IPL 2022 Promo: ఐపీఎల్ 2022 కొత్త ప్రోమో వచ్చేసింది, మ్యాచ్ చూసేందుకు ధోనీ ఏం చేశాడో చూశారా !
MS Dhonis Hilarious Avatar In IPL 2022 Promo: మార్చి 26 నుంచి ఐపీఎల్ 2022 ప్రారంభం కానుండగా, సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ కొత్త అవతారంలో కనిపించారు.
MS Dhonis Hilarious Avatar In IPL 2022 Promo: ఇండియన్ ప్రీమియర్ లీగ్ తాజా సీజన్ (IPL 2022) షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆదివారం విడుదల చేసింది. మార్చి 26 నుంచి ఐపీఎల్ 2022 ప్రారంభం కానుండగా, తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్‌ను మాజీ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ ఢీకొట్టనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఐపీఎల్ కొత్త టైటిల్ పోరు మొదలవుతుంది.
ఐపీఎల్ 2022 కొత్త షెడ్యూల్ వచ్చిన కొంత సమయానికే ఐపీఎల్ ప్రొమోను ఇండియన్ ప్రీమియర్ లీగ్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ రిలీజ్ చేశారు. కుచ్ బీ కరేగా టు వాచ్ టాటా ఐపీఎల్ క్యూంబీ ఏ అబ్ నార్మల్ హై (టాటా ఐపీఎల్ చూసేందుకు ఏమైనా చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు అంతా సాధారణంగా ఉంది) అని ఐపీఎల్ కోసం మీ ప్లాన్స్ ఏంటి అని ఐపీఎల్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఐపీఎల్ కొత్త సీజన్ ప్రోమోలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కొత్త అవతారంలో కనిపించారు.
కొత్త ప్రోమోలో ధోనీ ఎలా ఉన్నాడంటే..
ప్రతి ఏడాది లాగే ఐపీఎల్ 2022 కోసం నిర్వాహకులు ప్రోమోను రిలీజ్ చేశారు. ధోనీ కొత్త లుక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఐపీఎల్ ప్రోమోలో ధోనీ న్యూ అవతార్, ధోనీ ఓల్డ్ లుక్ పై ఫ్యాన్స్ లైక్స్, కామెంట్లతో చెలరేగిపోతున్నారు. ధోనీ ఓల్డ్ లుక్‌లో ఐపీఎల్ చూస్తున్నట్లు కనిపించారు. ఐపీఎల్ చూసేందుకు ఏకంగా పెద్ద అబద్ధాన్ని తన కూతురితో చెప్పించడం ఐపీఎల్ చూసేందుకు తాను ఏమైనా చేస్తానని పెద్దాయన గెటప్‌లో ఉన్న ధోనీ నిరూపించారు.
Kuch bhi karega to watch #TATAIPL, kyunki #YeAbNormalHai! 😉
— IndianPremierLeague (@IPL) March 6, 2022
What's your plan when the action kicks off?
Watch it LIVE on March 26 on @StarSportsIndia & @disneyplus. pic.twitter.com/AnaMttJuDm
ఓల్డ్ లుక్‌తో ఉన్న ధోనీ కొందరు పిల్లలతో కలిపి ఐపీఎల్ మ్యాచ్‌లు చూస్తుంటారు. అంతలోనే ఫోన్ కాల్ వస్తుంది. ధోనీ సైగ చేయడంతో ఆయన కూతురు ఫోన్ ఎత్తగా నాన్నతో మాట్లాడాలని అవతలి వ్యక్తి అడగగా.. తాను చనిపోయానని చెప్పమంటూ కూతురికి ధోనీ సైగ చేస్తాడు. ధోనీ కూతురు అంతే నాటకీయంగా ప్రవర్తిస్తూ పాపా ఔట్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. స్ట్రైక్ లో ఎవరున్నారని అడగగా మహీ అని ఆమెకు చెబుతారు. ఐపీఎల్ చూసేందుకు ఇప్పుడు ఫ్యాన్స్ ఏమైనా చేస్తారని క్యాప్షన్‌తో ప్రొమోను ప్రమోట్ చేశారు. ధోనీ లుక్, కాన్సెప్ట్ ట్రెండింగ్ అవుతోంది.