ముందు ఈజీ టార్గెట్!

RR Vs RCB: ఆఖర్లో తడబడ్డ బెంగళూరు - రాజస్తాన్ ముందు ఈజీ టార్గెట్!

RR Vs RCB Toss: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాయల్స్ - బ్యాట్లతో సిద్ధం అవుతున్న బెంగళూరు!

RR Vs RCB Toss: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాయల్స్ - బ్యాట్లతో సిద్ధం అవుతున్న బెంగళూరు!

IPL 2022 Final: ఐపీఎల్‌ ఫైనల్‌.. మోదీ, షా భద్రతకు 6000 మంది పోలీసులు!

IPL 2022 Final: ఐపీఎల్‌ ఫైనల్‌.. మోదీ, షా భద్రతకు 6000 మంది పోలీసులు!

RR vs RCB, Qualifier 2: ఈ లెగ్‌ స్పిన్నర్ల దుంపతెగ! సంజూకు హసరంగ, డీకేకు యూజీ భయం!

RR vs RCB, Qualifier 2: ఈ లెగ్‌ స్పిన్నర్ల దుంపతెగ! సంజూకు హసరంగ, డీకేకు యూజీ భయం!

టాప్ స్టోరీస్

NTR Jayanthi: ఎన్టీఆర్ జయంతి - NBK 107 సినిమాలో కత్తి పట్టిన బాలకృష్ణ మాస్ లుక్ విడుదల

NTR Jayanthi: ఎన్టీఆర్ జయంతి - NBK 107 సినిమాలో కత్తి పట్టిన బాలకృష్ణ మాస్ లుక్ విడుదల

TS TET 2022 Exam Date: మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముట్టడికి యత్నం, పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత

TS TET 2022 Exam Date: మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముట్టడికి యత్నం, పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత

NTR Centenary birth celebrations : తెలుగు చరిత్రలో నిలువెత్తు సంతకం ఎన్టీఆర్ !

NTR Centenary birth celebrations :   తెలుగు చరిత్రలో నిలువెత్తు సంతకం ఎన్టీఆర్ !

Roja On Chandra Babu: నాడు నేడు ఎన్టీఆర్‌ పేరు చెబితేనే వణుకు- చంద్రబాబుపై మంత్రి రోజా సెన్సేషనల్ కామెంట్స్

Roja On Chandra Babu: నాడు నేడు ఎన్టీఆర్‌ పేరు చెబితేనే వణుకు- చంద్రబాబుపై మంత్రి రోజా సెన్సేషనల్ కామెంట్స్