By: ABP Desam | Updated at : 30 Mar 2022 06:36 PM (IST)
Edited By: Ramakrishna Paladi
ఒక్క తీరుగనే ఓడిండ్రు! LSG, CSKలో గెలుపు షురూ చేసేది ఎవరో? @ csk, lsg twitter
IPL 2022, LSG vs CSK Preview: ఐపీఎల్ 2022 ఏడో మ్యాచులో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ (Chennai Superkings), కొత్త జట్టు లక్నో సూపర్‌జెయింట్స్ (Lucknow Supergiants) తలపడుతున్నాయి. ఎంతో చరిత్ర కలిగిన బ్రబౌర్న్ మైదానం (CCI ground) ఇందుకు వేదిక! ఈ సీజన్లో వీరికిది రెండో మ్యాచో! ఈ రెండు జట్లు మొదటి మ్యాచులో ఒకే తరహాలో ఓటమి పాలయ్యాయి. అంటే ఈ పోరుతో ఎవరో ఒకరు గెలుపు ఖాతా ఓపెన్ చేస్తారు. మరి వీరి బలాబలాలేంటి? గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయి?
ఇంతకు ముందు ఏం జరిగింది?
చెన్నైసూపర్ కింగ్స్ మొదటి మ్యాచులో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో (CSK vs KKR) తలపడింది. టిపికల్ వాంఖడే (Wankhede) పిచ్‌లో మొదటి బ్యాటింగ్ చేసి 131/5కు పరిమితమైంది. ప్రత్యర్థి జట్టు దానిని తెలివితో ఛేదించింది. విచిత్రంగా లక్నో సూపర్ జెయింట్స్ (LSG vs GT) ఇదే మైదానంలో గుజరాత్ టైటాన్స్‌తో పోరాడింది. ఆ జట్టు నిర్దేశించిన 159 టార్గెట్‌ను గుజరాత్ ఛేదించింది. ఈ రెండు జట్లకు సీజన్ మొదటి మ్యాచులో సిమిలారిటీస్ ఉన్నాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేశాయి. టాప్ ఆర్డర్లు విఫలమయ్యాయి. మిడిలార్డర్ బ్యాటర్లు కాస్త రక్షించారు. ఆ తర్వాత డ్యూ కురవడంతో అపోజిషన్ టీమ్స్ టార్గెట్లను ఛేదించాయి.
చెన్నై (CSK) పరిస్థితి ఏంటి?
కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) మొదట్లో కాస్త తడబడి టీమ్‌మేట్స్‌ను రనౌట్ చేయించాడు. ఎంఎస్ ధోనీ (MS Dhoni) చాలా వరకు మైదానంలో ఫీల్డింగ్‌ను సెట్ చేస్తూ కనిపించాడు. మొదట బ్యాటింగ్ కావడం, వాంఖడేలో టైట్‌లైన్స్‌లో ఇన్‌స్వింగింగ్, ఔట్‌స్వింగింగ్ బంతులు ఎదుర్కోలేక ఇబ్బంది పడ్డారు. మాజీ కెప్టెన్ ధోనీ కొన్నేళ్ల తర్వాత హాఫ్ సెంచరీ చేసి వారికి గట్టెక్కించాడు. ఈ మ్యాచులో ఓపెనర్లు రుతురాజ్ (Ruturaj Gaikwad), కాన్వే రాణించాల్సిందే. లేదంటే మళ్లీ తిప్పలు తప్పవు. డ్వేన్ బ్రావో (Dwane Bravo) 3 వికెట్లు తీసి తనలో పస తగ్గలేదని నిరూపించాడు. మిగతా బౌలర్లు అనుకున్నంత రాణించలేదు. ఈ మ్యాచుకు మొయిన్ అలీ (Moeen Ali) వస్తున్నాడు కాబట్టి ఒక విదేశీ ఆటగాడు తప్పుకోవాల్సిందే. ఆడమ్ మిల్న్ లేదా మిచెల్ శాంట్నర్‌లో ఒకరికి చోటుండదు. శాంట్నర్‌ను తీసేస్తే వీరికి స్పెషలిస్టు స్పిన్నర్ ఉండడు. బ్రబౌర్న్‌లోనూ టాస్ ఓడితే ఎలా ఆడాలన్నది వీరి ముందున్న అతిపెద్ద సవాల్.
KL Rahul పై ఒత్తిడి!
లక్నో సూపర్ జెయింట్స్ (LSG) విజయం సాధించాలంటే టాప్ ఆర్డర్ కచ్చితంగా ఆడాల్సిందే. గుజరాత్ పేసర్ షమి బౌలింగ్‌కు రాహుల్ సేన విలవిల్లాడింది. కేఎల్, డికాక్ (Quinton Decock), పాండేను (Manish Panday) ఔట్ చేయడంతో స్కోరులో వెనకబడింది. ఈ మ్యాచులో మాత్రం టాప్ ఆర్డర్లో కనీసం ఇద్దరు రాణిస్తేనే మంచింది. కెప్టెన్ రాహుల్‌పై కాస్త ఒత్తిడి ఉంది. మిడిలార్డర్‌లో దీపక్ హుడా (Deepak Hooda), ఆయుష్ బదోనీ (Aayush Badoni) హాఫ్ సెంచరీలు చేయడం, కృనాల్ (Krunal Pandya) బౌండరీలు బాదడం ప్లస్ పాయింట్. హోల్డర్, స్టాయినిస్, ఆండ్రూ టై వస్తే ఈ జట్టు భీకరంగా మారుతుంది. బౌలింగ్‌లో లక్నో ఫర్వాలేదు. దుష్మంత చమీరా చక్కని పేస్ జనరేట్ చేస్తున్నాడు. అవేశ్ ఖాన్ (Avesh Khan) ఫర్వాలేదు. కృనాల్ పరుగుల్ని నియంత్రించాడు. బిష్ణోయ్‌కు (Ravi Bishnoi) కలిసి రాలేదు. బౌలర్లను ఉపయోగించుకోవడంలో రాహుల్ ఇంకా పరిణతి కనబరచాలి. దీపక్ హుడాకు డెత్‌లో బౌలింగ్ ఇవ్వడంతో ఒక ఓవర్లో ఎక్కువ పరుగులు వచ్చాయి. దాంతో మ్యాచ్ గమనం మారిపోయింది. బాగా వేస్తున్న చమీరాకు 3 ఓవర్లే ఇవ్వడం ఆశ్చర్యం.
Brabourne Stadiumలో టాసే హీరో!
బ్రబౌర్న్‌లో పరిస్థితులు వాంఖడే మాదిరిగానే ఉంటాయి. ఈ రెండు స్టేడియాల మధ్య దూరం మరీ ఎక్కువేమీ ఉండదు. మంచు ప్రభావం అతిగా ఉంటుంది. అయితే తొలుత బ్యాటింగ్ చేస్తున్న జట్టు పవర్‌ప్లేలో ఓపికగా ఆడితే తర్వాత పరుగులు చేయొచ్చు. బౌలర్లైతే జాగ్రత్తగానే ఉండాలి. ఈ సీజన్లో ఇక్కడ జరిగిన మొదటి మ్యాచులో ఛేజింగ్ చేసిన జట్టే గెలిచింది. టాస్ కీలకం.
IPL 2024 Retention List: రాకపోకలు ముగిశాక, ప్రాంఛైజీల పరిస్థితి ఇలా ఉంది
IPL 2024 : ముంబై గూటికి హార్దిక్ పాండ్యా , రెండు గంటల్లోఇన్ని ట్విస్ట్‌లా..?
IPL 2024 Retentions: ఐపీఎల్‌లో జట్లు వదులుకున్న ఆటగాళ్లు , షాక్ ఇచ్చిన కొందరి ఆటగాళ్ల రిలీజ్
IPL 2024: ఐపీఎల్ సందడి ఎప్పటినుంచంటే.? - వేలానికి సమీపిస్తున్న గడువు
Hardik Pandya: ముంబై గూటికి హార్దిక్ పాండ్యా! , ఐపీఎల్ చరిత్రలో భారీ ట్రేడ్ జరుగుతుందా?
Fire Accident: హైదరాబాద్‌లో భారీ ప్రమాదం, రూ.2 కోట్ల దాకా ఆస్తి నష్టం
Hyderabad Poll Queue Status: హైదరాబాద్ ఓటర్లకు గుడ్ న్యూస్, క్యూ లైన్లో ఎందరున్నారో ఇలా చెక్ చేసుకోండి
Telangana Elections: హైదరాబాద్ లో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం, ముగ్గురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు!
Sandeep Reddy Vanga : ‘స్పిరిట్’ విడుదల తేదీని రివీల్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా!
/body>