IPL Updates: రాజస్తాన్‌పై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా - తుదిజట్లలో మార్పులు - ఎవరు వచ్చారంటే?
ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్ 2022 సీజన్ 47వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రాజస్తాన్, కోల్‌కతా ఈ సీజన్‌లో ఇప్పటికే ఒకసారి తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో రాజస్తాన్ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో రాజస్తాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్ కూడా తొమ్మిది మ్యాచ్‌లు ఆడి కేవలం మూడు విజయాలు మాత్రమే సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం కోల్‌కతాకు ఎంతో కీలకం.
సూపర్ ఫాంలో రాజస్తాన్
రాజస్తాన్ రాయల్స్ ఈ సీజన్‌లో సూపర్ ఫాంలో ఉంది. ఓపెనర్ జోస్ బట్లర్ 566 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ సాధించాడు. ఇందులో ఏకంగా మూడు సెంచరీలు ఉన్నాయి. తన స్ట్రైక్ రేట్ కూడా 155.06గా ఉంది. దేవ్‌దత్ పడిక్కల్, సంజు శామ్సన్ మంచి టచ్‌లో ఉన్నారు. షిమ్రన్ హెట్‌మేయర్, రియాన్ పరాగ్ అప్పుడప్పుడు మెరుపులు మెరిపించారు. రవిచంద్రన్ అశ్విన్‌కు కూడా బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉంది.
బౌలింగ్ విషయంలో కూడా రాజస్తాన్ బలంగానే ఉంది. తొమ్మిది మ్యాచ్‌ల్లో 19 వికెట్లు తీసిన యుజ్వేంద్ర చాహల్ పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా ఉన్నాడు. ఈ సీజన్‌లో నమోదైన ఏకైక హ్యాట్రిక్ కూడా తనదే. ట్రెంట్ బౌల్ట్, ప్రసీద్ కృష్ణ, కుల్దీప్ సేన్‌లతో పేస్ దళం కూడా స్ట్రాంగ్‌గా ఉంది. స్పిన్‌లో చాహల్, అశ్విన్ ద్వయం దూసుకుపోతుంది.
కోల్‌కతా సీన్ రివర్స్
ఇక కోల్‌కతా విషయంలో మాత్రం సీన్ రివర్స్. ఈ ఆటగాడు నిలబడి మ్యాచ్ గెలిపించగలడు అని చెప్పదగ్గ ప్లేయర్ కోల్‌కతాలో కరువయ్యాడు. బ్యాట్స్‌మెన్ అంతా అవుట్ ఆఫ్ ఫాంలో ఉన్నారు. ఆరోన్ ఫించ్, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ ఎవరూ చెప్పుకోదగ్గ ఫాంలో లేరు. తొమ్మిది మ్యాచ్‌లాడి 290 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యరే కోల్‌కతా తరఫున ఈ ఏడాది టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. ఆండ్రీ రసెల్, నితీష్ రాణా అప్పుడప్పుడు మెరుపులు మెరిపిస్తున్నారు.
బౌలింగ్‌లో కూడా కోల్‌కతా ప్రభావం ఈ సీజన్‌లో అంత లేదని చెప్పాలి. ఉమేష్ యాదవ్ ఈ సీజన్‌లో 14 వికెట్లు తీసుకున్నాడు. సునీల్ నరైన్ పరుగులు కంట్రోల్ చేస్తున్నా వికెట్లు తీయలేకపోతున్నాడు. టిమ్ సౌతీ కూడా ఈ సీజన్‌లో ఇంతవరకు మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు.
తుది జట్ల విషయంలో రెండు జట్లూ మార్పులు చేశాయి. రాజస్తాన్ రాయల్స్ డేరిల్ మిషెల్ స్థానంలో కరుణ్ నాయర్‌ను జట్టులోకి తీసుకుంది. ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్ వెంకటేష్ అయ్యర్ స్థానంలో అనుకుల్ రాయ్‌ని, హర్షిత్ రాణా స్థానంలో శివం మావిని జట్టులోకి తీసుకుంది.
రాజస్తాన్ రాయల్స్ తుదిజట్టు
జోస్ బట్లర్, దేవ్‌దత్ పడిక్కల్, సంజు శామ్సన్ (కెప్టెన్, వికెట్ కీపర్), కరుణ్ నాయర్, షిమ్రన్ హెట్‌మేయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసీద్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ సేన్
కోల్‌కతా నైట్‌రైడర్స్ తుదిజట్టు
ఆరోన్ ఫించ్, అనుకుల్ రాయ్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, బాబా ఇంద్రజిత్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌతీ, శివం మావి
View this post on Instagram