LSG vs RCB, Eliminator: లక్నోదే లక్కు! టాస్ గెలిచిన రాహుల్ - ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్
LSG vs RCB, Eliminator: ఐపీఎల్ 2022 ఎలిమినేటర్ మ్యాచులో టాస్ పడింది. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచాడు.
LSG vs RCB, Eliminator: ఐపీఎల్ 2022 ఎలిమినేటర్ మ్యాచులో టాస్ పడింది. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచాడు. వెంటనే బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ చాలా బాగుందని చెప్పాడు. వాతావరణం చల్లగా ఉంది కాబట్టి స్వింగ్ లభించే అవకాశం ఉందని పేర్కొన్నాడు. కృష్ణప్ప గౌతమ్, జేసన్ హోల్డర్ స్థానంలో కృనాల్ పాండ్య, దుష్మంత చమీరా జట్టులోకి వచ్చారని వివరించాడు. తమ డ్రస్సింగ్ రూమ్ ప్రశాంతంగా ఉందని ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ అన్నాడు. మహ్మద్ సిరాజ్ జట్టులోకి వచ్చాడని పేర్కొన్నాడు.
LSG vs RCB Playing XI
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రర్, దినేశ్ కార్తీక్, షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగ, హర్షల్ పటేల్, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్
లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్, దీపక్ హుడా, కృనాల్ పాండ్య, ఆయుష్ బదోనీ, మార్కస్ స్టాయినిస్, మనన్ వోహ్రా, ఆవేశ్ ఖాన్, దుష్మంత చమీరా, మొహిసిన్ ఖాన్, రవి బిష్ణోయ్
LSG స్వేచ్ఛగా ఆడితేనే!
ఎలిమినేటర్ అంటేనే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది! దానిని చక్కగా ఎదుర్కొన్న వారే విజయం అందుకుంటారు. లక్నో సూపర్ జెయింట్స్ ఈ విషయంలో కాస్త వీక్‌గా ఉంది. ఆల్‌రౌండర్లతో కూడిన ఆ జట్టు ఛేదనలో బోల్తా పడుతోంది. ఛేజింగ్‌కు దిగిన చివరి ఆరు లీగు మ్యాచుల్లో కేవలం రెండింట్లోనే గెలిచారు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (48.8 సగటుతో 537 పరుగులు), క్వింటన్ డికాక్ (38.6 సగటుతో 502 పరుగులు), దీపక్ హుడా (31.2 సగటుతో 406 పరుగులు) కీలకంగా ఉన్నారు. మిగతా వాళ్లు కొట్టింది 17.2 సగటుతో 789 మాత్రమే. అందుకే ఈ మ్యాచులో టాప్-3 కచ్చితంగా రాణించాలి. మార్కస్ స్టాయినిస్, జేసన్ హోల్డర్ మెరుపులు మెరిపించాలి. మిడిలార్డర్ వీక్‌గా ఉన్నా లక్నో ప్లేఆఫ్స్ చేరిందంటే బలమైన బౌలింగ్ లైనప్ ఉండటమే. గాయంతో దూరమైన కృనాల్ వస్తే జట్టు మరింత బలపడుతుంది. ఈడెన్ పిచ్‌పై మెంటార్ గౌతమ్ గంభీర్ వ్యూహాలు కీలకంగా మారతాయి.
RCBలో కోహ్లీ, మాక్సీ కీలకం!
ప్లేఆఫ్స్ చేరుకొనేందుకు ఆర్సీబీ ఇతర జట్లపై ఆధారపడింది. దిల్లీ ఓటమి పాలవ్వడంతో నాకౌట్‌కు వచ్చింది. ఇక నుంచి తమను తామే నమ్ముకోవాలి. కింగ్ విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి రావడం శుభసూచకం. కెప్టెన్ డుప్లెసిస్, మాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్ బ్యాటింగ్‌లో రాణిస్తే తిరుగుండదు. బౌలింగ్ పరంగా జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్ ఇంకా మెరుగ్గా ఆడాలి. స్పిన్ డిపార్ట్ మెంట్ బలంగా ఉంది. మాక్స్‌వెల్‌కు ఫింగర్ స్పిన్నర్ల వీక్‌నెస్ ఉంది. అతడిపై కృనాల్‌ను ప్రయోగించే అవకాశం ఉంది. చేతి గాయంతో ఉన్న హర్షల్ పటేల్ ఫిట్‌నెస్ సాధించాడని అంటున్నారు. లేదంటే ఆకాశ్ దీప్ ఆడాల్సి వస్తుంది. కేఎల్ రాహుల్‌పై మాక్సీకి మంచి రికార్డు ఉండటం సానుకూల అంశం. లీగ్ దశలో లక్నోను ఓడించడం మరో ప్లస్ పాయింట్.
🚨 Toss Update 🚨@LucknowIPL have elected to bowl against @RCBTweets in Eliminator of the #TATAIPL 2022. #LSGvRCB
— IndianPremierLeague (@IPL) May 25, 2022
Follow the match ▶️ https://t.co/cOuFDWIUmk pic.twitter.com/NkIF1x55cF
Eliminator. Lucknow Super Giants won the toss and elected to field. https://t.co/cOuFDWIUmk #Eliminator #TATAIPL #IPL2022
— IndianPremierLeague (@IPL) May 25, 2022