IPL 2022, KKR vs CSK: అయ్యో జడ్డూ! ఫస్ట్ మ్యాచుకు 24 గంటల ముందు 3 ప్రాబ్లమ్ వచ్చిపడ్డాయే!
Ravindra Jadeja: ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్‌కు చెన్నై సూపర్‌కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ సిద్ధంగా ఉన్నాయి. తొలి మ్యాచుకు 24 గంటల ముందు సీఎస్‌కే కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజాకు మూడు ప్రాబ్లమ్స్ వచ్చిపడ్డాయి!
IPL 2022, KKR vs CSK Three Big Selection decisions in front of CSK Captain Ravindra Jadeja Before KKR game: ఐపీఎల్ 15వ సీజన్‌కు మరికొన్ని గంటలే మిగిలున్నాయి. తొలి మ్యాచ్ ఆడేందుకు డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్, రన్నరప్ కోల్‌కతా నైట్‌రైడర్స్ సిద్ధంగా ఉన్నాయి. సరిగ్గా తొలి మ్యాచుకు 24 గంటల ముందు సీఎస్‌కే కొత్త కెప్టెన్‌కు రవీంద్ర జడేజాకు మూడు సెలక్షన్ ప్రాబ్లమ్స్ వచ్చిపడ్డాయి!
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో పోరులో చెన్నై సూపర్‌కింగ్స్ తుది జట్టును ఎంపిక చేయడం రవీంద్ర జడేజాకు పెద్ద సవాలే! ఎందుకంటే మొయిన్ అలీ, దీపక్ చాహర్, డ్వేన్ ప్రిటోరియస్ బదులు ఎవరిని తీసుకోవాలో అర్థం కావడం లేదు. వాస్తవంగా ఎప్పుడో రావాల్సిన మొయిన్ అలీ ఆలస్యంగా ఇండియాకు వచ్చాడు. వీసా సమస్య వల్ల అతడి రాక ఆలస్యమైంది. దాంతో ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నాడు. కేకేఆర్ మ్యాచుకు అందుబాటులో ఉండటం లేదు. అతడి స్థానంలో డ్వేన్ బ్రావోను జడ్డూ తీసుకొనే అవకాశముంది.
గాయపడటం వల్ల సీఎస్‌కే ప్రధాన పేసర్ దీపక్ చాహర్ సగం సీజన్ వరకు ఆడలేని పరిస్థితి. ముంబయిలో విజయాలు సాధించాలంటే అలాంటి బౌలర్ అవసరం. తేమ, ఉక్కపోత పరిస్థితుల్లో దీపక్ చాహర్ బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ వికెట్లు తీస్తాడు. అతడు జోష్‌లో ఉంటే తొలి ఎనిమిది ఓవర్లలోనే ధోనీ నాలుగు ఓవర్లు ఇచ్చేవాడు. అతడి స్థానంలో ఆడమ్ మిల్న్‌కు అవకాశం ఇవ్వాల్సి వస్తోంది. దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ డ్వేన్ ప్రిటోరియస్ సైతం ఆలస్యంగానే వచ్చాడు. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నాడు. అతనుంటే జట్టు కూర్పు కాస్త మెరుగ్గా ఉండేది!
Passing the rein! 🧊➡️🔥
— Chennai Super Kings (@ChennaiIPL) March 25, 2022
Watch the full 📹 👉 https://t.co/vS9BSJ01er#WhistlePodu #Yellove 🦁💛 @msdhoni @imjadeja pic.twitter.com/HwcyHSSaUS
చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్‌గా ఎంపికవ్వడంపై రవీంద్ర జడేజా (Ravindra Jadeja) స్పందించాడు. తనను నమ్మి ఇంతపెద్ద బాధ్యతలను అప్పగించినందుకు సంతోషంగా ఉందన్నాడు. అయితే తాను భర్తీ చేయాల్సింది ఎంఎస్ ధోనీ (MS Dhoni) పాత్రనని పేర్కొన్నాడు. అదంత సులభం కాదని వెల్లడించాడు. అతడి వారసత్వం ముందుకు తీసుకెళ్లడం కష్టంతో కూడుకున్న పనిగా వర్ణించాడు.
జడ్డూ స్పందించిన వీడియోను సీఎస్‌కే (CSK) తన ట్విటర్లో పెట్టింది. 'జడ్డూ ఫస్ట్ రియాక్షన్' అని కామెంట్ పెట్టింది. 'చాలా బాగుంది. అదే సమయంలో నేను భర్తీ చేసేదీ చిన్న బాధ్యతను కాదు. మహీ భాయ్ ఇప్పటికే గొప్ప వారసత్వాన్ని సృష్టించాడు. దానిని నేను కొనసాగించాల్సి ఉంది' అని జడ్డూ అన్నాడు. 'నేనేం పెద్దగా ఆందోళన చెందడం లేదు. ఎందుకంటే ధోనీ భాయ్ నా పక్కనే ఉంటాడు. నాకే అవసరం వచ్చినా అతడివద్దకు వెళ్తాను. అతనెప్పటికీ నాతోనే ఉంటాడు. అందుకే నాకు వర్రీ లేదు. మీ అందరి విషెస్, లవ్‌కు ధన్యవాదాలు. మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి' అని జడ్డూ అన్నాడు.