LSG Vs MI: ఓటమి నంబర్ 8 - కొనసాగుతున్న ముంబై పరాజయాల పరంపర - ఎంఐపై రాహుల్ రెండో సెంచరీ!
ఐపీఎల్ 15వ సీజన్‌లో ముంబైకి వరుసగా ఎనిమిదో పరాజయం ఎదురైంది.
ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 36 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. అనంతరం ముంబై 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో కెప్టెన్ కేఎల్ రాహుల్ (103 నాటౌట్: 62 బంతుల్లో, 12 ఫోర్లు, నాలుగు సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన లక్నో బ్యాటర్లు ఘోరంగా నిరాశ పరిచారు. కెప్టెన్ కేఎల్ రాహుల్ మినహా ఎవరూ కాసేపు కూడా క్రీజులో నిలబడలేదు. సెంచరీ చేసిన కేఎల్ రాహుల్ తర్వాత అత్యధిక స్కోరు మనీష్ పాండేదే (22: 22 బంతుల్లో, ఒక సిక్సర్) అంటేనే అర్థం చేసుకోవచ్చు లక్నో బ్యాటింగ్ ఎంత నిరాశాజనకంగా సాగిందో. దీంతో పంజాబ్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేయగలిగింది. దీనిపై ఇన్నింగ్స్ ముగిశాక రాహుల్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశాడు.
170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇన్నింగ్స్ కూడా నిదానంగానే సాగింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (8: 20 బంతుల్లో) క్రీజులో ఉన్నంత సేపు అత్యంత అసౌకర్యంగా కనిపించాడు. అయితే మరో ఎండ్‌లో రోహిత్ శర్మ (39: 31 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) కొంచెం వేగంగా ఆడటంతో ముంబై లక్ష్యం దిశగా సాగింది. రోహిత్ అవుటయ్యాక తిలక్ వర్మ (38: 27 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) చివర్లో వేగంగా ఆడాడు. కీలక సమయంలో తిలక్ అవుట్ కావడం... ఎన్నో ఆశలు పెట్టుకున్న పొలార్డ్ (19: 20 బంతుల్లో, ఒక సిక్సర్) ఘోరంగా విఫలం కావడంతో ముంబై 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 132 పరుగులకు పరిమితం అయింది.
View this post on Instagram