IPL 2022 Records: ధోని అరుదైన రికార్డు, రెండో భారత క్రికెటర్‌గా మిస్టర్ కూల్ - ఫస్ట్ ఎవరంటే !
IPL 2022 MS Dhoni Records: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ వరుస మ్యాచ్‌లలో రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. ఇటీవల అతిపెద్ద వయసులో ఐపీఎల్ హాఫ్ సెంచరీ చేసిన ధోనీ ఖాతాలో మరో రికార్డు.
MS Dhoni becomes second Indian to play 350 T20 matches: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022) ఆడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ వరుస మ్యాచ్‌లలో రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. ఇటీవల సీజన్ తొలి మ్యాచ్‌లో అత్యధిక వయసులో ఐపీఎల్‌లో హాఫ్ సెంచరీ చేసిన ఆడటగాడిగా నిలిచాడు ధోనీ. ఆపై తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు టీమిండియా మాజీ కెప్టెన్.
పంజాబ్‌తో మ్యాచ్‌లో అరుదైన ఫీట్..
ఆదివారం రాత్రి పంజాబ్ కింగ్స్ (Punjab Kings)తో మ్యాచ్‌లో ధోనీ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో 350 మ్యాచ్‌ల ఫీట్ చేరుకున్నాడు. ఈ క్రమంలో భారత్ నుంచి ఈ ఫీట్ నమోదు చేసిన రెండో భారత క్రికెటర్‌గా నిలిచాడు ధోనీ. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భారత్ నుంచి తొలి స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్లో మొత్తం 372 మ్యాచ్‌లు ఆడాడు. పొట్టి ఫార్మాట్లో 7000 పరుగులు చేసిన ఆరో భారత ఆటగాడు ఎంఎస్ ధోనీ. ఇటీవల లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు.
ధోనీ తప్పుకున్నాక చెన్నైకి ఏమైంది !
సీఎస్కే కెప్టెన్సీ నుంచి ధోనీ తప్పుకున్నాక ఆ జట్టుకు అసలు కలిసి రావడం లేదు. ఐపీఎల్ 2022కు కొన్ని రోజుల ముందు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుని కేవలం ఆటగాడిగా జట్టులో కొనసాగుతానని ధోనీ ప్రకటించి అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఈ సీజన్‌లో సీఎస్కే జట్టు ఆడిన 3 మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైంది. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు సీఎస్కే పగ్గాలు అప్పగించాక, జట్టులో జోష్ కనిపించడం లేదు. మరోవైపు ఆటగాళ్ల వరుస వైఫల్యాలతో హ్యాట్రిక్ ఓటమితో సీజన్ కొనసాగిస్తోంది 4 పర్యాయాలు టైటిల్ నెగ్గిన చెన్నై జట్టు.
భారత్ నుంచి అత్యధిక టీ20లు ఆడిన ఆటగాళ్లు వీరే..
రోహిత్ శర్మ - 375
ఎంఎస్ ధోనీ - 350
సురేష్ రైనా - 336
దినేష్ కార్తీక్ - 329
విరాట్ కోహ్లీ - 328
చెన్నై హ్యాట్రిక్ ఓటములు..
ఐపీఎల్ 2022లో చెన్నైకి వరుసగా మూడో ఓటమి ఎదురైంది. పంజాబ్ కింగ్స్ చేతిలో 54 పరుగుల తేడాతో చెన్నై చిత్తుగా ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. అనంతరం చెన్నై 18 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌట్ అయింది. అర్థ సెంచరీ చేయడంతో పాటు రెండు వికెట్లు కూడా తీసుకున్న లివింగ్‌స్టోన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
Also Read: CSK Vs PBKS: కింగ్స్ పోరులో పంజాబ్ విజయం - ఓటముల్లో చెన్నై హ్యాట్రిక్!
Also Read: Womens World Cup 2022: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ విజేత ఆస్ట్రేలియా - సగర్వంగా మరోసారి