By: ABP Desam | Updated at : 10 Apr 2022 03:08 PM (IST)
Edited By: Ramakrishna Paladi
టాస్ గెలిచిన కేకేఆర్! పంత్ సేనలో ఒక కీలక మార్పు
IPL 2022, KKR vs DC: దిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచులో కోల్‌కతా నైట్‌రైడర్స్ టాస్ గెలిచింది. వెంటనే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. పంత్ సేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. జట్టులో ఎలాంటి మార్పులు లేవని ప్రకటించాడు. వికెట్ బాగుండటంతో తొలుత బ్యాటింగ్ చేసేందుకు ఇబ్బందేమీ లేదని రిషభ్ పంత్ అన్నాడు. ఆన్రిచ్ నోకియా స్థానంలో ఖలీల్ అహ్మద్‌ను తీసుకున్నామని వెల్లడించాడు.
KKR Playing XI
కోల్‌కతా నైట్‌రైడర్స్: వెంకటేశ్ అయ్యర్, అజింక్య రహానె, శ్రేయస్ అయ్యర్, శామ్ బిల్లింగ్స్, నితీశ్ రాణా, ఆండ్రీ రసెల్, ప్యాట్ కమిన్స్, సునిల్ నరైన్, ఉమేశ్ యాదవ్, రసిక్ సలామ్, వరుణ్ చక్రవర్తి
DC Playing XI
దిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, లలిత్ యాదవ్, రోమన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్‌దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్
kkr vs dc సమవుజ్జీలే అయినా!
ఈ ఏడాది కోల్‌కతా నైట్‌రైడర్స్ అత్యంత బలంగా కనిపిస్తోంది. శ్రేయస్ రాకతో వారిలో ఉత్సాహం మరింత పెరిగింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ డెప్త్ అద్భుతంగా ఉంది. సునిల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌తో ప్రత్యర్థులు విలవిల్లాడుతున్నారు. బ్యాటింగ్‌లోనూ ఒకరు కాకపోతే మరొకరు రెచ్చిపోతున్నారు. అందుకే ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడు గెలిచిన కేకేఆర్ పాయింట్ల పట్టికలో నంబర్ వన్ పొజిషన్లో ఉంది. ఇక దిల్లీ క్యాపిటల్స్‌లోనూ తిరుగులేని క్రికెటర్లు ఉన్నారు. బౌలింగ్ అటాక్ సైతం బాగుంది. అయితే అదృష్టం కలిసి రావడం లేదు. బ్యాటర్లు అప్పుడప్పుడు చేతులెత్తేస్తున్నారు. నిలకడ లోపం సరిదిద్దుకుంటే వారు ఏమైనా చేయగలరు. ఈ సీజన్లో మూడు మ్యాచులాడిన పంత్ సేన ఒకటి గెలిచి ఏడో స్థానంలో ఉంది.
KKRదే ఆధిపత్యం
🚨 Team News 🚨@KKRiders remain unchanged. @DelhiCapitals make 1⃣ change as Khaleel Ahmed is named in the team.
— IndianPremierLeague (@IPL) April 10, 2022
Follow the match ▶️ https://t.co/4vNW3LXMWM#TATAIPL | #KKRvDC
A look at the Playing XIs 🔽 pic.twitter.com/AoIeiV4OD0
🚨 Toss Update 🚨@KKRiders have elected to bowl against @DelhiCapitals.
— IndianPremierLeague (@IPL) April 10, 2022
Follow the match ▶️ https://t.co/4vNW3LXMWM#TATAIPL | #KKRvDC pic.twitter.com/KZqJgNQoTQ
Suryakumar Yadav: సూర్యకుమార్ 3 వన్డేల్లో 3 డక్స్! మర్చిపోతే మంచిదన్న సన్నీ!
IPL 2023: రెస్ట్ గురించి అడిగితే.. ఆటగాళ్లు ఫ్రాంచైజీల సొంతమంటున్న రోహిత్!
MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!
MIW Vs DCW: తడబడ్డ ముంబై బ్యాటర్లు - తక్కువ స్కోరుకే పరిమితం!
IPL 2023: కైల్ జేమీసన్ స్థానంలో కొత్త బౌలర్‌ను తీసుకున్న చెన్నై - ఎవరికి ప్లేస్ దక్కిందంటే?
TSPSC Exams : రాజకీయంలో చిక్కుకుపోతున్న టీఎస్‌పీఎస్సీ - మళ్లీ పరీక్షలు ఎప్పుడు ?
Sajjala On Mlc Results : టీడీపీకి ఓటు వేసిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలెవరో తెలుసు, డబ్బులు ఆశచూపి ప్రలోభపెట్టారు- సజ్జల
పేపర్ లీక్ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు
CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ